బ్యాంక్ షేర్లు ఉన్నాయా? Q4 ఫలితాల తర్వాత నిపుణుల షాకింగ్ రేటింగ్స్.. ఆ స్టాక్ మాత్రం అమ్మేయండి!

భారత స్టాక్ మార్కెట్ (stock market) లో బ్యాంకింగ్ రంగానికి అత్యంత కీలకమైన స్థానం ఉంది. తాజాగా ముగిసిన నాలుగో త్రైమాసిక (Q4FY26) ఫలితాల సీజన్ తర్వాత, ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ 'జేఎమ్ ఫైనాన్షియల్' (JM Financial) బ్యాంకింగ్ రంగానికి సంబంధించి ఒక సెక్టార్ రివ్యూ నోట్‌ను విడుదల చేసింది. గడచిన ఆర్థిక సంవత్సరం బ్యాంకులు మంచి లోన్ గ్రోత్‌తో, స్థిరమైన ఆదాయాలతో ముగించాయని.. వచ్చే ఆర్థిక సంవత్సరం (FY27) లోనూ బ్యాంకింగ్ రంగం పాజిటివ్‌గా ఉండబోతోందని పేర్కొంది.

అయితే, డిపాజిట్ల సేకరణలో పోటీ, వడ్డీ రేట్ల పెరుగుదల, అసెట్ క్వాలిటీ (ఆస్తుల నాణ్యత) వంటి అంశాలను నిరంతరం పర్యవేక్షించాల్సి ఉంటుందని హెచ్చరించింది. బలమైన నెట్‌వర్క్, వైవిధ్యమైన లోన్ బుక్ ఉన్న బ్యాంకులు మార్కెట్లో అద్భుతంగా రాణిస్తాయని చెప్తూ.. ఏయే బ్యాంకు షేర్లను కొనాలి, వేటిని అమ్మాలి అనేదానిపై క్లారిటీ ఇచ్చింది.

HDFC YES Bank ICICI Kotak SBI Axis Bank Buy Sell Hold Post Q4 Stock Market Picks

'బై' (Buy) రేటింగ్ ఉన్న బ్యాంకులు..

బ్రోకరేజ్ సంస్థ కొన్ని టాప్-టైర్ బ్యాంకులను కొనుగోలు చేయాల్సిందిగా (Buy) సిఫార్సు చేసింది. రాబోయే రోజుల్లో ఇవి మంచి రిటర్న్స్ ఇస్తాయని అంచనా వేసింది.

  • ప్రైవేట్ రంగంలో: ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI Bank), యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) లతో పాటు సిటీ యూనియన్ బ్యాంక్, డీసీబీ బ్యాంక్‌లు 'బై' లిస్ట్‌లో ఉన్నాయి.
  • ప్రభుత్వ రంగంలో: ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSU) నుంచి కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) మాత్రమే 'బై' రేటింగ్‌ను దక్కించుకోవడం విశేషం.
  • స్మాల్ ఫైనాన్స్ విభాగంలో: ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ (Ujjivan SFB) బెస్ట్ పిక్‌గా నిలిచింది.

'యాడ్' (Add/Hold) రేటింగ్ ఉన్న బ్యాంకులు..

  • ఈ కేటగిరీలోని షేర్లను ప్రస్తుతానికి హోల్డ్ చేయవచ్చు లేదా రేట్లు తగ్గినప్పుడు పోర్ట్‌ఫోలియోకు యాడ్ చేసుకోవచ్చు.
  • ప్రైవేట్ రంగానికి చెందిన దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank), కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, బంధన్ బ్యాంక్‌లు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.
  • ప్రభుత్వ రంగం నుండి బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) , ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌లకు కూడా 'యాడ్' రేటింగ్‌ ఇచ్చారు.

'రెడ్యూస్' లేదా 'సెల్' (Sell) రేటింగ్ ఉన్న బ్యాంకులు..

కొన్ని బ్యాంకుల ఆర్థిక పరిస్థితి, ఫలితాల ఆధారంగా బ్రోకరేజ్ సంస్థ వాటిపై కాస్త నెగటివ్ వైఖరిని ప్రదర్శించింది.

  • ఫెడరల్ బ్యాంక్, ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లతో పాటు ప్రభుత్వ రంగానికి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) లకు 'రెడ్యూస్' (వాటాలను తగ్గించుకోండి) రేటింగ్ ఇచ్చారు.
  • అయితే, అందరినీ షాక్‌కు గురిచేస్తూ.. క్యూ4 ఫలితాల తర్వాత కేవలం యెస్ బ్యాంక్ (YES Bank) కు మాత్రమే ఈ బ్రోకరేజ్ సంస్థ 'సెల్' (అమ్మేయండి) రేటింగ్‌ను ఇచ్చింది.

ఇన్వెస్టర్లు తమ పెట్టుబడి వ్యూహాలను మార్చుకోవడానికి ఈ నివేదిక ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే స్టాక్ మార్కెట్(stock market) లో ఇన్వెస్ట్ చేసే ముందు సొంతంగా రీసెర్చ్ చేయడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+