HDB IPO(హెచ్ డి బి ఐపీఓ): భారత స్టాక్ మార్కెట్లో ఈ ఏడాది HDFC బ్యాంక్ నేతృత్వంలో అది పెద్ద IPO స్టార్ట్ అయింది. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న హెచ్‌డిబి ఐపీఓ వచ్చేసింది. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ HDFC బ్యాంక్ అనుబంధ సంస్థ NBFC కంపెనీ HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ నిధుల సమీకరణ కోసం ఈ రోజు HDB IPO ని ప్రారంభించింది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ రూ. 12, 500 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025లో ఇప్పటివరకు జరిగిన ఐపీఓల్లో ఇదే అతిపెద్ద IPOగా చెప్పుకోవచ్చు. ఈ నెల 27 వరకు ఈ ఐపీఓ అందుబాటులో ఉంటుంది.
HDB Financial Services IPOలో భాగంగా కంపెనీ ఒక్కో షేరు ధరను రూ.700 నుంచి రూ. 740 మధ్య నిర్ణయించింది. ఐపీఓ ప్రారంభించడానికి ముందు జీఎంపీ ధరను రూ. 74గా కంపెనీ ప్రకటించింది. జీఎంపీ అంటే గ్రే మార్కెట్ ప్రీమియం.. IPO లిస్టింగ్ ప్రక్రియకు ముందు గ్రే మార్కెట్‌లో వర్తకం చేయబడిన ధర ఇది. దీని ప్రకారం.. ఈ కంపెనీ షేర్లను స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా చేయడానికి ముందే కొనుగోలు చేయడం లేదా విక్రయించడం వంటివి చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే.. గ్రే మార్కెట్‌లో IPO ఇష్యూ ధర కంటే ఎక్కువ చెల్లించడానికి పెట్టుబడిదారు ఇష్టపడే ప్రీమియం ధరను గ్రే మార్కెట్ ప్రీమియం అంటారు. ప్రస్తుతం HDB Financial Services షేర్ ధర ఇష్యూ ధర కంటే 10% ఎక్కువగానే ఉంది.

ఇక HDB Financial Services ఐపీఓ ద్వారా పెట్టుబడిదారులకు రూ.2,500 కోట్ల విలువైన కొత్త షేర్లను జారీ చేస్తారు.ఇక HDFC బ్యాంక్ రూ.10,000 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయిస్తుంది.HDFC బ్యాంక్ ప్రస్తుతం HDB Financial Services కంపెనీలో 95.5% వాటాను కలిగి ఉంది. ఇక HDB దేశంలోని అతిపెద్ద NBFC కంపెనీలలో ఒకటిగా ఉంది. కంపెనీ లోన్ బుక్ మార్చి 31, 2025 నాటికి రూ.1.06 లక్షల కోట్లుగా ఉంది. ఇక FY25లో కంపెనీ రూ.2,176 కోట్ల లాభాన్ని ఆర్జించింది. గత సంవత్సరం ఈ లాభం రూ.1,359 కోట్లుగా ఉంది.
ఇక తాజా అప్ డేట్ ఏంటంటే.. HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ రోజు ఐపీఓ ప్రారంభంలోనే పెట్టుబడిదారుల నుంచి రూ.3,369 కోట్లు సేకరించింది. మొత్తం రూ.12,500 కోట్ల సమీకరణలో భాగంగా పెట్టుబడిదారులు ఇప్పటికే రూ.3,369 కోట్లతో HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు కొనుగోలు చేశారు. కంపెనీకి సంబంధించిన 4.55 కోట్లకు పైగా ఈక్విటీ షేర్లను ఒక్కొక్కటి రూ.740 చొప్పున.. LIC, ICICI ప్రుడెన్షియల్ MF, SBI MF, నిప్పాన్ ఇండియా MF, బ్లాక్‌రాక్, మోర్గాన్ స్టాన్లీ, అలియాంజ్ గ్లోబల్ ఇన్వెస్టర్లు, బైలీ గిఫోర్డ్, రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా, నార్వే ప్రభుత్వ పెన్షన్ ఫండ్ గ్లోబల్ వంటి టాప్ పెట్టుబడి దారులు సొంతం చేసుకున్నారు.
అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, ఫిడిలిటీ ఇన్వెస్ట్‌మెంట్స్, ష్రోడర్స్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్ప్, సొసైటీ జనరల్ వంటి పెట్టుబడిదారులు కూడా HDB Financial Servicesలో షేర్లు కొనేందుకు పోటీ పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరో విషయం ఏంటంటే.. దాదాపు 1.94 కోట్ల షేర్లను 65 పథకాల ద్వారా 22 దేశీయ మ్యూచువల్ ఫండ్లకు కంపెనీ కేటాయించింది. ఈ కంపెనీ విలువ దాదాపు రూ. 61, 400 కోట్లుగా అంచనా వేయగా జూలై 2 నుంచి కంపెనీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో లిస్ట్ కానున్నాయి.
HDB Financial Services కంపెనీకి దేశ వ్యాప్తంగా 1,200 నగరాలు, పట్టణాల్లో దాదాపు 1,700 కంటే ఎక్కువ శాఖలు కలిగి ఉంది.ఈ కంపెనీకి 1.9 కోట్లకు పైగా కస్టమర్లు ఉన్నారు. వ్యక్తిగత రుణాలు, బంగారు రుణాలు, చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు (SMEలు) రుణాలను ఈ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. కంపెనీ షేర్ల ద్వారా వచ్చే నిధులను వ్యాపారం విస్తరించడానికి ఉపయోగించనుంది. ఇక ఆఫర్ ఫర్ సేల ద్వారా వచ్చే మొత్తం HDFC బ్యాంక్ ఖాతాలోకి వెళుతుంది. అయితే ఈ ఐపీఓ తర్వాత HDFC బ్యాంక్ వాటా తగ్గనుంది.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications