HDB Financial Services IPO: జూన్ 25న ప్రారంభమైన HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రూ. 12,500 కోట్ల మెగా ఐపీఓ ఇష్యూ జూన్ 27న ముగిసింది. ఇష్యూ చివరి రోజున HDB ఫైనాన్షియల్ సర్వీసెస్ IPO రికార్డు సెట్ చేసింది. మొత్తంగా 13.04 కోట్ల షేర్లు విక్రయానికి ఉంచగా, దానికి గాను 217.7 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. అంటే ఈ ఐపీవోకు 16.69 రెట్లు ఎక్కువగా సబ్‌స్క్రిప్షన్ జరిగింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనుబంధ సంస్థ హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ IPO దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందనను నమోదు చేసింది. మొత్తం రూ. 12,500 కోట్ల విలువగల ఈ ఆఫరింగ్‌కి, రూ. 10,000 కోట్లకు పైగా ఉన్న ఐపీవోలలో రెండవ అత్యధికంగా సబ్‌స్క్రయిబ్ అయిన ఐపీవోగా గుర్తింపు లభించింది. ఈ ఐపీవోకు రూ. 1.6 లక్షల కోట్ల విలువైన బిడ్లు వచ్చాయి, ఇది గతంలో టాటా టెక్నాలజీస్ (₹1.56 లక్షల కోట్లు) వందల కోట్లు అధిగమించగా, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ (₹3 లక్షల కోట్లు) తర్వాతి స్థానంలో నిలిచింది. ఇది హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌కు మాత్రమే కాక, భారత ఐపీవో మార్కెట్‌కి కూడా గొప్ప విజయంగా నిలిచింది. ముఖ్యంగా సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి భారీ స్పందన ఉండటమే ఈ స్థాయిలో సక్సెస్‌కు ప్రధాన కారణం.

ప్రతి షేర్ ధర రూ. 700 - రూ 740 మధ్యలో ఉండగా మొత్తం బిడ్ల విలువ సుమారు రూ. 1.61 లక్షల కోట్లకు చేరింది. ఇది గతంలో టాటా టెక్నాలజీస్ ఐపీవోకు వచ్చిన రూ. 1.56 లక్షల కోట్ల బిడ్ల కంటే అధికమే అయినా.. 2024లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌కు వచ్చిన రూ. 3 లక్షల కోట్ల బిడ్లతో పోల్చితే కొంచెం తక్కువగా చెప్పుకోవచ్చు.ఈ ఐపీవోకు అత్యధిక స్పందన క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్లు (QIBs) నుండి వచ్చింది. వారికోసం కేటాయించిన షేర్లకు 55 రెట్లు ఎక్కువగా బిడ్లు వచ్చాయి. అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఈ ఇష్యూకు అత్యంత ఉత్సాహంగా స్పందించినట్టు తెలుస్తోంది.
రిటైల్ ఇన్వెస్టర్లు,HDFC బ్యాంక్ ఈజ్డింగ్ షేర్‌హోల్డర్లు, HDB ఉద్యోగులు కూడా తమ తమ కోటాలో షేర్లకు బిడ్లు వేసినప్పటికీ, వీరిలో రిటైల్ విభాగం మాత్రమే ఇతర విభాగాలతో పోల్చితే తక్కువగా సబ్‌స్క్రయిబ్ అయింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే హెచ్‌డీబీ ఫైనాన్షియల్ ఐపీవోకి దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభించిందని చూపిస్తున్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనుబంధ సంస్థ అయిన హెచ్‌డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ఐపీవోను జూన్ 2న ప్రారంభించగా తొలుత మందకొడిగా సాగింది. అయినప్పటికీ చివరి రోజు బ్లాక్‌బస్టర్ ఆఫరింగ్‌గా నిలిచింది. మొత్తం షేర్లకు దాదాపు 17 రెట్లు అధికంగా పెట్టుబడిదారుల నుంచి స్పందన వచ్చింది. ఈ బిడ్లలో అధిక భాగం సంస్థాగత పెట్టుబడిదారుల (QIBs) వర్గం నుంచి వచ్చింది. వారికోసం కేటాయించిన షేర్లకు 55 రెట్లు ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి. మిగతా విభాగాల్లో స్పందన తక్కువగా ఉండగా, HNI వర్గం 10 రెట్లు, రిటైల్ విభాగం కేవలం 1.41 రెట్లు మాత్రమే సబ్‌స్క్రైబ్ అయింది. ఉద్యోగులకు కేటాయించిన భాగానికి 5.7 రెట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాటాదారుల కోటాకు 4.3 రెట్లు బిడ్లు వచ్చాయి.
అయితే, గ్రే మార్కెట్‌లో ప్రీమియం తక్కువగా ఉండటంతో చిన్న పెట్టుబడిదారుల నుంచి స్పందన అంతగా లేదు. షేర్లు కేవలం 8% తక్కువ ప్రీమియంతో ట్రేడ్ అవుతున్నాయి. అయినప్పటికీ, HDFC యొక్క బలమైన బ్రాండ్ వాల్యూ, గవర్నెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ తదితర అంశాల కారణంగా సంస్థాగత పెట్టుబడిదారులు విశ్వాసం చూపించారు. SBI సెక్యూరిటీస్ ఒక నోట్‌లో పేర్కొన్నట్లుగా, హెచ్‌డీబీ NBFCలలో అత్యుత్తమ స్థాయిలో నిలవగలదు. ఇది భారతదేశంలో రెండవ అతిపెద్ద కస్టమర్ బేస్‌ను కలిగి ఉన్న NBFCగా ఉంది. కంపెనీ ఆస్తుల నాణ్యత మెరుగవుతుండటంతో, భవిష్యత్తులో మంచి వృద్ధి సాధించగల సామర్థ్యం ఉందని తెలిపింది.
ఐపీవో ప్రారంభానికి ముందు కంపెనీ రూ. 3,369 కోట్ల విలువైన షేర్లను యాంకర్ ఇన్వెస్టర్లకు కేటాయించింది. వీరిలో LIC, ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, నిప్పాన్ లైఫ్, గోల్డ్‌మాన్ సాచ్స్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. ఐపీవోలో రూ. 2,500 కోట్ల విలువైన తాజా షేర్లు, రూ. 10,000 కోట్ల విలువైన షేర్ల విక్రయం భాగంగా ఉన్నాయి.ఈ ఐపీవో తర్వాత, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వాటా 94.32% నుండి 74.2% కి తగ్గుతుంది. ఆర్‌బీఐ అనుమతిస్తే.. బ్యాంక్ తన వాటాను ఇంకా 20% వరకు తగ్గించాల్సి రావచ్చు.
ఇది ఇప్పటివరకు వచ్చిన ఐపీవోల్లో ఐదవ అతిపెద్ద ఐపీవో కాగా దీనికన్నా ముందు వరుసలో హ్యుందాయ్ ఇండియా, LIC, పేటీఎం, కోల్ ఇండియా వంటివి ఉన్నాయి. అలాగే HDFC లైఫ్ తర్వాత HDFC గ్రూప్ నుంచి వచ్చిన మొదటి ఐపీవో ఇదే కావడం గమనార్హంగా చెప్పుకోవచ్చు.
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.
More From GoodReturns

భారత స్టాక్ మార్కెట్లు పతనం.. చమురు ధరలు పెరగడంతో కుప్పకూలిన మార్కెట్

Stock market: మార్కెట్ షాక్ ఇచ్చినా భయం వద్దు.. ఇన్వెస్టర్లకు ఇవే సేఫ్ ఆప్షన్లు!

Sensex today: సెన్సెక్స్ సంచలనం: 20 నిమిషాల్లో 900 పాయింట్లు జంప్.. కారణం ఇదే!

కుప్పకూలిన ఆసియా స్టాక్ మార్కెట్.. దెబ్బకు దక్షిణ కొరియా మార్కెట్లో నిలిచినపోయిన ట్రేడింగ్..

మూడో రోజూ కుప్పకూలిన స్టాక్ మార్కెట్..రికార్డు కనిష్టానికి రూపాయి.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన..

భారీ నష్టాలతో ప్రారంభమైన భారత స్టాక్ మార్కెట్..రూ. 9 లక్షల కోట్ల నష్టం.. సెన్సెక్స్, నిఫ్టీ పతనం..

Investment: మార్కెట్ ఒడిదుడుకులకు భయపడుతున్నారా? ఈ టైంలో ధనవంతులు ఏం చేస్తారో తెలుసా?

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications