HCL Tech: భారీగా పెరిగిన హెచ్‌సీఎల్ టెక్ షేర్లు.. ఎందుకంటే..!
ఏఐతో భారత ఐటీ కంపెనీలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్నాయి. గత సంవత్సర కాలంగా ఐటీ కంపెనీ షేర్లు తగ్గుతూ వస్తున్నాయి. ముఖ్యంగా టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్ సీఎల్ టెక్, విప్రో తో పాటు చాలా ఐటీ కంపెనీలు ప్రస్తుతం సవాళ్లను ఎదుర్కుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం అతి పెద్ద ఒప్పందం జరిగింది. యూరప్ కేంద్రంగా పనిచేస్తున్న ఫార్చ్యూన్ గ్లోబల్ 50 కంపెనీ నుంచి 1.14 బిలియన్ డాలర్ల కాంట్రాక్టును హెచ్‌సీఎల్‌టెక్ దక్కించుకుంది. ఈ కాంట్రాక్ట్ ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఆపరేటింగ్ మోడల్‌ను ఉపయోగించి పూర్తి చేయాలి. ఈ ఒప్పందం 2026 జూలై నుంచి డిసెంబర్ 2031 వరకు కొనసాగుతుందని కంపెనీ జూలై 3న స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.
అంతేకాదు మరో ఐదేళ్లపాటు పొడిగించుకునే అవకాశం కూడా ఉందని ఆ కంపెనీ వివరించింది. కాంట్రాక్ట్ విలువ 1.14 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ఇది హెచ్ సీఎల్ టెక్ కు పూర్తిగా కొత్త వ్యాపారమని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును ఎగ్జిక్యూట్ చేయడానికి ఏఐ ఆధారిత ఆపరేటింగ్ మోడల్ ఉపయోగించనున్నారు. ఒప్పందంలోని షరతుల దృష్ట్యా క్లయింట్ పేరున కంపెనీ బయట పెట్టలేదు. అయితే క్లయింట్ కంపెనీ కార్యాలయం యూరప్ లో ఉందని.. ఫార్చ్యూన్ గ్లోబల్ 50లో భాగమని తెలుస్తోంది. అయితే ఈ ఒప్పందం ఏఐ అవసరాన్ని నొక్కి చెబుతోంది. భారత కంపెనీలు ఎంత త్వరగా ఏఐని అడప్ట్ చేసుకుంటే అంత మంచి ఫలితాలు ఉంటాయని దీన్ని బట్టి తెలుస్తోంది.

హెచ్ సీఎల్ టెక్ కూడా ఏఐని త్వరగానే అడప్ట్ చేసుకుంటోంది. కాగా జూన్ చివరిలో కంపెనీ తన ఐటీ సేవలను ఏకీకృతం చేయడానికి, ఏఐ-ఆధారిత కార్యాచరణను ప్రకటిచింది. ఇందులో భాగంగా ఫిన్నిష్ పునరుత్పాదక ఇంధన దిగ్గజం నెస్టేతో ఒక దీర్ఘకాలిక వ్యూహాత్మక ఒప్పందంపై సంతకం చేసింది. క్లౌడ్ సాఫ్ట్‌వేర్ గ్రూప్ నుండి బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ జాస్పర్‌సాఫ్ట్ కొనుగోలును పూర్తి చేసింది. హెచ్ సీఎల్ టెక్ భారీ ఆర్డర్ట్ ఈ రోజు ఆ స్టాక్ ప్రైస్ పెరిగింది. స్టాక్ 5.74 శాతం పెరిగి రూ.1140 వద్ద స్థిరపడింది.
అయితే దేశంలో టీసీఎస్, ఇన్ఫోసిస్ హవా కొనసాగినప్పటికీ హెచ్ సీఎల్ టెక్ ఏఐ వేగంగా అడుగులు వేస్తోంది. ఏఐ ఒత్తిడితో టీసీఎస్, ఇన్పోసిస్ షేర్లు భారీగా పడిపోయాయి.అయితే గత రెండు సెషన్ల నుంచి ఐటీ స్టాక్స్ పెరుగుతూ వస్తున్నాయి. ఈ రోజు ఐటీ ఇండెక్స్ ఒక శాతానికి పైగా పెరిగింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications