జీఎస్టీ రేట్లు మార్పు నిర్ణయం తరువాత స్టాక్ మార్కెట్ ఈరోజు (సెప్టెంబర్ 4) లాభాలతో ప్రారంభమైంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం రాత్రి ప్రకటించినట్టుగా, జీఎస్టీ కౌన్సిల్ ఇకపై 5%, 18% అనే రెండు స్లాబ్ రేట్లను అమల్లోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో గుట్కా, పొగాకు, సిగరెట్లు వంటి ఉత్పత్తులు మినహా అన్ని వస్తువులపై ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 22 నుండి లైవ్ లోకి రానున్నాయి. దీంతో ఇప్పటి వరకు ఉన్న 5%, 12%, 18%, 28% నాలుగు స్లాబ్‌ల నిర్మాణం నుండి రెండు స్లాబ్‌ల నిర్మాణానికి పన్ను రేట్లు మారాయి.
GST ప్రకటన తర్వాత గురువారం మార్కెట్‌లో ఉత్సాహం కనిపించింది. ఉదయం 9:30 గంటలకు బిఎస్‌ఇ సెన్సెక్స్ 630 పాయింట్లు (0.78%) ఎగసి 81,883 వద్ద ట్రేడవగా, నిఫ్టీ 184 పాయింట్లు (0.74%) పెరిగి 24,899 వద్ద నిలిచింది. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 2.55%, ఎఫ్‌ఎంసీజీ 1.80% పెరిగి అగ్రగాములుగా నిలిచాయి. బ్యాంకింగ్ రంగంలో కూడా ఉత్సాహం కనిపించింది. 12 ప్రధాన బ్యాంకుల కదలికలను ట్రాక్ చేసే నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 320 పాయింట్లు (0.60%) పెరిగి 54,390 వద్ద ట్రేడవుతోంది.

దూసుకుపోయిన ఆటో రంగాల షేర్లు: సెన్సెక్స్ ప్యాక్‌లో మహీంద్రా & మహీంద్రా 6.5 శాతం దూసుకుపోయి టాప్ గెయినర్‌గా నిలిచింది. దానికి తోడు బజాజ్ ఫైనాన్స్ 4.5 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 2.5 శాతం పెరిగాయి. ఐటీసీ, హెచ్‌యూఎల్, టాటా మోటార్స్, మారుతి సుజుకి ఇండియా, హ్యుందాయ్ మోటార్ ఇండియా, హీరో మోటోకార్ప్, అల్ట్రాటెక్ సిమెంట్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, అశోక్ లేలాండ్, ఐసీఐసీఐ బ్యాంక్ మంచి లాభాలను నమోదు చేశాయి.
నష్టాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు: అయితే టాటా స్టీల్, ఎటర్నల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టపోయాయి. నిఫ్టీ 50లో కూడా ఇదే ధోరణి కనిపించింది. ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఐషర్ మోటార్స్, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఐటీసీ, హెచ్‌యూఎల్, టాటా మోటార్స్, ఎస్‌బిఐ లైఫ్ ప్రధాన లాభదారులుగా నిలిచారు. మరోవైపు టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా స్టీల్, ఎటర్నల్, కోల్ ఇండియా, ఇండస్‌ఇండ్ బ్యాంక్ నష్టపోయాయి.
నిపుణులు ఏమంటున్నారంటే.. ఏంజెల్ వన్‌లో ఈక్విటీ టెక్నికల్ అనలిస్ట్ రాజేష్ భోసలే మాట్లాడుతూ.. నిఫ్టీ 20-EMA వద్ద మద్దతు తీసుకున్నదని తెలిపారు. గిఫ్ట్ నిఫ్టీ ఈ ఉదయం బలమైన ప్రారంభాన్ని సూచించిందని అన్నారు. ఇటీవల నిఫ్టీ 24,400 నుండి 24,700 మధ్య దాదాపు 1 శాతం పెరిగిందని, విస్తృత మార్కెట్ కూడా అవుట్‌పర్ఫార్మెన్స్ సంకేతాలు చూపుతోందని ఆయన పేర్కొన్నారు. నిఫ్టీ త్వరలోనే 25 వేల స్థాయిని టచ్ చేసే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.నిఫ్టీ బ్యాంక్‌పై మాట్లాడుతూ, ఇండెక్స్ 53,500 పైన బలంగా నిలిచిందని తెలిపారు.
గత మూడు ట్రేడింగ్ సెషన్లలో వరుసగా మారుబోజో, బుల్లిష్ ప్యాటర్న్‌లు ఏర్పడ్డాయని, ఇది మరింత పెరుగుదల దిశను సూచిస్తోందని చెప్పారు. స్వల్పకాలంలో నిఫ్టీ బ్యాంక్ 55 వేల స్థాయిని చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఏదేమైనా జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం మార్కెట్‌లో పాజిటివ్ సెంటిమెంట్‌ను కలిగించింది. వినియోగ వస్తువులు, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్ రంగాలు లాభపడుతున్నాయి. నిపుణుల అంచనాల ప్రకారం నిఫ్టీ త్వరలోనే 25వేల మార్క్‌ను తాకే అవకాశం ఉంది.
ఐటీసీ షేర్లలో ఊఫు: 2025 సెప్టెంబర్ 4న స్టాక్ మార్కెట్ ప్రారంభం నుంచే ఐటీసీ షేర్లలో చురుకుదనం కనిపించింది. మంగళవారం ముగింపులో రూ.411.74 వద్ద ఉన్న ఐటీసీ షేరు, బుధవారం ఉదయం ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 3 శాతం గ్యాప్-అప్ ఓపెనింగ్‌తో రూ.423.95 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. ప్రారంభ సమయంలో 3.72 శాతం పెరిగి రూ.427 గరిష్టాన్ని తాకింది. అయితే, ఉత్సాహం కొంత చల్లారడంతో ఉదయం 10 గంటల ప్రాంతంలో షేర్ ధర రూ.418.20 వద్ద స్థిరపడింది.
అంతకుముందు మూడు వరుస ట్రేడింగ్ సెషన్లలో ఐటీసీ షేర్లు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం షేరు 5-రోజులు, 20-రోజులు, 50-రోజులు మరియు 100-రోజుల మూవింగ్ యావరేజీలపై ట్రేడవుతుండగా, 200-రోజుల మూవింగ్ యావరేజ్ కంటే మాత్రం ఇంకా తక్కువగా ఉంది. ఉదయం 10 గంటలకల్లా సుమారు 1.48 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఇది ఇన్వెస్టర్ల ఆసక్తి బలంగా ఉందని సూచిస్తోంది.
సిగరెట్ కంపెనీలకు తాత్కాలిక అనిశ్చితి: మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీఎస్టీ రేట్లలో మార్పులు సిగరెట్ కంపెనీలకు తాత్కాలిక అనిశ్చితి కలిగించినప్పటికీ, దీర్ఘకాలికంగా ఐటీసీకి స్థిరమైన క్యాష్ ఫ్లోలు, విభిన్న వ్యాపార విభాగాలు (FMCG, హోటల్స్, పేపర్, అగ్రిబిజినెస్) పెరుగుదలకు మద్దతు ఇవ్వనున్నాయి.ఐటీసీతో పాటు వీఎస్‌టీ ఇండస్ట్రీస్, గాడ్‌ఫ్రే ఫిలిప్స్ ఇండియా వంటి ఇతర పొగాకు రంగ స్టాక్‌లు కూడా లాభపడ్డాయి. వీటిలో కొన్నింటి లాభాలు 4 శాతం వరకు పెరిగాయి.
సిమెంట్ రంగానికి పెద్ద ఊపిరి : ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం సిమెంట్ రంగానికి పెద్ద ఊపిరి నింపింది. బుధవారం మార్కెట్ ప్రారంభంలోనే ACC, అంబుజా సిమెంట్స్, అల్ట్రాటెక్ సిమెంట్ వంటి ప్రముఖ సిమెంట్ స్టాక్స్ 2 శాతం వరకు లాభపడ్డాయి. అల్ట్రాటెక్ సిమెంట్ 2% పైగా ఎగసి రికార్డ్ బలం చూపించగా, శ్రీ సిమెంట్ కూడా 1% లాభపడింది. అంబుజా సిమెంట్స్ దాదాపు 1.92% పెరుగుదల నమోదు చేసింది. ఉదయం 9:24 IST సమయానికి ACC సిమెంట్ షేరు ధర 1% పెరిగింది. సిమెంట్ రంగంలో జీఎస్టీ తగ్గింపు వల్ల వినియోగదారులకు ధరలు తగ్గే అవకాశం ఉండటంతో పాటు, కంపెనీలకు పెరిగిన డిమాండ్ రూపంలో లాభం చేకూరనుంది. స్టాక్ మార్కెట్‌లో ఈ రంగంపై ఇన్వెస్టర్ల నమ్మకం మరింత బలపడుతుందని విశ్లేషకులు సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications