Suzlon Energy Shares: మార్కెట్లో పెన్నీ స్టాక్స్ కి డిమాండ్ ఎల్లప్పుడూ తగ్గదని మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా కాలం నుంచి రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలోని సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ షేర్లకు సాధారణ ఇన్వెస్టర్ల నుంచి డిమాండ్ పెరుగుతూనే ఉంది.
వాస్తవానికి రాబోతున్నది రెన్యూవబుల్ ఎనర్జీ యుగం. ఇప్పటికే బొగ్గుతో నడిపించే శిలాజఇంధనాల కొరత భారత్ వంటి పెద్ద దేశాలకు ఇబ్బందిగా మారుతున్న వేళ ఈ రంగంలోని అనేక ఎనర్జీ కంపెనీ షేర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలో సుజ్లాన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ ఇటీవల నువామా ఇండియా కాన్ఫరెన్స్ 2025లో పాల్గొంది. రానున్న కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఎనర్జీ అవసరాలను తీర్చే క్రమంలో విండ్ టర్బైన్ జనరేటర్ సహకారం 20% ఉండవచ్చని వెల్లడించింది.

ఈ క్రమంలో ఇన్వెస్టెక్ సుజ్లాన్ ఎనర్జీ షేర్లపై 'BUY' రేటింగ్ అందించింది. రానున్న కాలంలో కంపెనీ షేర్ల ధర ఒక్కోటి రూ.70 స్థాయికి చేరుకుంటుందని తన అంచనాలను ప్రకటించింది. వాస్తవానికి ఇది ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో ఉన్న ధరతో పోల్చితే దాదాపు 28 శాతం అధిక ధర టార్గెట్ కావటం గమనార్హం. భవిష్యత్తులో రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి మంచి భవిష్యత్తు ఉండటంతో ఇప్పటికే విండ్ టర్భైన్ తయారీ సంస్థలకు మంచి ఆర్డర్ బుక్ ఉన్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో సుజ్లాన్ ఎనర్జీ FY24-27లో 55 శాతం ఆదాయ వృద్ధిని, పన్ను తర్వాత లాభం 66 శాతం వార్షిక వృద్ధిని సాధించగలదని ఇన్వెస్టెక్ వెల్లడించింది.
గడచిన 6 నెలల కాలంలో కంపెనీ షేర్లు దాదాపు 37.52 శాతం క్షీణతను అందించగా.. 2025 ప్రారంభం నుంచి స్టాక్ 23 శాతానికి పైగా పడిపోయింది. ఈ క్రమంలో మరో బ్రోకరేజ్ జేఎం ఫైనాన్షియల్ కంపెనీ షేర్లకు రూ.80గా కంపెనీ ప్రకటిస్తూ BUY రేటింగ్ అందించింది. అలాగే చాయిస్ బ్రోకింగ్ నిపుణుడు మండ్ర భోజనే స్పందిస్తూ స్టాక్ బేరిష్ ట్రెండ్ కారణంగా సైడ్ వేస్ ట్రేడింగ్ కొనసాగిస్తోందని అన్నారు. నేడు మార్కెట్లు ముగిసే సమయంలో సుజ్లాన్ స్టాక్ ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.55.53 వద్ద తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ ధర రూ.86 నుంచి ప్రస్తుతం కంపెనీ షేర్లు దాదాపు 42 శాతం తక్కువ రేటు వద్ద తమ ప్రయాణాన్ని మార్కెట్లో కొనసాగిస్తున్నాయి.
కంపెనీ తన కొత్త బ్లేడ్ తయారీ లైన్ల విస్తరణ కోసం రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో ఏర్పాటుకు రూ.350-400 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని ప్లాన్ చేయటంపై కూడా బ్రోకరేజీలు సానుకూలతను వ్యక్తం చేస్తున్నాయి. ఇవి భవిష్యత్తులో కంపెనీ ఆదాయాలను పెంచటానికి లాభదాయకతకు దోహదపడతాయని వారు చెబుతున్నారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications