Godavari Biorefineries IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో నేడు లిస్టింగ్ కోసం వచ్చిన ఐపీవో ఇన్వెస్టర్లను నిండా ముంచింది. వాస్తవానికి గడచిన రెండు నెలలుగా జాబితా అవుతున్న ఐపీవోల్లో కొన్ని మాత్రం ఫ్లాట్, డిస్కౌంటెడ్ లిస్టింగ్ నమోదు చేయటంతో చాలా మంది నిరాశచెందారు. చాలా మంది గ్రేమార్కెట్లో ప్రీమియం ధరలను చూసి బెట్టింగ్ వేసిన వ్యక్తులు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన గోదావరి బయోఫైనరీస్ ఐపీవో గురించే. మెయిన్ కేటగిరీలో వచ్చిన ఐపీవో పేలవమైన లిస్టింగ్ నమోదు చేసింది. ఇష్యూ ధర కంటే తక్కువ రేటుకు మార్కెట్లోకి అడుగుపెట్టడం చాలా మంది ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేస్తోంది. ఎన్ఎస్ఈలో స్టాక్ ఇష్యూ రేటు కంటే 12.5 శాతం తగ్గింపు ధర రూ.308కి ఒక్కోటి లిస్ట్ అయ్యాయి. ఇదే క్రమంలో బీఎస్ఈలో స్టాక్ ఇష్యూ రేటు కంటే 12 శాతం తగ్గింపు ధర రూ.310.55 వద్ద అడుగుపెట్టాయి. వాస్తవానికి గోదావరి బయోరిఫైనరీస్ కంపెనీ 68 ఏళ్ల పురాతనమైనది.

మెయిన్ బోర్డ్ కేటగిరీలో వచ్చిన ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.555 కోట్లను సమీకరించే లక్ష్యాన్ని అందుకుంది. ఈ క్రమంలో ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం అక్టోబర్ 23 నుంచి అక్టోబర్ 25 వరకు అందుబాటులో ఉండనుంది. ఇదే క్రమంలో యాంకర్ ఇన్వెస్టర్లకు ఐపీవో ఒకరోజు ముందుగా అక్టోబర్ 22న తెరుచుకోనుంది. ఈ ఐపీవో కోసం కంపెనీ తన ఒక్కో షేరు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.334-352గా ఉంచింది.
కంపెనీ తన ఐపీవోలో తాజా ఇష్యూతో పాటు ఆఫర్ ఫర్ సేల్ కూడా ఉన్నట్లు వెల్లడించింది. మెుత్తం ఐపీవోలో రూ.325 కోట్లకు తాజా ఈక్విటీ షేర్లను ఇష్యూ చేస్తుండగా, మిగిలిన మెుత్తం 65.3 లక్షల షేర్లను ప్రమోటర్లు ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ క్రమంలో ప్రైవేట్ ఈక్విటీ సంస్థ మండల క్యాపిటల్ తనకున్న మెుత్తం 49,26,983 వాటాలను కూడా ఆఫర్లో విక్రయానికి ఉంచింది. కంపెనీ తాజా ఐపీవోలో లాట్ పరిమాణాన్ని 42 షేర్లుగా ఉంచింది. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాటు కొనుగోలు కోసం రూ.14,748 పెట్టుబడిగా పెట్టాల్సి వస్తోంది. కంపెనీ షేర్లు ఈ క్రమంలో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఏకకాలంలో లిస్టింగ్ జరగనున్నాయి.
కంపెనీ వ్యాపారం..
ఇథనాల్ ఆధారిత కెమికల్స్ తయారీ వ్యాపారంలో ఉన్న కంపెనీ వాస్తవానికి 1956లో స్థాపించబడింది. కంపెనీ ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో బయో-ఆధారిత రసాయనాలు, చక్కెర, వివిధ రకాల ఇథనాల్, పవర్ ఉన్నాయి. ఈ ఉత్పత్తులు ఆహారం, పానీయాలు, ఔషధాలు, రుచులు-సువాసనలు, శక్తి, ఇంధనం, వ్యక్తిగత సంరక్షణ, సౌందర్య సాధనాల వంటి పరిశ్రమలలో ఉపయోగిస్తుంటారు. కంపెనీ తాజా ఐపీవో నుంచి సమీకరించిన సొమ్మును పాక్షికంగా లేదా పూర్తిగా రుణాలను చెల్లించటానికి వినియోగించాలని నిర్ణయించింది. దీనికి తోడు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం కంపెనీ ఐపీవో డబ్బును ఉపయోగించాలని నిర్ణయించింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications