నష్టాల నుండి భారీ ప్రాఫిట్స్‌లోకి Paytm.. రూ. 963 కోట్ల మెగా డీల్‌తో దద్దరిల్లిన స్టాక్ మార్కెట్!

డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం (Paytm) పేరెంట్ కంపెనీ అయిన 'వన్ 97 కమ్యూనికేషన్స్' స్టాక్ మార్కెట్‌లో ఒక భారీ సంచలనాన్ని సృష్టించింది. ప్రపంచ ప్రసిద్ధ ఆర్థిక సంస్థలైన గోల్డ్‌మన్ సాచ్స్ (Goldman Sachs), సొసైటీ జనరల్ (Societe Generale), సిటీగ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ వంటి గ్లోబల్ ఇన్వెస్టర్లు అందరూ కలిసి పేటీఎంలో ఏకంగా రూ. 963 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

ఓపెన్ మార్కెట్ లావాదేవీల (Block Deal) ద్వారా జరిగిన ఈ డీల్‌లో భాగంగా.. పేటీఎం పాత ఇన్వెస్టర్లయిన 'సైఫ్ పార్ట్‌నర్స్' (SAIF Partners), 'ఎలివేషన్ క్యాపిటల్' (Elevation Capital) నుండి ఈ అంతర్జాతీయ సంస్థలు 1.34 శాతం వాటాను (స్టేక్) దక్కించుకున్నాయి.

Global Institutions Goldman Sachs And Citigroup Acquire Paytm Stake For Rs 963 Crore stock market update

ఎవరెవరు కొన్నారు? ఎవరెవరు అమ్మారు?

శుక్రవారం బిఎస్‌ఈ (BSE) స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జరిగిన ఈ మెగా డీల్ వివరాలు ఇలా ఉన్నాయి:

  • కొనుగోలు చేసిన విదేశీ సంస్థలు: గోల్డ్‌మన్ సాచ్స్, సిటీగ్రూప్, సొసైటీ జనరల్‌తో పాటు బిఎన్‌పి పారిబాస్ (BNP Paribas), కోప్థాల్ మారిషస్, ఘిసాలో క్యాపిటల్ , హాంగ్ కాంగ్‌కు చెందిన విరిడియన్ అసెట్ మేనేజ్‌మెంట్ ఈ షేర్లను కొన్నాయి.
  • కొనుగోలు చేసిన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్: విదేశీయులతో పాటే మన దేశీయ సంస్థలైన సుందరం మ్యూచువల్ ఫండ్, నిప్పన్ ఇండియా మ్యూచువల్ ఫండ్, ఎడెల్విస్ మ్యూచువల్ ఫండ్స్ కూడా పేటీఎం షేర్లను దక్కించుకున్నాయి.
  • అమ్మేసిన వారు: హాంగ్ కాంగ్‌కు చెందిన ప్రైవేట్ ఈక్విటీ ఫర్మ్ సైఫ్ పార్ట్‌నర్స్ తన అనుబంధ సంస్థల ద్వారా దాదాపు 80.08 లక్షల షేర్లను, అలాగే గురుగ్రామ్‌కు చెందిన వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ ఎలివేషన్ క్యాపిటల్ 5.89 lakh షేర్లను విక్రయించాయి.

మొత్తం మీద 85.98 లక్షల షేర్లను సగటున ఒక్కో షేరుకు రూ. 1,120.65 చొప్పున ఈ కొనుగోళ్లు జరిగాయి. ఈ డీల్ తర్వాత పేటీఎంలో సైఫ్ పార్ట్‌నర్స్ వాటా 13.43 శాతం నుండి 12.18 శాతానికి పడిపోయింది. ఈ అమ్మకాల ఒత్తిడి కారణంగా శుక్రవారం పేటీఎం షేర్ వాల్యూ దాదాపు 4 శాతం నష్టపోయి రూ. 1,112.50 దగ్గర ముగిసింది.

నష్టాల నుండి లాభాల్లోకి.. పేటీఎం సూపర్ టర్నరౌండ్!

గ్లోబల్ ఇన్వెస్టర్లు ఇంత భారీగా పేటీఎంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన కారణం.. కంపెనీ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అద్భుతంగా ఉండటమే. గతంలో భారీ నష్టాల్లో ఉన్న పేటీఎం, రీసెంట్‌గా ప్రకటించిన మార్చి 2026 క్వార్టర్ (Q4) ఫలితాల్లో ఏకంగా రూ. 183 కోట్ల కన్సాలిడేటెడ్ ప్రాఫిట్‌ను (లాభం) సాధించింది. గత ఏడాది ఇదే క్వార్టర్‌లో కంపెనీకి రూ. 545 కోట్ల నష్టం రావడం గమనార్హం.
ఆన్యువల్ రిపోర్ట్ హైలైట్స్: ఇక పూర్తి ఆర్థిక సంవత్సరం (FY26) విషయానికి వస్తే, పేటీఎం రూ. 552 కోట్ల నికర లాభాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు ఏడాది (FY25) లో కంపెనీకి రూ. 663 కోట్ల నష్టం వచ్చింది. అలాగే కంపెనీ వార్షిక రెవెన్యూ (ఆదాయం) కూడా 22.2 శాతం వృద్ధి చెంది ఏకంగా రూ. 8,437 కోట్లకు చేరింది.

నష్టాల ఊబిలోంచి బయటపడి లాభాల బాట పట్టడం , ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్లు బిలియన్ల కొద్దీ నిధులు కుమ్మరించడం చూస్తుంటే.. స్టాక్ మార్కెట్ లో పేటీఎం మళ్లీ మునుపటి జోరును అందుకోవడానికి రెడీ అవుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+