IDFC First Bank: ఆరు నెలల్లో 30 శాతం పెరిగిన ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ స్టాక్..!
2026-27 ఆర్థిక సంవత్సరంలో భారీ రాబడులను అందించిన అరుదైన స్టాక్‌లలో ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ ఒకటి. ఈ బ్యాంకింగ్ స్టాక్ 2026 జనవరి నుంచి మార్చి వరకు అమ్మకాల ఒత్తిడిలోనే ఉంది. కానీ, 2027 ఆర్థిక సంవత్సరంలోకి ప్రవేశించిన తర్వాత ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ షేర్ ధర క్రమంగా పెరిగింది. 2027 రెండవ త్రైమాసికంలో బలమైన వ్యాపార నివేదిక వెలువడిన తర్వాత ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ షేర్లలో ఈ పెరుగుదల కొనసాగే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణుల చెబుతున్నారు. ఈ ప్రైవేట్ బ్యాంక్ రిటైల్ రుణాల పంపిణీ, డిపాజిట్లు మరియు కాసా (CASA) విభాగాలలో బాగా రాణించిందని వారు పేర్కొంటున్నారు.
అందువల్ల ఈ స్టాక్ పెరుగుదల ధోరణిని కొనసాగించవచ్చని చెబుతున్నారు. టెక్నికల్ చార్ట్‌లో ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ షేర్ ధర బలంగా కనిపిస్తోందని, త్వరలోనే ఒక్కో షేరుకు రూ.86.50 స్థాయిని తాకవచ్చని వారు చెప్పారు. ఈ ప్రైవేట్ బ్యాంక్ 2027 రెండో త్రైమాసికంలో రుణాల పంపిణీ, డిపాజిట్లలో బలమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్యాంక్ తన కాసా (CASA)ను కూడా మెరుగుపరుచుకుంది. సెప్టెంబర్ త్రైమాసికంలో, IDFC ఫస్ట్ బ్యాంక్ రుణాలలో 30%, డిపాజిట్లలో 26%, కాసాలో 20% వృద్ధిని నమోదు చేసిందని జెఫరీస్ ఇండియా పేర్కొంది. జూన్ త్రైమాసికంలో రుణాలు 21%, డిపాజిట్లు18%, కాసా 25 శాతం వృద్ధి చెందాయని పేర్కొంది. ఎల్‌డిఆర్ 90%గా ఉందని వివరించింది.

ఎఫ్‌సిఎన్‌ఆర్-బి డిపాజిట్ల రూపంలో వచ్చిన $3.6 బిలియన్ల వల్ల వృద్ధి రేట్లు పెరిగాయి. ఇందులో $2.6 బిలియన్లు రుణాల రూపంలో సమకూరాయి. వీటిని సర్దుబాటు చేస్తే రుణాలు 20 శాతం, డిపాజిట్లు 14% పెరిగాయి. ఈ బ్యాంక్, డిపాజిట్లు, సిడిలను తిరిగి చెల్లించడానికి ఎఫ్‌సిఎన్‌ఆర్-బి డిపాజిట్లను ఉపయోగించుకుందని జెఫరీస్ ఇండియా పేర్కొంది. ఎల్‌సిఆర్ జూన్‌లో 116% నుంచి 125%కి మెరుగుపడిందని వివరించింది. ఆస్తుల నాణ్యత బలంగా ఉంది. FY27లో రుణాలు 20 శాతం, డిపాజిట్లు వరుసగా 23శాతంగా ఉన్నాయని ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ పేర్కొంది.
IDFC ఫస్ట్ బ్యాంక్ షేర్ ధరలో బుల్ రన్ కొనసాగుతుందని KC సెక్యూరిటీస్ రీసెర్చ్ అండ్ బిజినెస్ డెవలప్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ ఎం ఓఝా అంచనా వేశారు. వారపు, నెలవారీ చార్టులలో IDFC ఫస్ట్ బ్యాంక్ షేర్లు బుల్లిష్‌గా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత వాటాదారులు ఈ షేరును అట్టిపెట్టుకోవాలని తక్షణ లక్ష్యంగా రూ.86 పెట్టుకుని, రూ.79.50 వద్ద స్టాప్-లాస్ కొనసాగించాలని సూచించారు.
కొత్త పెట్టుబడిదారులు ప్రస్తుత మార్కెట్ ధరకు స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చు లేదా ధర తగ్గినప్పుడు కొనుగోలు కొనసాగించవచ్చు పేర్కొన్నారు. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ స్టాక్ ఆరు నెలల్లో దాదాపు 30 శాతం పెరిగింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
