Stock market: రూ. 23 నుంచి రూ. 313 కి పెరిగిన షేరు.. ఇప్పుడు 1 కొంటే 8 షేర్లు ఫ్రీ!
స్టాక్ మార్కెట్ (Stock market) లో మల్టీబ్యాగర్ షేర్లు ఇచ్చే రిటర్న్స్ మామూలుగా ఉండవు. కొన్ని కంపెనీలు తక్కువ కాలంలోనే ఇన్వెస్టర్లను లక్షాధికారులను చేస్తుంటాయి. తాజాగా పేపర్ ఉత్పత్తుల తయారీ రంగంలో ఉన్న ప్రముఖ స్మాల్ క్యాప్ కంపెనీ "గౌతమ్ ఎగ్జిమ్ లిమిటెడ్" (Gautam Exim Limited) తన షేర్ హోల్డర్లకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కంపెనీ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఒకేసారి అటు స్టాక్ స్ప్లిట్ (షేర్ల విభజన), ఇటు బోనస్ షేర్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అంటే ఈ కంపెనీలో మీ దగ్గర 100 షేర్లు ఉంటే.. అవి ఏకంగా 800 షేర్లుగా మారి మీ డీమ్యాట్ అకౌంట్లోకి వస్తాయన్నమాట!

ఒకే దెబ్బకు రెండు లాభాలు: స్టాక్ స్ప్లిట్, బోనస్ రేషియో ఇదే!
కంపెనీ ఎక్స్చేంజ్ ఫైలింగ్ ప్రకారం.. మొదటగా 1:2 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేయనున్నారు. అంటే ప్రస్తుతం రూ. 10 ఫేస్ వ్యాల్యూ (ముఖ విలువ) ఉన్న ఒక్కో ఈక్విటీ షేరుని, రూ. 5 ముఖ విలువ ఉండేలా రెండు షేర్లుగా విడదీస్తారు.
దీనితో పాటు, అదే మీటింగ్‌లో 3:1 రేషియోలో బోనస్ షేర్లు ఇవ్వాలని కూడా నిర్ణయించారు. అంటే రికార్డు డేట్ నాటికి రూ. 5 ఫేస్ వ్యాల్యూ ఉన్న 1 షేరు మీ దగ్గర ఉంటే.. కంపెనీ మీకు అదనంగా మరో 3 షేర్లను ఉచితంగా బోనస్ రూపంలో ఇస్తుంది. ఈ రెండు ఆఫర్ల వల్ల మీ దగ్గర ఉన్న 100 షేర్లు కాస్తా 800 షేర్లుగా మారిపోతాయి.
రికార్డ్ డేట్ ఎప్పుడు?
ఈ సూపర్ బెనిఫిట్స్ అందుకోవడానికి అర్హులైన షేర్ హోల్డర్లను డిసైడ్ చేసేందుకు కంపెనీ రికార్డు తేదీని కూడా ప్రకటించింది. మే 22, 2026ని రికార్డ్ డేట్‌గా ఫిక్స్ చేశారు. అంటే ఆ తేదీ లోపు ఈ కంపెనీ షేర్లు కొని మీ పోర్ట్‌ఫోలియోలో ఉంచుకుంటేనే ఈ ఉచిత షేర్ల ఆఫర్ మీకు వర్తిస్తుంది. అయితే షేర్ల సంఖ్య పెరిగినప్పుడు దానికి తగినట్లే మార్కెట్లో షేరు ధర కూడా తగ్గుతుందని ఇన్వెస్టర్లు గమనించాలి. మీ టోటల్ పెట్టుబడి విలువలో మార్పు ఉండదు కానీ, షేర్ల కౌంట్ మాత్రం భారీగా పెరుగుతుంది. రిటైల్ ఇన్వెస్టర్లకు ఈ స్టాక్ అందుబాటు ధరలోకి రావడానికే కంపెనీ ఇలా చేస్తోంది.
ఐదేళ్లలో రూ. 5 లక్షలు.. రూ. 13.55 లక్షలు అయ్యాయి!
గౌతమ్ ఎగ్జిమ్ లిమిటెడ్ గత ఐదేళ్లలో స్టాక్ మార్కెట్ (Stock market) లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించింది. ఐదేళ్ల క్రితం కేవలం రూ. 23 దగ్గర ఉన్న ఈ షేరు ధర.. మొన్నటి ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి 1.17 శాతం లాభంతో రూ. 313.85 వద్ద నిలిచింది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి రూ. 369.50 కాగా, కనిష్ట స్థాయి రూ. 121.75 గా ఉంది.
గత ఐదేళ్లలో ఈ మల్టీ బ్యాగర్ షేరు (Multibagger) ఏకంగా 1255 శాతం లాభాన్ని ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టింది. ఐదేళ్ల క్రితం ఇందులో ఎవరైనా రూ. 5 లక్షలు ఇన్వెస్ట్ చేసి అలాగే హోల్డ్ చేసి ఉంటే.. ఈరోజు వాటి వాల్యూ సుమారు రూ. 13.55 లక్షలు అయ్యేది. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ ప్రస్తుతం రూ. 96 కోట్ల వద్ద ఉంది. గత ఏడాది కాలంలోనే ఈ స్టాక్ 150 శాతం పెరిగి ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. మీరూ ఈ స్టాక్ పై కన్నేయాలనుకుంటే మే 22 లోపు డెసిషన్ తీసుకోండి!


Click it and Unblock the Notifications