Upcoming IPOs: దేశీయంగా ఐపీవోల కోలాహలం నిరంతరాయంగా పెరుగుతూనే ఉంది. మార్కెట్లు ప్రస్తుతం దీనికి సానుకూలంగా ఉండటంతో చాలా కంపెనీలు తమ ఐపీవోలను లాంచ్ చేస్తున్నాయి. దీనికి తగినట్లుగానే దేశీయ మార్కెట్లలో ఇన్వెస్టర్లు బెట్టింగ్ వేస్తూ కోట్లు కుమ్మరిస్తున్నారు.
ప్రైమరీ మార్కెట్ బిజీగా ఉన్న వారం కోసం సిద్ధమవుతోంది. స్విగ్గీ చాలా ఎదురుచూస్తున్న ఐపీవో ప్రస్తుతం లైనప్‌లో ముందువరుసలో ఉంది. ఇదే క్రమంలో రానున్న వారంలో ఆక్మే సోలార్ హోల్డింగ్స్, సజిలిటీ ఇండియా, నివా బుపా హెల్త్‌కేర్ అందించే ఆఫర్‌లతో పాటు ఫుడ్ డెలివరీ దిగ్గజం నవంబర్ 6న తన ఐపీవో ఇష్యూ ప్రారంభించినందున ఇన్వెస్టర్‌లు ఇందుకోసం సిద్ధమౌతున్నారు.

ముందుగా అందరి చూపు ఫుడ్ డెలివరీ స్టార్టప్ అగ్రిగేటర్ స్విగ్గీ తీసుకొస్తున్న ఐపీవోపైనే ఉంది. కరోనా తర్వాత దాదాపు రెండు మూడు సార్లు తన ఐపీవోలను లాంచ్ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ మార్కెట్లలోని అప్పటి పరిస్థితులు సరైన లాంచ్ ప్యాడ్ కాదని భావించిన కంపెనీ ఐపీవో ప్రణాళికను పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చింది. అయితే తాజాగా కంపెనీ తన ఐపీవోకు సెబీ నుంచి అనుమతులు పొందటంతో షేర్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ రూ.371-390గా నిర్ణయించింది. మార్కెట్ అస్థిరతలతతో హ్యుందాయ్ ఇటీవలి లిస్టింగ్ తర్వాత కంపెనీ తగ్గింపు విలువతో మార్కెట్లోకి రావాలని నిర్ణయించుకుంది. అండర్వెల్‌డింగ్‌ల కారణంగా వ్యూహాత్మక చర్యగా చెప్పవచ్చు. కంపెనీ ప్రస్తుత ఐపీవో ద్వారా రూ.4499 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఈ మెుత్తాన్ని రానున్న ఐదేళ్ల కాలంలో అనుబంధ స్కూట్సీ, టెక్నాలజీ అప్‌గ్రేడ్‌లు, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, బ్రాండ్ మార్కెటింగ్ కోసం వినియోగించాలని నిర్ణయించింది.

ఇక మార్కెట్లో అందరి చూపు ఉన్న రెండవ ఐపీవో ఆక్మే సోలార్ హోల్డింగ్స్. ఇది తన ఐపీవోను నవంబర్ 5న ప్రారంభించనుంది. ఒక్కో షేరుకు ప్రైస్ బ్యాండ్ ధరను రూ.275-389గా ప్రకటించింది. తాజా ఐపీవో నుంచి రూ.2,900 కోట్లను కంపెనీ సమీకరిస్తోంది. ఇందులో రూ.2,395 కోట్లకు తాజా ఈక్విటీ ఇష్యూ ఉండగా.. మిగిలిన రూ.505 కోట్లు ఆఫర్-ఫర్-సేల్ ఉండనుంది. అమ్మోనియా ఉత్పత్తి వంటి గ్రీన్ టెక్నాలజీలలో ప్రత్యేకత కలిగిన పునరుత్పాదక ఇంధన సంస్థ.. రుణ చెల్లింపు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఆదాయాన్ని ఉపయోగించాలని యోచిస్తోంది.

ఇదే క్రమంలో వస్తున్న పెద్ద ఐపీవోల్లో హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్ అయిన సగిలిటీ ఇండియా కూడా ఉంది. కంపెనీ ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.2,107 కోట్లు సమీకరించేందుకు వస్తోంది. కంపెనీ ప్రైస్ బ్యాండ్ ధరను 28-30 నవంబర్ 5న ప్రారంభం కానున్న ఐపీవో కోసం నిర్ణయించింది. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ కింద వస్తోంది.
చివరిగా అందరి చూపు కొనసాగుతున్న ఐపీవో Niva Bupa Healthcare. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఐపీవో నవంబర్ 7న స్టార్ట్ అవుతోంది. హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ రూ.800 కోట్లకు తాజా ఇష్యూతో పాటు రూ.1400 కోట్లకు ఆఫర్ ఫర్ సేల్ కూడా విక్రయానికి ఉంచింది. ఆఫర్ ఫర్ సేల్ బూపా సింగపూర్ హోల్డింగ్స్, ఫెటిల్ టోన్ వాటాల విక్రయం ద్వారా వస్తోంది. ప్రస్తుతం రూ.72,000 కోట్లను సమీకరించేందుకు 26 కంపెనీలు సెబీ ఆమోదం కోసం ఎదురుచూస్తుండగా, మరో 55 కంపెనీలు రూ.89,000 కోట్లను సమీకరించాలని చూస్తున్నాయి. ఇది చూస్తుంటే ఇప్పట్లో ఈ ఐపీవోల రద్దీ తగ్గే పరిస్థితులు అస్సలు కనిపించటం లేదు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications