స్టాక్ మార్కెట్ మాయాజాలం.. ఊరూ పేరూ లేని కోర్‌వీవ్ షేర్లను ఎగబడి కొనేశారు.. రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు..

ప్టాక్ మార్కెట్లో ఎవరి తలరాత ఎప్పుడు మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయినవారు తెల్తారేసరికి బిచ్చగాళ్లలా మారిపోవచ్చు. అలాగే బిచ్చగాళ్లలా మారిన వారు కోటీశ్వరులు కావొచ్చు. ఇదొక మాయా ప్రపంచం. పెట్టుబడిదారుల అదృష్టాన్ని ఒక్క క్షణంలో మార్చివేసి వారిని బిలియనీర్లు చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ స్టాక్.. సంచంలనం రేపుతోంది. మార్కెట్లో రికార్డులు సృష్టిస్తోంది. అదే కోర్‌వీవ్ షేర్.. అయితే ఈ స్టాక్ భారత మార్కెట్లోకి ఇంకా ఎంటర్ కాలేదు. అమెరికా మార్కెట్లోకి మాత్రమే ఎంటరయింది. దీని ధర కేవలం 12 రోజుల్లోనే 300 శాతం పెరిగింది. ఈ షేర్లలో డబ్బులు పెట్టిన పెట్టుబడిదారులు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు.

కోర్‌వీవ్ అనే సంస్థ ప్రధానంగా AI క్లౌడ్ స్టార్టప్ మీద పనిచేస్తుంది. ఈ కంపెనీ ఈ ఏడాది మార్చిలో స్టాక్ మార్కెట్లో జాబితా చేశారు. అయితే దీనిపై పెట్టుబడిదారులు పెట్టుబడి పెట్టేందుకు అంతగా ఆసక్తి చూపలేదు. ఈ నేపథ్యంలోనే స్టాక్ మార్కెట్లో దాని పతనం ప్రారంభమైంది. కేవలం కొద్ది రోజుల్లోనే ఈ కంపెనీ స్టాక్ దాదాపు పూర్తిగా కుప్పకూలిపోయింది. అయినప్పటికీ పడిలేచిన కెరటంలా దూసుకువచ్చింది. కోర్ వీవ్ సీఈఓ మైఖేల్ ఇంట్రాటర్ భవిష్యత్తు మీద ఆశలను పెంచుకున్నాడే తప్ప నిరాశ చెందలేదు. రానున్న కాలమంతా ఏఐదేనని బలంగా నమ్మాడు. ఆయన నమ్మకం వమ్ము కాలేదు. కోట్ల డాలర్లు ఆయన అకౌంట్లోకి వచ్చి పడ్డాయి.

CoreWeave CoreWeave CEO CoreWeave stock surge AI cloud company billionaire CEO tech billionaire fastest billionaire CoreWeave stock news stock market boom AI infrastructure startup billionaire 300 stock rise overnight billionaire CoreWeave valuation tech unicorns AI startups Wall Street news 300 CoreWeave CEO Michael Intrator CoreWeave CoreWeave CEO Michael Intrator AI

గత రెండు నెలల నుంచి AI రంగంలో మైక్రోసాఫ్ట్, ఓపెన్ AI, Nvidia వంటి కంపెనీల పెద్ద ఒప్పందాల ప్రభావం కోర్‌వీవ్ స్టాక్‌పై కనిపించింది. దీంతో పెట్టబడిదారుల పంట పండింది. ఈ స్టాక్ అనూహ్యంగా రెండు వారాల్లోనే 300 శాతానికి పైగా పెరిగింది. అతి తక్కువ సమయంలోనే దాని పెట్టుబడిదారులను ధనవంతులను చేసింది. AI స్టాక్ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత దానిషేరు ధరను 40 డాలర్లుగా నిర్ణయించారు. అయితే అది అకస్మాత్తుగా 33.52 డాల్లరకు కుప్పకూలింది. అయితే మైక్రోసాఫ్ట్, ఓపెన్ AI, Nvidia కంపెనీలు ఇందులో పెట్టుబడులు పెడుతున్నాయనే వార్తలో షేర్ల ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోయాయి.

ప్రస్తుతం ఈ కంపెనీ షేరు ధర 187 డాలర్ల వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. అయితే, గత వారం చివరి ట్రేడింగ్ రోజు శుక్రవారం కోర్‌వీవ్ షేర్ ధర 159.99 డాలర్ల వద్ద ముగిసింది. ఈ జంప్ తో ఈ కాలంలో ఈ AI స్టాక్‌లో 299.98 శాతం వద్ద భారీగా నమోదైంది. ఈ స్టాక్ రాకెట్ పెరుగుదలతో కోర్‌వీవ్‌ను ఈ సంవత్సరం అత్యంత విజయవంతమైన టెక్ స్టాక్‌గా మార్చింది. అయితేఈ కంపెనీ బహుశా చాలామందికి తెలియకపోవచ్చు.ఎందుకంటే ఈ కంపెనీ ప్రారంభమైన తర్వాత దాదాపు మూసివేయబడింది. అయితేనేమి మళ్లీ స్టాక్ మార్కెట్లో ఒక్కసారిగా పడి లేచి దుమ్ము దులిపింది. పెట్టుబడిదారులతో పాటు, కోర్‌వీవ్ బాస్ మైఖేల్ ఇంట్రాటర్ కూడా స్టాక్ మార్కెట్ నుండి భారీగా ప్రయోజనం పొందాడు. అతను కొద్ది సమయంలోనే రెండంకెల బిలియనీర్ల జాబితాలోకి వచ్చశాడు.

బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, 56 ఏళ్ల మాజీ హెడ్జ్ ఫండ్ మేనేజర్ మైఖేల్ ఇంట్రాటర్ నికర విలువ గత 12 రోజుల్లో రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి 5 బిలియన్ డాలర్ల నుండి 10 బిలియన్ డాలర్లను దాటింది. భారత కరెన్సీలో చెప్పాలంటే కార్వీవ్ CEO 12 రోజుల్లో రూ.42,742 కోట్ల లాభాన్ని ఆర్జించారు. కార్వీవ్ విజయం దాని CEO అదృష్టాన్ని మార్చడమే కాకుండా, దాని సహ వ్యవస్థాపకుల సంపదను కూడా భారీగా పెంచింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం కంపెనీ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ బ్రియాన్ వెంచురో సంపద ఇప్పుడు 6.4 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. ఇక కంపెనీ చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ బ్రియాన్ మెక్‌బీ మొత్తం నికర విలువ 4.7 బిలియన్ల డాలర్లకు చేరుకుంది.

CEO మైఖేల్ ఇంట్రాటర్ తన కంపెనీ షేర్లు మొదట కుప్పకూలినా భవిష్యత్తుపై నమ్మకం ఉంచుకున్నాడు. అయితే అతని నమ్మకం వమ్ము కాకుండా తక్కువ సమయంలోనే ఇది నిజమని నిరూపించాడు. కంపెనీ ఎప్పటికైనా పుంజుకుంటుందని బలంగా నమ్మాడు. ఆ బలమే ఇప్పుడు ఆయన్ని కోటీశ్వరులను చేసింది.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+