Freshara Agro Exports IPO: ఈవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీవోల కోలాహలం నిరంతయారంగా కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో దలాల్ స్ట్రీట్ లాభాలతో దగదగలాడుతోంది. మార్కెట్లు ఒడిదొడుకుల్లో ఉన్నప్పటికీ ఐపీవోలు మాత్రం బెట్టింగ్ వేసిన వారికి మంచి రాబడులను తెచ్చిపెడుతున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ఫ్రెషరా ఆగ్రో ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ ఐపీవో గురించే. ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చిన ఐపీవో ఎన్ఎస్ఈలో జాబితా అయ్యింది. ఈ క్రమంలో కంపెనీ షేర్లు వాస్తవ ఇష్యూ ధర కంటే 17 శాతం ప్రీమియం ధర రూ.135 వద్ద లిస్ట్ అయ్యాయి. ఈ ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.75.39 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఇందుకోసం పూర్తిగా 64.99 లక్షల తాజా ఈక్విటీ షేర్లను విక్రయించింది. కంపెనీ ఐపీవో ఇష్యూ సమయంలో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.110-116గా ఉంచింది. కంపెనీ లాట్ పరిమాణాన్ని 1200 షేర్లుగా నిర్ణయించటంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఒక్క లాట్ కొనుగోలుకు కనీసం రూ.139200 వెచ్చించాల్సి వచ్చింది.

ఉదయం బంపర్ లిస్టింగ్ తర్వాత ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను విక్రయించటానికి దిగటంతో షేర్లు 5 శాతం లోయర్ సర్క్యూట్ తాకాయి. ఈ క్రమంలో ఇంట్రాడేలో కంపెనీ షేర్లు రూ.128.25 వద్దకు క్షీణించాయి. అక్టోబర్ 17 నుంచి 21 వరకు అందుబాటులో ఉన్న ఇష్యూ మూడు రోజుల సమయంలో 236 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. కంపెనీ తాజా ఐపీవో నుంచి సమీకరించిన మెుత్తాన్ని క్యాపిటల్ ఖర్చులకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు, ఇతర అవసరాలకు వినియోగించాలని నిర్ణయించింది.
ఫ్రెష్రా ఆగ్రో ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ 2015లో స్థాపించబడింది. గెర్కిన్స్, ఇతర ఊరగాయ కూరగాయల సేకరణ, ప్రాసెసింగ్ ఎగుమతిలో కంపెనీ చురుకుగా ఉంది. ఈ కంపెనీ తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల రైతుల నుంచి కాంట్రాక్టు వ్యవసాయ పద్ధతిలో ముడి ఉత్పత్తులను సేకరిస్తోంది. కంపెనీ దోసకాయలు, బేబీ కార్న్, జలపెనోస్, ఇతర ఊరగాయ కూరగాయలు ఉన్నాయి.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?



Click it and Unblock the Notifications