Next Week IPO's: వచ్చే వారం వచ్చే ఐపీఓలు ఇవే.. ఇన్వెస్టర్లకు పండగే..!
వచ్చే వారం పలు ఐపీఓలు రానున్నాయి. మెయిన్‌బోర్డ్, ఎస్ఎంఈ విభాగాలలో తొమ్మిది కంపెనీలు కలిసి దాదాపు రూ.7,681 కోట్లను IPOల ద్వారా సమీకరించనున్నాయి. ఈ ఐపీఓలు ఆగస్టు 10,12 మధ్య ప్రారంభం కానున్నాయి. అదే సమయంలో గత వారం సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమైన ఎనిమిది కంపెనీల షేర్లు మార్కెట్‌లో అరంగేట్రం చేయనున్నాయి.

మెయిన్‌బోర్డ్ ఐపీఓలు
రాబోయే వారంలో అతిపెద్ద ఐపీఓ 'ధూట్ ట్రాన్స్‌మిషన్' ఐపీఓగా రానుంది. ఇది ఆగస్టు 10న సబ్‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమై, ఆగస్టు 12న ముగుస్తుంది. ఈ మెయిన్‌బోర్డ్ ఇష్యూ ధరల శ్రేణి ఒక్కో షేరుకు రూ.829-871గా నిర్ణయించారు. ఈ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.3,066.89 కోట్లను సమీకరించాలని భావిస్తోంది.
'మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్' ఐపీఓ ఆగస్టు 11న ప్రారంభమై, ఆగస్టు 13న ముగుస్తుంది. ఈ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.1,553 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఐపీఓలోఒక్కో షేరుకు రూ.133-140కు విక్రయించనున్నారు. ఈ ఇష్యూలో రూ.1,428 కోట్ల విలువైన కొత్త షేర్ల విక్రయం, రూ.125 కోట్ల విలువైన 'ఆఫర్ ఫర్ సేల్' ఉండనుంది.
'షిప్‌రాకెట్' ఐపీఓ ఆగస్టు 12న ప్రారంభమై, ఆగస్టు 14న ముగుస్తుంది. ఈ లాజిస్టిక్స్, ఈ-కామర్స్ ఎనేబుల్‌మెంట్ ప్లాట్‌ఫారమ్ ఒక్కో షేరుకు రూ.92-97 గా నిర్ణయించింది. ఐపీఓ ద్వారా రూ.1,617.48 కోట్లు సేకరించనున్నారు. ఇందులో రూ.885.50 కోట్ల కొత్త ఇష్యూ కాగా రూ.731.98 కోట్లు ఆఫర్ ఫర్ సేల్. మోల్బియో డయాగ్నోస్టిక్స్ ఐపీఓ ఆగస్టు 10న ప్రారంభం అయి ఆగస్టు 12 న ముగియనుంది. ఐపీఓ ద్వారా రూ.939.70 కోట్లు సేకరించనున్నారు. ఇష్యూ షేర్ల ధర ఒక్కోటి రూ.768-807 గా నిర్ణయించారు. ఈ ఐపీఓలో రూ.200 కోట్ల కొత్త ఇష్యూ, రూ.739.70 కోట్లు ఆఫర్ ఫర్ సేల్.
ఎస్ఎంఈ ఐపీఓలు
ఎస్ఎంఈ విభాగంలో షమ్ ఫోమ్', 'ఫాసినేట్ టెక్స్‌టైల్స్' 'Q&T ఫుడ్స్','ప్రమోదిని మెడికేర్' ఐపీఓగా రానున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications