యుద్ధ భయాలతో భారత్‌కు వచ్చేస్తున్న విదేశీ పెట్టుబడుదారులు..పెట్టుబడుల సునామి ఎంతలా ఉందంటే..

India Attracts Biggest Foreign Inflows: చాన్నాళ్ల తరువాత భారతదేశానికి విదేశాల నుంచి పెట్టుబడులు వెలువెత్తాయి. అమెరికాతో సహా 10 దేశాలు భారతదేశంలో కోట్లాది రూపాయల పెట్టుబడులు పెట్టాయి. ఇదంతా కేవలం కొద్ది రోజుల్లో మాత్రమే జరిగింది. ఏప్రిల్- మే మధ్య కాలంలో US, ఐర్లాండ్ నుండి భారతదేశానికి అత్యధిక పెట్టుబడులు వచ్చాయి. దేశంలో ఇప్పుడు మొత్తం విదేశీ పెట్టుబడుల సంఖ్య 7.5 బిలియన్ల డాలర్లకు పైగా ఉంది.

గత ఆరు నెలల సేల్స్ తర్వాత, విదేశీ పెట్టుబడిదారులు మరోసారి భారత స్టాక్ మార్కెట్ వైపు తమ ద‌ృష్టిని సారించారు. ఏప్రిల్- మే మధ్య కాలంలో భారతదేశంలో అత్యధిక పెట్టుబడులు పెట్టారు.ఈ పెట్టుబడులు ఎక్కుగా అమెరికా, ఐర్లాండ్ నుండి వచ్చాయి. ఈ పెట్టుబడులతో మొత్తం విదేశీ పెట్టుబడుల సంఖ్య 7.5 బిలియన్ డాలర్లకు పైనే చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ 6 శాతం స్థిరమైన రేటుతో దూసుకుపోతోంది. దీంతో విదేశీ పెట్టుబడిదారులు మళ్ళీ ఇండియా వైపు ఆసక్తి చూపారు.

foreign inflows India 2025 FII investment April May US Ireland FII in India Indian stock market foreign investment equity market inflow India foreign institutional investors Indian equities rebound FII data India US funds Indian market global funds India 2025 FII

అమెరికా నుండి 6.25 బిలియన్ డాలర్లు పెట్టుబడి రాగా ఐర్లాండ్ నుండి 1.27 బిలియన్ డాలర్లు పెట్టుబడులు వచ్చాయి. అమెరికా నుండి 95% కంటే ఎక్కువ పెట్టుబడి ఈక్విటీ మార్కెట్‌లోకి పెట్టుబడిగా వచ్చింది. ఇక ఐర్లాండ్ నుంచి 3.45 బిలియన్ డాలర్లు పెట్టుబడులు వచ్చాయి. ఇదే సమయంలో 644 మిలియన్ డాలర్లును మార్కెట్ నుంచి ఐర్లాండ్ పెట్టుబడిదారులు ఉపసంహరించుకున్నారు.

ఇక జర్మనీ విషయానికి వస్తే.. భారత స్టాక్ మార్కెట్లో 811 మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. ఆస్ట్రేలియా పెట్టుబడిదారులు 578.11 మిలియన్ల డాలర్లు, స్విట్జర్లాండ్ 576.58 మిలియన్ డాలర్లు భారత మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ మూడు దేశాలు కస్టడీలో ఉన్న ఆస్తులు (AUC) పరంగా టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయాయి. ఈ ఆస్తుల్లో అమెరికా AUC రూ.31.61 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉండగా జర్మనీ 8వ స్థానంలో ఉంది.

ఇక ఫ్రాన్స్ నుంచి 2.26 బిలియన్ డాలర్లు పెట్టుబడుల రూపంలో రాగా.. మారిషస్ నుంచి 162 మిలియన్ డాలర్లు వచ్చాయి. నార్వే నుంచి 151 మిలియన్ డాలర్లు మేనెలలో పెట్టుబడులుగా వచ్చాయి. ఇక మలేషియా, దక్షిణ కొరియా, UK మరియు లక్సెంబర్గ్ వంటి దేశాలు ఏప్రిల్‌లో పెట్టుబడులు పెట్టగా..మే నెలలో పెట్టుబడి పెట్టడం ఆపేశాయి. అక్టోబర్ 2024- మార్చి 2025 మధ్య కాలంలో భారతదేశం నుండి FIIలు 20 బిలియన్ల డాలర్లకు పైగా ఉపసంహరించుకున్నారు.ఎఫ్‌ఐఐలు ఇప్పుడు భారతదేశాన్ని స్థిరమైన,సురక్షితమైన పెట్టుబడి గమ్యస్థానంగా భావిస్తున్నారు. అమెరికా, ఐర్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల నుండి కొనసాగుతున్న ఈక్విటీ ప్రవాహం భారతదేశ వృద్ధి కథపై ప్రపంచ విశ్వాసానికి సూచనగా కనిపిస్తోంది.

విదేశీ పెట్టుబడిదారులు భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రధాన కారణాలు చాలానే ఉన్నాయి. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారత్ ఒకటిగా నిలవడం పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపింది. బ్యాంకింగ్, మౌలిక సదుపాయాలు, ఆటో, ఇంధనం వంటి రంగాలలో కనిపిస్తున్న వృద్ధి కూడా పెట్టుబడులకు కారణంగా నిలుస్తోంది. RBI చాలా కాలంగా వడ్డీ రేట్లలో స్థిరత్వాన్ని కొనసాగించడంతో ఈక్విటీలో పెట్టేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికా-చైనా ఉద్రిక్తత, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం వంటి అంతర్జాతీయ సంక్షోభాల మధ్య భారత్ పెట్టుబడిదారులకు స్వర్గధామంగా కనిపిస్తోంది.

Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+