IPO మార్కెట్‌లో కాసుల వర్షం.. రాబోయే రోజుల్లో రూ.3,500 కోట్లతో వస్తున్న 5 క్రేజీ కంపెనీలు!
గడిచిన రెండు నెలలుగా ఇండియన్ ప్రైమరీ మార్కెట్ (Primary Market) చాలా సైలెంట్‌గా సాగింది. కొత్తగా పెద్ద మెయిన్‌బోర్డ్ ఐపీఓలు ఏవీ రాకపోవడంతో ఇన్వెస్టర్లు కొంచెం డల్‌గా కనిపించారు. కానీ, ఇప్పుడు మార్కెట్ మళ్లీ పుంజుకుంటోంది. రాబోయే కొద్ది వారాల్లోనే దాదాపు రూ.3,500 కోట్ల నిధుల సేకరణే లక్ష్యంగా 5 సరికొత్త IPO లు మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం.

మార్కెట్లో మారిన ట్రెండ్!
ఇటీవల లిస్ట్ అయిన సిఎమ్‌ఆర్ గ్రీన్ టెక్నాలజీస్ (CMR Green) ఏకంగా 40 శాతం లాభంతో మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చి ఇన్వెస్టర్లకు బంపర్ ప్రాఫిట్స్ అందించింది. అలాగే హెక్సాగన్ న్యూట్రిషన్ కూడా 7 శాతం లాభంతో లిస్ట్ అయింది. ఈ పాజిటివ్ సిగ్నల్స్‌తో మరికొన్ని కంపెనీలు తమ ఐపీఓలను లైన్లో పెట్టాయి. రాబోయే రోజుల్లో అద్విత్ జ్యువెల్స్, టర్టిల్‌మింట్ ఫిన్‌టెక్, ఆస్థా స్పింటెక్, వాటర్‌వేస్ లీజర్ టూరిజం, అండ్ నాక్ ప్యాకేజింగ్ కంపెనీలు తమ ఐపీఓలతో రానున్నాయి.
టర్టిల్‌మింట్, అద్విత్ జ్యువెల్స్ డేట్స్ ఇవే!
ఈ ఐదు కంపెనీల్లో రెండింటి టైమ్‌లైన్ ఇప్పటికే ఖరారైంది. సాంప్రదాయ, ఆధునిక హ్యాండ్‌క్రాఫ్టెడ్ జ్యువెలరీ తయారు చేసే 'అద్విత్ జ్యువెల్స్' ఐపీఓ జూన్ 23న ప్రారంభమై జూన్ 25న ముగియనుంది. వీరు రూ.150 కోట్ల విలువైన 1.2 కోట్ల కొత్త షేర్లను జారీ చేయనున్నారు.
ఇక ప్రముఖ ఇన్సూరెన్స్ టెక్ స్టార్టప్ 'టర్టిల్‌మింట్ ఫిన్‌టెక్ సొల్యూషన్స్' జూన్ 19 నుంచి జూన్ 23 మధ్య మార్కెట్లోకి రానుంది. ఈ ఐపీఓ సైజ్ దాదాపు రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. క్లౌడ్ అండ్ సర్వర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ డెవలప్‌మెంట్ కోసం ఈ నిధులను వాడనున్నారు.
క్రూయిజ్ కంపెనీ ఐపీఓ కూడా వస్తోంది!
ముంబైకి చెందిన ప్రముఖ క్రూయిజ్ ఆపరేటర్ 'కోర్డెలియా క్రూయిసెస్' మాతృసంస్థ అయిన 'వాటర్‌వేస్ లీజర్ టూరిజం' కూడా రూ.727 కోట్లు సేకరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో రిటైల్ ఇన్వెస్టర్లకు 10 శాతం కోటా కేటాయించనున్నారు. ఇక అహ్మదాబాద్‌కు చెందిన ప్యాకేజింగ్ సొల్యూషన్స్ కంపెనీ 'నాక్ ప్యాకేజింగ్' రూ.600 కోట్ల ఐపీఓతో రానుంది. గుజరాత్‌లోని బోరిసానాలో కొత్త మాన్యుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టేందుకు ఈ డబ్బును ఉపయోగించనున్నారు.
రాబోయే రోజుల్లో భారీ ఐపీఓల క్యూ!
గ్లోబల్ మార్కెట్ టెన్షన్లు, విదేశీ ఇన్వెస్టర్ల (FII) అమ్మకాల వల్ల మార్కెట్ కొద్దిరోజులు ఒడిదొడుకులకు లోనైనా.. ఇప్పుడు మళ్లీ ఐపీఓల జోరు పెరిగింది. ఈ ఐదు కంపెనీలతో పాటు ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ 'జెప్టో' (Zepto) ఇప్పటికే సెబీకి డ్రాఫ్ట్ పేపర్స్ సబ్మిట్ చేసింది. వీటితో పాటు రిలయన్స్ జియో (Reliance Jio), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) కూడా ఐపీఓ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్లో మంచి లాభాలు సంపాదించే అవకాశాలు పుష్కలంగా దొరకనున్నాయి.


Click it and Unblock the Notifications