భారత మార్కెట్లకు విదేశీ ఇన్వెస్టర్లు గుడ్ బై.. రూ.3 లక్షల కోట్లు వెనక్కి.. హాట్ మనీ పరార్ వెనుక కారణం ఏంటంటే..

FII Selling in 2026: భారతీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల (FII) వాటాలు వేగంగా ఆవిరైపోతున్నాయి. ప్రస్తుత 2026 సంవత్సరంలో ఇప్పటివరకు విదేశీ ఇన్వెస్టర్లు జరిపిన నికర నిష్క్రమణ ఏకంగా రూ. 3.04 లక్షల కోట్లను దాటేసింది. గడిచిన 2025 మొత్తం సంవత్సరంలో రికార్డు స్థాయిలో విక్రయించిన రూ. 1.66 లక్షల కోట్ల కంటే ఇది దాదాపు రెట్టింపు కావడం ఆర్థిక రంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

గత జూలై, ఆగస్టు నెలల్లో మార్కెట్లోకి కొద్దిపాటి నిధులు వచ్చి పునరుద్ధరణ సంకేతాలు కనిపిస్తున్నట్లు అనిపించినప్పటికీ.. ఆ తర్వాత ప్రారంభమైన విక్రయాల హోరు ఆ ఆశలను పూర్తిగా తుడిచిపెట్టేసింది. డిపాజిటరీ, ఎక్స్ఛేంజ్ గణాంకాల ప్రకారం.. కేవలం అక్టోబర్ నెలలోనే (అక్టోబర్ 9 నాటికి) ఎఫ్‌ఐఐలు ఏకంగా రూ. 44,166 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు. ఇది అంతకుముందు సెప్టెంబర్ నెలలో జరిగిన రూ. 35,861 కోట్ల విక్రయాల రికార్డును ఇప్పటికే అధిగమించడం విశేషం.

FII Selling in 2026 Foreign Institutional Investor FII holdings in Indian equity markets are evaporating rapidly So far in 2026 the net outflow by foreign investors has crossed the Rs 3 04 lakh crore mark

దినసరి లావాదేవీలను పరిశీలిస్తే అక్టోబర్ 1న రూ. 9,232 కోట్లు, గురువారం నాటి ట్రేడింగ్‌లో అత్యధికంగా రూ. 12,944 కోట్ల నిధులను విదేశీ మదుపర్లు భారత మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకున్నారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DII) వేల కోట్ల రూపాయల కొనుగోళ్లతో మార్కెట్‌ను ఆదుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఈ విదేశీ విక్రయాల దెబ్బకు నిఫ్టీ, సెన్సెక్స్ సూచీలు వరుస మద్దతు స్థాయిలను కోల్పోతున్నాయి.

Also Read

ఈ భారీ నిధుల ఉపసంహరణ వెనుక అనేక అంతర్జాతీయ, ప్రాంతీయ ఆర్థిక ప్రతికూలతలు పనిచేస్తున్నాయి. ఇది కేవలం భారత్‌కే పరిమితమైన సమస్య కాదని, మొత్తం వర్ధమాన మార్కెట్ల (Emerging Markets) నుండి విదేశీ పెట్టుబడులు బయటకు తరలిపోతున్నాయని మార్కెట్ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వర్ధమాన మార్కెట్ ఈటీఎఫ్‌ల నుంచి నిధులు వెనక్కి వెళ్తుండటంతో, లభ్యంగా ఉన్న పరిమిత మూలధనం కోసం భారతదేశం ఇతర దేశాలతో పోటీపడాల్సి వస్తోంది.

అదే సమయంలో భారత్‌లో షేర్ల వాల్యుయేషన్లు అత్యంత ప్రియంగా ఉండటం కూడా విదేశీ ఇన్వెస్టర్లను వెనక్కు తగ్గేలా చేస్తోంది. ఉదాహరణకు, కృత్రిమ మేధస్సు, సంబంధిత సాంకేతిక రంగాలలో మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తున్న దక్షిణ కొరియా వంటి ఆసియా మార్కెట్లు విదేశీ నిధులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడానికి ప్రస్తుతం భారతీయ ఈక్విటీలలో అవసరమైన 'ప్రత్యేక ఆకర్షణ' కొరవడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

దీనికి తోడు ముడి చమురు ధరల మంట, బాండ్ రాబడుల పెంపు మార్కెట్‌ను మరింత ఒత్తిడికి గురిచేస్తున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో ముఖ్యంగా సౌదీ-హౌతీ ఘర్షణల వల్ల నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా బ్రెంట్ చమురు ధర బ్యారెల్‌కు సుమారు 100 డాలర్ల వద్ద నిలకడగా కొనసాగుతోంది. చమురు దిగుమతులపై తీవ్రంగా ఆధారపడే భారత్ లాంటి దేశానికి ఇది కోలుకోలేని దెబ్బ. మరోవైపు అమెరికాలో 10-సంవత్సరాల ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ 5.3 శాతానికి చేరడం, 2002 తర్వాత అత్యధిక స్థాయిని తాకడం వల్ల విదేశీ మదుపర్లు రిస్క్‌తో కూడిన భారతీయ ఈక్విటీల కంటే సురక్షితమైన యూఎస్ బాండ్ల వైపు తమ నిధులను మళ్లిస్తున్నారు. అలాగే డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 96 స్థాయి దాటి పతనం కావడం వల్ల, విదేశీ పెట్టుబడిదారులకు వచ్చే డాలర్ రాబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి.

అయితే ఈ విక్రయాల పరంపరను భారత ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం కోల్పోవడంగా భావించకూడదని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. ఇది గ్లోబల్ పోర్ట్‌ఫోలియోల సర్దుబాటు, రిస్క్ నిర్వహణలో భాగమేనని చెబుతున్నారు. అయినప్పటికీ, నిఫ్టీలోని కీలకమైన 24,000, 23,000, 22,500 మద్దతు స్థాయిలు వరుసగా విచ్ఛిన్నం కావడంతో మార్కెట్లో అస్థిరత పెరిగింది. ఈ విదేశీ అమ్మకాల సెగ కేవలం లార్జ్-క్యాప్‌లకే పరిమితం కాకుండా మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లను కూడా తీవ్రంగా దెబ్బతీస్తోంది. పశ్చిమాసియా ఘర్షణలు ఒక కొలిక్కి వచ్చి, ముడి చమురు ధరలు తగ్గి, కార్పొరేట్ కంపెనీల ఆదాయాల గణాంకాలు నిలకడగా నమోదయ్యే వరకు మార్కెట్లపై ఈ విదేశీ విక్రయాల ఒత్తిడి ఇలాగే కొనసాగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+