BSE: బీఎస్ఈ షేర్లు పడుతున్నాయి.. కారణం ఎన్ఎస్ఈ ఐపీఓనా..!

శుక్రవారం నాడు బీఎస్ఈ షేర్లు మరోసారి అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ట్రేడింగ్‌లో బీఎస్ఈ షేర్ ధర రూ.3,280 వద్ద తక్కువగా ప్రారంభమై, ఇంట్రాడే కనిష్ట స్థాయి అయిన రూ.3,193.20ని తాకింది. తద్వారా దాదాపు 3 శాతం నష్టపోయింది. నెల రోజుల పాటు ఒత్తిడిలో ఉన్న బీఎస్ఈ షేర్లలో గురువారం నాడు కొంతమేర 'వాల్యూ బయింగ్' చేయడం కనిపించింది. స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎన్ఎస్ఈ ఐపీఓ కారణంగా బీఎస్ఈ షేర్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ అంచనాల కారణంగా BSE స్టాక్ 'ఓవర్‌వాల్యూడ్' అవడంతో BSE షేర్లలో అమ్మకాలకు దారితీసింది. బీఎస్ఈ షేర్లు రూ.3,100 స్థాయి కంటే దిగువకు పడిపోయే అవకాశం లేదని, త్వరలోనే కోలుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఎన్ఎస్ఈ ఐపీఓ ధరల శ్రేణి ప్రకటన కారణంగా BSE షేర్లు పడిపోతున్నాయని అవినాష్ మెంటర్ రీసెర్చ్' వ్యవస్థాపకుడు అవినాష్ గోరక్షకర్ పేర్కొన్నారు. అధికారిక ప్రకటన తర్వాత NSE IPO పరిమాణం రూ.30,000 కోట్ల నుంచి దాదాపు రూ.26,500 కోట్లకు తగ్గింది. దీనివల్ల ఎన్ఎస్ఈ షేర్లు 35 PE మల్టిపుల్ వద్ద లభిస్తుండగా, బీఎస్ఈ షేర్లు 49 PE మల్టిపుల్ వద్ద లభిస్తున్నాయి. కాబట్టి, NSE షేర్లతో పోలిస్తే BSE షేర్ల సాపేక్ష విలువ ఎక్కువగా ఉంది. ఈ పతనానికి ఇదే ప్రధాన కారణం కావచ్చని పేర్కొంటున్నారు. బీఎస్ఈ విలువ ఎన్ఎస్ఈ షేర్ల విలువకు దగ్గరగా వచ్చే వరకు బీఎస్ఈ షేర్ ధర మరింత పడిపోయే అవకాశం ఉందని అవినాష్ గోరక్షకర్ అభిప్రాయపడ్డారు.

BSE

బీఎస్ఈ స్టాక్‌కు రూ.3,100 వద్ద బలమైన మద్దతు ఉంటుందని ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా అన్నారు. బీఎస్ఈ షేర్లకు రూయ3,100 వద్ద ఉన్న మద్దతు స్థాయి పటిష్టంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే రూ.3,450 నుంచి రూ.3,500 లక్ష్య ధర కోసం BSE వాటాదారులు ఈ స్టాక్‌ను తమ వద్దే ఉంచుకోవాలని ఆయన సూచించారు. బీఎస్ఈ షేర్లను కొనుగోలు చేయాలనుకునే వారికి సలహా ఇస్తూ కొత్తగా పెట్టుబడి పెట్టేవారు రూ.3100 వద్ద 'స్టాప్-లాస్ పాటిస్తూ రూ.3500 అనే స్వల్పకాలిక లక్ష్యంతో ప్రస్తుత మార్కెట్ ధర వద్ద BSE షేర్లను కొనుగోలు చేయవచ్చని సూచించారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+