Suzlon Energy: స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులు ఎల్లప్పుడూ స్మాల్ క్యాప్, పెన్నీ స్టాక్ కోసం వెతుకుతుంటారు. కొన్ని కంపెనీలకు మంచి భవిష్యత్తు ఉన్నప్పటికీ షేర్ ధర తక్కువలో ఉంటుంటాయి. వీటిని ముందుగా పసిగట్టి క్వాలిటీ షేర్లలో ఇన్వెస్ట్ చేసేవారి సంఖ్య మార్కెట్లో ఎక్కువే. అలాంటి వారి రాడార్‌లో ఉండే షేర్లలో ఒకటి సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ కూడా ఉంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో పనిచేస్తూ వేగంగా ఇటీవలి కాలంలో వ్యాపార వృద్ధిని నమోదు చేస్తున్న సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ షేర్ల గురించే. రానున్న స్వల్ప కాలంలో కంపెనీ షేర్లు ఒక్కోటి రూ.50 స్థాయికి పతనం అవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గడచిన కొన్ని ట్రేడింగ్ సెషన్ల నుంచి కంపెనీ షేర్లు కరెక్షన్ మోడ్‌లో ఉండటం దీనికి కారణంగా తెలుస్తోంది. జనవరి నెలాఖరు నుంచి కంపెనీ షేర్లు దాదాపు 7.4 శాతం క్షీణతను చూశాయి. వాస్తవానికి జనవరి 31, 2025న సుజ్లాన్ స్టాక్ ఒక్కోటి రూ.58.15 వద్ద ట్రేడింగ్ ముగించిన సంగతి తెలిసిందే.

గడచిన ఆరు నెలలుగా కంపెనీ షేర్ల పనితీరును పరిశీలిస్తే దాదాపు 30 శాతం పతనాన్ని చూశాయి. అలాగే 2025లో కంపెనీ షేర్లు 18 శాతం పతనంతో కొనసాగుతున్నాయి. నేడు మధ్యాహ్నం 2.52 గంటల సమయంలో కంపెనీ షేర్లు బీఎస్ఈలో ఒక్కోటి రూ.53.69 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్ల 52 వారాల గరిష్ఠ ధరను పరిశీలిస్తే రూ.86.04గా ఉంది. ఈ క్రమంలో నేడు కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.73,167 కోట్ల వద్ద కొనసాగుతోంది. ఇదే క్రమంలో టెక్నికల్స్ పరిశీలిస్తే అన్ని మూవింగ్ యావరేజ్ కింద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
స్టాక్ బాక్స్ టెక్నికల్ అనలిస్ట్ కుషాల్ గాంధీ ప్రకారం కంపెనీ షేర్లు దాని గరిష్ఠమైన రూ.85.85 నుంచి దాదాపు 44 శాతం క్షీణతను చూసింది. ఇది 2024 మార్చి ధర కంటే 142 శాతం అధికం కావటం గమనార్హం. అలాగే సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ రామచంద్రన్ ప్రకారం స్టాక్ రూ.52 స్థాయి కిందకు పడిపోతే రూ.47.8 రేటుకు చేసుకోవచ్చని చెప్పారు. అలాగే మోర్గన్ స్టాన్లీ కంపెనీ షేర్లకు ఓవర్ వెయిట్ రేటింగ్ అందిస్తూ భవిష్యత్తులో స్టాక్ ధర ఒక్కోటి రూ.71 స్థాయికి పెరగవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే జేఎం ఫైనాన్షియల్ కంపెనీ షేర్లకు బై రేటింగ్ అందిస్తూ టార్గెట్ ధరను రూ.80 వద్ద ఉంచింది.
కంపెనీ తన కొత్త బ్లేడ్ తయారీ లైన్ల విస్తరణ కోసం రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో ఏర్పాటుకు రూ.350-400 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని ప్లాన్ చేయటంపై కూడా బ్రోకరేజీలు సానుకూలతను వ్యక్తం చేస్తున్నాయి. ఇవి భవిష్యత్తులో కంపెనీ ఆదాయాలను పెంచటానికి లాభదాయకతకు దోహదపడతాయని వారు చెబుతున్నారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications