మోజిల్లా నివేదికతో కుప్పకూలిన టాప్ ఐటీ కంపెనీ షేర్లు.. భారీ నష్టాలతో భోరుమంటున్న ఇన్వెస్టర్లు..

eMudhra Stock: డిజిటల్ సంతకాలు, సైబర్ భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత డాక్యుమెంట్ ప్రాసెసింగ్ సేవలందిచే ప్రముఖ భారత ఐటీ కంపెనీ 'ఇ-ముద్ర' (eMudhra) స్టాక్ మార్కెట్‌లో బుధవారం (అక్టోబర్ 21) నాడు దారుణ పతనాన్ని మూటగట్టుకుంది. బిఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి ఎదురవడంతో కంపెనీ షేరు ధర ఒకే రోజులోనే ఏకంగా 20 శాతం పడిపోయింది. ఏకంగా భారీ పతనంలో రూ. 432 వద్ద లోయర్ సర్క్యూట్‌ను తాకింది. కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన నాటి నుండి ఒక్క రోజే ఈ స్థాయిలో కుప్పకూలడం ఇదే తొలిసారి కావడం గమనార్హంగా చూడవచ్చు. గత డిసెంబర్ 2024లో నమోదు చేసిన రూ. 1,024 రికార్డు ఆల్-టైమ్ హై స్థాయి నుండి ఈ షేరు ప్రస్తుతం దాదాపు 60 శాతం మేర క్షీణించింది.

కంపెనీ షేర్ల క్రాష్‌కి సైబర్ భద్రతాపరమైన తీవ్ర లోపమే ప్రధాన కారణమని తెలుస్తోంది. మోజిల్లా (Mozilla) ప్రచురించిన ఒక అధికారిక బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. అక్టోబర్ 17న ఇ-ముద్రకు చెందిన 8 ఇంటర్మీడియట్ డిజిటల్ సర్టిఫికేట్లకు సంబంధించిన అత్యంత కీలకమైన ప్రైవేట్ కీలు (Private Keys) రాజీపడ్డాయి. డిజిటల్ భద్రతా వ్యవస్థలో ప్రైవేట్ కీలు అనేది సైబర్ కమ్యూనికేషన్‌ను రక్షించే అత్యంత కీలకమైన అంశాలు. ఈ సమాచారం రాజీ పడటంతో మోజిల్లా తక్షణమే స్పందించి.. ఫైర్‌ఫాక్స్ (Firefox) బ్రౌజర్‌లో సదరు ప్రభావిత సర్టిఫికేట్లను పూర్తిగా బ్లాక్ చేసింది.

eMudhra Share Price eMudhra Stock Crash eMudhra Shares Today eMudhra Stock News eMudhra Share Price Today eMudhra 20 Percent Fall eMudhra Digital Certificates Weak Cryptographic Keys Intermediate Certificates eMudhra Cybersecurity eMudhra Security Concerns NSE eMudhra BSE eMudhra Indian Stock Market News Stock Market Today 20

మోజిల్లా తన 'వన్-సిఆర్‌ఎల్' (OneCRL) వ్యవస్థ ద్వారా ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో ప్రభావిత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లను బ్లాక్ చేసింది. వన్-సిఆర్‌ఎల్ అనేది రద్దు చేయబడిన డిజిటల్ సర్టిఫికేట్‌ల కేంద్ర జాబితాగా పనిచేస్తుంది. అంతటితో ఆగకుండా.. మోజిల్లా తన విశ్వసనీయ సర్టిఫికేట్‌ల జాబితా (Trusted Certificate List) నుండి ప్రభావిత ఇంటర్మీడియట్ సర్టిఫికేట్‌పై సంతకం చేసిన రూట్ సర్టిఫికేట్‌ను తొలగించే ప్రక్రియను చేపట్టింది. వన్-సిఆర్‌ఎల్ నుండి ప్రత్యక్ష అప్‌డేట్‌లను స్వీకరించని ఇతర థర్డ్-పార్టీ యాప్‌లకు ఈ భద్రతా ప్రమాదం విస్తరించకుండా నిరోధించడమే మోజిల్లా ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.

Also Read

ఈ భద్రతా లొసుగుపై ఇ-ముద్ర తన వెబ్‌సైట్ బ్లాగ్ పోస్ట్ ద్వారా స్పందించింది. సమస్యను గుర్తించిన వెంటనే ప్రమాద నివారణ చర్యలను ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. తమ వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడానికి, ఇంటర్నెట్‌లో డిజిటల్ సర్టిఫికేట్ వ్యవస్థల విశ్వసనీయతను కాపాడటానికి వివిధ బ్రౌజర్‌లు, రూట్-స్టోర్ ఆపరేటర్లతో కలిసి పనిచేస్తున్నామని వివరించింది. ఈ ఘటన వెనుక ఉన్న పరిస్థితులపై అంతర్గత దర్యాప్తు ప్రారంభించామని, భద్రతా నియంత్రణలు, అంతర్గత పని ప్రక్రియలను పూర్తిగా పునఃసమీక్షిస్తున్నట్లు పేర్కొంది.

అదే సమయంలో, మోజిల్లాతో ఉన్న తమ రూట్ సర్టిఫికేట్ సిఏలైన C1, C3లను తొలగించడం అనేది స్వచ్ఛందంగా, ముందస్తు ప్రణాళిక ప్రకారం జరిగిందే తప్ప, ప్రస్తుత ప్రైవేట్ కీ భద్రతా ఘటనా పరిణామంతో దానికి ఎలాంటి సంబంధం లేదని ఇ-ముద్ర ప్రతినిధులు స్పష్టం చేశారు. దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ కొత్త సమాచారాన్ని మార్కెట్‌కు వెల్లడిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఇన్వెస్టర్లలో మాత్రం నమ్మకం దెబ్బతినడంతో ఇ-ముద్ర షేరు ఘోరమైన పతనాన్ని చవిచూసింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+