Emerald Tyre Manufacturers IPO: దేశీయంగా ఈవారం ఐపీవోల రాక స్టాక్ మార్కెట్లలోకి తగ్గినప్పటికీ వచ్చిన కొద్ది సంఖ్యలో ఐపీవోలు మాత్రం భారీ లాభాలను బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లకు అందించాయి. ప్రధానంగా ఎస్ఎమ్ఈ ఐపీవోలు డిసెంబరులో ఇన్వెస్టర్ల డబ్బును మెుదటి రోజే 100 శాతం రాబడిని తెచ్చిపెట్టాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు స్టాక్ మార్కెట్లలో విజయవంతంగా జాబితా అయిన ఎమరాల్డ్ టైర్ మ్యానుఫ్యాక్చరర్స్ కంపెనీ ఐపీవో గురించే. నేడు కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో బలమైన లాభాలతో 90 శాతం ప్రీమియం రేటు వద్ద జాబితా అయ్యాయి. వాస్తవానికి ఇష్యూ సమయంలో కూడా కంపెనీ ఐపీవో పెట్టుబడిదారుల నుంచి 500 రెట్లు సబ్‌స్క్రిప్షన్ చూసింది. ఈ క్రమంలో ఒక్కో షేరు ఇష్యూ ధర కంటే అధికంగా ప్రీమియంతో రూ.180.50 రేటు వద్ద తమ ప్రయాణాన్ని స్టార్ట్ చేశాయి.

వాస్తవానికి కంపెనీ తాజా ఐపీవో ద్వారా రూ.49.26 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఇందులో ప్రధానంగా రూ.47.37 కోట్లకు తాజా ఈక్విటీ ఇష్యూ ఉండగా.. మిగిలిన భాగం ఆఫర్ ఫర్ సేల్ కింద ఉంచబడింది. ఓఎఫ్ఎస్ కింద 1.99 లక్షల షేర్లు విక్రయానికి ఉంచబడ్డాయి. సాధారణ పెట్టుబడిదారుల కోసం కంపెనీ ఐపీవో డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 9 వరకు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంచబడింది. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.90-95గా ఉంచబడింది. అలాగే పెట్టుబడిదారుల కోసం కనీసం లాట్ పరిమాణాన్ని కంపెనీ 1200 షేర్లుగా ఉంచింది. అందువల్ల కంపెనీ ఐపీవోలో పాల్గొనాలనుకున్న రిటైల్ పెట్టుబడిదారులు ఇందుకోసం రూ.1,14,000 కనీస పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.13.91 కోట్లను సమీకరించింది. కంపెనీ ప్రమోటరుగా చంద్రశేఖరన్ తిరుపతి అరుణాచలం వ్యవహరిస్తున్నారు.
తమిళనాడు కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీ ఐపీవో గ్రేమార్కెట్లోని 90 శాతం ప్రీమియం రేటును లిస్టింగ్ సమయంలో ప్రతిబింబిచంటతో బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు క్షణాల్లోనే డబ్బును డబుల్ చేసుకున్నారు. కంపెనీ తాజా ఐపీవో నుంచి సమీకరించిన మెుత్తాన్ని ప్రధానంగా మూలధన వ్యయాలతో పాటు సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలు, ఇష్యూ ఖర్చుల కోసం వినియోగించాలని నిర్ణయించింది.
కంపెనీ వ్యాపారం..
2002లో స్థాపించబడిన కంపెనీ ప్రధానంగా వివిధ రకాల టైర్ల తయారీ, సప్లై, సర్వీస్ వ్యాపారంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ప్రస్తుతం కంపెనీ తన ఉత్పత్తులను "GRECKSTER" బ్రాండ్ పేరు కింద విక్రయాలను కొనసాగిస్తోంది. ఎమరాల్డ్ టైర్ తయారు చేసే వివిధ ఉత్పత్తులను పరిశీలిస్తే.. సాలిడ్ రెసిలెంట్ టైర్లు, ప్రెస్ బ్యాండ్‌లు, ఇండస్ట్రియల్ పెనుమాటిక్ టైర్లు & బ్యూటైల్ ట్యూబ్‌లు & ఫ్లాప్స్ అండ్ వీల్ రిమ్స్ వంటివి ఉన్నాయి. కంపెనీ ఉత్పత్తులు అమెరికా, యూఏఈ, రష్యా, UKతో పాటు బెల్జియం, జర్మనీ, నెదర్లాండ్స్, హంగ్రీ, పోర్చుగల్, ఇటలీ, డెన్మార్క్ పోలాండ్ వంటి ప్రధాన యూరోపియన్ దేశాలలోను విక్రయించబడుతున్నాయి. అమెరికా, బెల్జియం, యూఏఈలో కంపెనీ గిడ్డంగులను కూడా కలిగి ఉంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications