స్టాక్ మార్కెట్‌లో అదృష్టం తలుపు తడితే రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయిపోవచ్చు అనడానికి ఈ స్టాక్ ఒక నిదర్శనం. ఒకప్పుడు కేవలం కొద్ది రూపాయల్లో ఉన్న షేర్, ఇప్పుడు ఇన్వెస్టర్ల కళ్లల్లో ఆనందాన్ని నింపుతోంది. అదే స్మాల్-క్యాప్ మల్టీబ్యాగర్ స్టాక్ ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్ (Elitecon International). ఈ ఏడాది చివరి రోజైన డిసెంబర్ 31న మార్కెట్లు పుంజుకోవడంతో ఈ షేర్ కూడా 5% అప్పర్ సర్క్యూట్‌ను తాకి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది.

బుధవారం ట్రేడింగ్‌లో ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్ (Elitecon International) షేరు ధర 5% పెరిగి రూ. 99.80 వద్ద లాక్ అయ్యింది. గత మూడు సెషన్లుగా వరుసగా నష్టపోతున్న ఈ స్టాక్.. నేడు మార్కెట్ రికవరీ కావడంతో మళ్లీ కొనుగోళ్ల మద్దతును పొందింది. సెన్సెక్స్, నిఫ్టీలు స్వల్ప లాభాల్లో ఉన్న తరుణంలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ తన సత్తా చాటింది.
నమ్మశక్యం కాని రిటర్న్స్.. 7,500% లాభం!
ఈ స్టాక్ ప్రయాణాన్ని చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఆగస్టు 2024 నుండి ఇప్పటివరకు ఈ స్టాక్ ఏకంగా 7,500% పైగా రిటర్న్స్ ఇచ్చింది. అంటే అప్పట్లో పెట్టిన ఒక లక్ష రూపాయలు నేడు సుమారు 75 లక్షల రూపాయలుగా మారాయి. గత ఏడాది కాలంలోనే ఈ షేరు 850% పెరిగింది.
భారీగా పెరగనున్న బారోయింగ్ కెపాసిటీ..
కంపెనీ భవిష్యత్తులో విస్తరణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. తన వ్యాపార అవసరాల కోసం అప్పు తీసుకునే పరిమితిని రూ. 500 కోట్లకు పెంచుతూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ నిధులను కొత్త పెట్టుబడులకు, లోన్లకు, గ్యారెంటీలకు ఉపయోగించనున్నారు. షేర్ హోల్డర్ల ఆమోదం పొందిన తర్వాత ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. ఇది కంపెనీ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేస్తుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.
విదేశీ ఆర్డర్ల వెల్లువ: రూ. 800 కోట్లకు పైగా కాంట్రాక్ట్
కేవలం ఫైనాన్షియల్ అప్‌డేట్స్ మాత్రమే కాదు, ఎలైట్ కాన్ ఇంటర్నేషనల్ (Elitecon International) ఆర్డర్ బుక్ కూడా చాలా బలంగా ఉంది. డిసెంబర్ 15న ఈ కంపెనీ 97.35 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 810 కోట్లు) విలువైన భారీ ఎగుమతి ఆర్డర్‌ను దక్కించుకుంది. సిగరెట్లు, హుక్కా టొబాకో, ఇతర ఉత్పత్తుల ఎగుమతి కోసం జరిగిన ఈ సుదీర్ఘ కాల ఒప్పందం వల్ల కంపెనీకి రాబోయే కొన్నేళ్ల పాటు ఆదాయం స్థిరంగా రానుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ కంపెనీ ఉత్పత్తులకు ఉన్న డిమాండ్‌ను ఇది తెలియజేస్తోంది.
ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలి!
స్మాల్-క్యాప్ స్టాక్స్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఎలైట్ కాన్ కంపెనీ గత ఆరు నెలల్లో 58% లాభపడినా, గత మూడు నెలల్లో ఏకంగా 49% నష్టపోయింది. అంటే వేగంగా పెరిగే స్టాక్స్ అంతే వేగంగా పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి, ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు టెక్నికల్ అనాలిసిస్ చేయడం లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించడం మంచిది.
(గమనిక: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.)


Click it and Unblock the Notifications