భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్ రంగానికి ఒక పెద్ద దెబ్బ ఎదురుదెబ్బ తగిలింది. పార్లమెంటు ఇటీవల ఆమోదించిన ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు-2025 ఆమోదించిన సంగతి విదితమే. ఈ బిల్లు ప్రకారం.. దేశవ్యాప్తంగా అన్ని రియల్-మనీ గేమ్స్‌కి నిషేధం విధించారు. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత ప్రముఖ ఫాంటసీ గేమింగ్ కంపెనీ డ్రీమ్11 తన రియల్-మనీ గేమింగ్ వ్యాపారాన్ని పూర్తిగా మూసివేయబోతున్నట్లు ప్రకటించింది.
అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. Dream11 ఇప్పటికే ఈ నిర్ణయాన్ని ఉద్యోగులకు తెలియజేసింది. డ్రీమ్ స్పోర్ట్స్ గ్రూప్ ఆదాయంలో దాదాపు 67% రియల్-మనీ గేమ్స్ నుంచే వస్తోంది. అంటే కంపెనీకి ఇది ఈ బిల్లు ఆచరణలోకి వస్తే పెద్ద దెబ్బ తగులుతుంది. దీంతో కంపెనీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. డ్రీమ్11 వాలెట్‌లో ఇప్పటికే డబ్బు ఉన్న కస్టమర్లు తమ డబ్బును ఉపసంహరించుకోవచ్చని కంపెనీ స్పష్టంగా తెలిపింది.
ఏ గేమ్స్ నిషేధం కిందకి వచ్చాయి: కేంద్ర కొత్తగా తీసుకువచ్చిన బిల్లు దెబ్బకు దేశంలో నడుస్తున్న అన్ని రకాల రియల్-మనీ గేమ్స్ నిషేధించబడ్డాయి. వీటిలో ఫాంటసీ స్పోర్ట్స్, పోకర్, రమ్మీ, బెట్టింగ్ తరహా యాప్‌లు నిషేధించబడ్డాయి. ఈ యాప్‌ల వాలెట్లలో డబ్బు పెట్టిన గేమర్లకు ప్రమాదం పెరిగింది. డబ్బు తిరిగి వస్తుందా లేదా అన్న గందరగోళం నెలకొంది. అయితే కొన్ని కంపెనీలు డబ్బు వాపస్ తీసుకునేందుకు ఆప్షన్ ఇచ్చాయి. డ్రీమ్ 11 మాత్రమే కాదు, మరో గేమింగ్ ప్లాట్‌ఫామ్ జూపీ కూడా చెల్లింపు ఆధారిత గేమ్‌లను మూసివేయాలని నిర్ణయించింది. అయితే, జూపీ తన ఉచిత గేమ్స్ మాత్రం యథావిధిగా అందుబాటులో ఉంటాయని ప్రకటించింది.

భారత మార్కెట్లో కేవలం దేశీయ యాప్‌లు మాత్రమే కాకుండా 700కి పైగా విదేశీ ఆన్‌లైన్ మనీ గేమింగ్ కంపెనీలు కూడా యాక్టివ్‌గా ఉన్నాయి. ఇవి ఎక్కువగా UPI చెల్లింపు విధానం ను ఉపయోగిస్తున్నాయి. గత కొన్ని నెలల్లో ఈ యాప్‌ల ద్వారా భారీగా లావాదేవీలు జరిగాయి. కానీ కొత్త బిల్లులోని కఠిన నిబంధనల వల్ల ఇవి కూడా నిషేధించబడి UPI పేమెంట్స్ నిలిపివేయబడతాయి. దీంతో యూజర్లు పెట్టిన డబ్బు చిక్కుకుపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది.
కొత్త చట్టం అమలులోకి వచ్చిన వెంటనే, గేమర్లలో ఒక భయం మొదలైంది.మన వాలెట్‌లో పెట్టిన డబ్బు తిరిగి వస్తుందా? అన్న ప్రశ్న అందరిలోనూ మొదలైంది. ప్రస్తుతం అన్ని కంపెనీల వద్ద తగినంత నగదు లభ్యం లేకపోవడంతో, ఇది బ్యాంక్ రన్ పరిస్థితిని తలపిస్తోంది. అంటే, ఒకేసారి వేలమంది వినియోగదారులు డబ్బు ఉపసంహరించుకోవాలనుకుంటే, యాప్‌ల వద్ద ఆ మొత్తం అందించడానికి నగదు ఉండకపోవచ్చని వార్తలు వస్తున్నాయి.
రియల్-మనీ గేమింగ్ (RMG) పై భారత ప్రభుత్వం విధించిన కఠినమైన నిషేధం ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో కలకలం రేపింది.ఈ నిషేధం మార్కెట్లో భయాందోళనలకు దారితీసింది.ఈ రంగంలో లిస్టెడ్ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి.పెట్టుబడిదారులు కోట్లాది రూపాయలు కోల్పోయారు. నజారా టెక్నాలజీస్ షేర్లు రెండు రోజుల్లో 14 శాతం పడిపోయాయి, డెల్టా కార్ప్, ఆన్‌మొబైల్ గ్లోబల్ షేర్లు కూడా వరుసగా 2% మరియు 3% తగ్గాయి.
గత ఒక సంవత్సరం పాటు చిన్న పెట్టుబడిదారులు గేమింగ్ స్టాక్‌లలో తమ వాటాను నిరంతరం తగ్గించుకుంటూ వస్తున్నారు. నిషేధానికి ముందు చిన్న పెట్టుబడిదారులు మార్కెట్ నుండి నిష్క్రమించగలడటం ఆనందించదగ్గ పరిణామం. రిటైల్ పెట్టుబడిదారులు (రూ.2 లక్షల వరకు ఈక్విటీని కలిగి ఉన్నవారు) వరుసగా నాలుగు త్రైమాసికాలకు నజారా టెక్నాలజీస్‌కు తమ ఎక్స్‌పోజర్‌ను తగ్గించుకున్నారు.
ఇక జూన్ త్రైమాసికంలోనే 11,272 మంది రిటైల్ పెట్టుబడిదారులు స్టాక్ నుండి నిష్క్రమించారు, దీనితో మార్చిలో 125,692 మంది ఉన్న పెట్టుబడిదారుల సంఖ్య జూన్‌లో 114,420కి తగ్గింది. నిషేధం తర్వాత రెండు ట్రేడింగ్ సెషన్లలో ఈ పెట్టుబడిదారుల సంపద దాదాపు రూ. 200 కోట్లు తగ్గినప్పటికీ, జూన్ త్రైమాసికంలో స్టాక్ నుండి నిష్క్రమించిన పెట్టుబడిదారులు దాదాపు 37 శాతం భారీ లాభంతో నిష్క్రమించారు.
డిస్క్లైమర్: ఈ వ్యాసం కేవలం సమాచారం కోసం మాత్రమే అందించబడింది. ఇది విలువైన లోహాలు, వస్తువులు, స్టాకులు లేదా ఇతర ఆర్థిక పెట్టుబడులను కొనుగోలు చేయమని లేదా అమ్మమని చెప్పడం కాదు. ఈ వ్యాసంలోని సమాచారం ఆధారంగా ఎవరైనా నష్టాలు లేదా సమస్యలను ఎదుర్కొంటే, గ్రేనియమ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు, భాగస్వాములు లేదా రచయితలు ఎలాంటి బాధ్యత వహించరు. కాబట్టి మీరు ఏవైనా లావాదేవీలు జరిపే ముందు నిపుణులను సంప్రదించి నిర్ణయం తీసుకోండి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications