Dr Agarwal's Health Care IPO: కొద్ది రోజులుగా స్థబ్దుగా కొనసాగుతున్న ఐపీవోల మార్కెట్ ఇటీవల బడ్జెట్ ప్రసంగం తర్వాత తిరిగి మెల్లగా రద్దీగా మారుతోంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్ల అస్థిరతల నుంచి పక్కకు తప్పుకుని ఐపీవోల నుంచి లాభాలను అందుకోవాలని చూస్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం ఇది అస్సలు కుదరటం లేదు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది డాక్టర్ అగర్వాల్స్ హెల్త్ కేర్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. మెయిన్ బోర్డ్ కేటగిరీలో వచ్చిన ఐపీవో తొలిరోజే పెట్టుబడిదారులను పూర్తిగా నిరాశకు గురిచేసింది. ఈ క్రమంలో కంపెనీ షేర్లు బీఎస్ఈలో ఇష్యూ ధర కంటే 1.27 శాతం డిస్కౌంట్ రేటు రూ.369.90 వద్ద ట్రేడింగ్ కొనసాగించాయి. ఇదే క్రమంలో కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈలో ఒక్కోటి ఇష్యూ ధర అయిన రూ.402 వద్ద జాబితా అయ్యాయి. గ్రేమార్కెట్లో కనిపించిన లాభాలు లిస్టింగ్ రోజున లేకపోవటంతో ఇన్వెస్టర్లు పూర్తిగా నిరాశకు గురయ్యారు.

కంపెనీ తాజా ఐపీవో ద్వారా దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.3,027.26 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఇందులో రూ.300 కోట్లను తాజా ఈక్విటీ షేర్ల జాబీ ద్వారా సమీకరించగా.. ఆఫర్ ఫర్ సేల్ రూపంలో రూ.2,727.26 కోట్లను సమీకరించటానికి 6.78 కోట్ల షేర్లను కంపెనీ విక్రయించింది. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో సబ్ స్క్రిప్షన్ రిటైల్ పెట్టుబడిదారుల కోసం జనవరి 29 నుంచి జనవరి 31 వరకు అందుబాటులో ఉంచబడింది. ఇదే క్రమంలో కంపెనీ యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.875.51 కోట్లను విజయవంతంగా సమీకరించింది.
మెుత్తంగా ఐపీవో 1.55 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ఇదే క్రమంలో క్వాలిఫైడ్ ఇన్టిట్యూషనల్ బిడ్డర్స్ కోటా 4.64 సార్లు, సంస్థాగతేతర పెట్టుబడిదారులు కేటగిరీ 40 శాతం.. రిటైల్ పెట్టుబడిదారులకు కేటాయించిన కోటా 41 శాతం అండర్‌సబ్‌స్క్రైబ్ చేయబడ్డాయి. ఉద్యోగులకు కేటాయించిన విభాగం 27 శాతం, షేర్ హోల్డర్ల కోటా 52 శాతం బుక్ చేయబడింది. ఇది చూస్తుంటే ఐపీవో పెట్టుబడిదారులను ఆకట్టుకోలేక పోయిందని తెలుస్తోంది.
కంపెనీ వ్యాపారం..
వాస్తవానికి 2010లో స్థాపించబడిన డా.అగర్వాల్స్ హెల్త్ కేర్ ప్రజలకు దేశవ్యాప్తంగా కంటి ఆరోగ్యానికి సంబంధించిన అనేక సేవలను అందిస్తోంది. ఇదే క్రమంలో సర్జికల్ అండ్ నాన్ సర్జికల్, కంటి ఆరోగ్యానికి సంబంధించిన మందులు, లెన్స్ వంటి వాటిని సైతం విక్రయిస్తోంది. తాజా ఐపీవో నుంచి సమీకరించిన మెుత్తాన్ని కంపెనీ రుణాల చెల్లింపులకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించాలని నిర్ణయించింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications