Dorf-Ketal Chemicals IPO: చాలా కంపెనీలు ప్రస్తుతం భారతీయ మార్కెట్లలో తమ ఐపీవోలను ఫ్లోట్ చేసేందుకు తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో పెద్ద కంపెనీలు తమ మెయిన్ బోర్డ్ ఆఫర్లను ప్రారంభిస్తూ పెట్టుబడిదారుల నుంచి మంచి స్పందనను పొందుతున్నాయి. దీంతో ప్రతి నెల డజనుకు పైగా ఐపీవోల లిస్టింగ్ మార్కెట్లలో కొనసాగుతూనే ఉంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది డార్ఫ్-కేటల్ కెమికల్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. వాస్తవానికి ఇదొక స్పెషాలిటీ కెమికల్స్ వ్యాపారంలో ఉన్న సంస్థ. 1992లో స్థాపించబడిన కంపెనీ ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి తన మూలధన అవసరాల కోసం రూ.5,000 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా ఐపీవోలో రూ.1,500 కోట్లకు తాజా ఈక్విటీ ఇష్యూ ఉండగా.. మిగిలిన రూ.3,500 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో ప్రమోటర్ల వాటాల విక్రయం ఉంటుందని కంపెనీ వెల్లడించింది.

తాజాగా కంపెనీ తన ఐపీవోను దేశీయ స్టాక్ మార్కెట్లలో ఫ్లోట్ చేసేందుకు సెబీ వద్ద పత్రాలను దాఖలు చేసింది. ఐపీవోలో మెజారిటీ సొమ్ము ప్రమోటర్ మీనన్ ఫయామిలీకి వెళ్లనుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇష్యూ ద్వారా కంపెనీకి వచ్చే ఆదాయంలో రూ.82.90 కోట్లను రుణాల చెల్లింపులకు వినియోగించనుంది. అలాగే రూ.33.30 కోట్లను అనుబంధ సంస్థ డార్ఫ్ కేటల్ కెమికల్స్ ఎఫ్‌జెడ్‌ఈలో పెట్టుబడుపెట్టాలని నిర్ణయించింది. మిగిలిన సొమ్ము సాధారణ కార్పొరేట్ ప్రయోజనాలకు ఉపయోగించాలని నిర్ణయించింది.
డార్ఫ్-కేటల్ కెమికల్స్ కంపెనీ ఆయిల్ అండ్ గ్యాస్, రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ పరిశ్రమలతో సహా హైడ్రోకార్బన్‌లు, పారిశ్రామిక సంస్థలకు అవసరమైన ప్రత్యేక కెమికల్స్ తయారీ, సరఫరాలో ఉంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, పెట్రోనాస్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, పీపీజీ ఇండస్ట్రీస్, క్లారియంట్, లిబర్టీ ఎనర్జీ, ఇటాలియన్ పెట్రోలి, వేదాంత వంటి ప్రముఖ కస్టమర్ బేస్ కలిగి ఉంది. తన కెమికల్ ఉత్పత్తులను ఈ కంపెనీలకు సరఫరా చేస్తోంది.
అక్టోబర్ 2024 నాటికి కంపెనీకి ఇండియాలోఎనిమిది, బ్రెజిల్‌లో రెండు, యుఎస్‌లో మూడు, కెనడాలో మూడు ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. అంటే కంపెనీకి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 16 తయారీ కేంద్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. కంపెనీ గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు కలిగిన కొన్ని భారతదేశ-ఆధారిత రసాయన కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్‌ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

డబ్బు కావలిసినంత ఉన్నా పర్సనల్ లోన్ల వైపు పరిగెత్తుతున్న ధనవంతులు.. కారణం ఏంటంటే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications