Gland Pharma: మార్కెట్ నష్టాల్లో ఉన్నా.. 7 శాతం పెరిగిన గ్లాండ్ ఫార్మా షేర్లు..!
సోమవారం స్టాక్ మార్కెట్‌లో కనిపిస్తున్న ప్రతికూల ధోరణికి భిన్నంగా గ్లాండ్ ఫార్మా షేర్ల ధర 6.73% కంటే ఎక్కువ పెరిగి 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. ఈ ఫార్మా షేరు నేడు నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ లో రూ.3,147 వద్ద లాభాలతో ప్రారంభమైంది. ట్రేడింగ్ సమయంలో ఇది గరిష్టంగా రూ.3,352 స్థాయికి చేరుకుంది. మరోవైపు ఐటీ రంగంలోని దిగ్గజ షేర్లలో అమ్మకాల ఒత్తిడి, ఇటీవల మార్కెట్‌లో వచ్చిన భారీ పెరుగుదల తర్వాత లాభాల స్వీకరణ కారణంగా, భారతీయ ప్రధాన సూచీలు సెన్సెక్స్ మరియు నిఫ్టీ సోమవారం నాడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఔషధ తయారీ సంస్థ గ్లాండ్ ఫార్మా, నవంబర్ 6, శుక్రవారం నాడు తన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
2027 ఆర్థిక సంవత్సరం (FY27) రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం గత ఏడాదితో పోలిస్తే 58.2 శాతం వృద్ధితో రూ.291 కోట్లకు చేరుకుంది. కంపెనీ ఆదాయం గత ఏడాదితో పోలిస్తే 23.3% పెరిగి రూ.1,834 కోట్లకు చేరుకుంది. ఎబిట్డా 54.1% వృద్ధితో రూ.484 కోట్లకు పెరిగింది. దీని ఫలితంగా ఎబిట్డా మార్జిన్ 21.1% నుంచి 26.4%కి చేరుకుంది. ఎబిట్డా మార్జిన్ 27%గా నమోదైంది. ఈ త్రైమాసికంలో కంపెనీ పన్ను తర్వాత లాభం (PAT) మార్జిన్ కూడా దాదాపు 350 బేసిస్ పాయింట్లు పెరిగింది. గ్లాండ్ ఫార్మా పరిశోధన, అభివృద్ధి (R&D) వ్యయం ఈ త్రైమాసికంలో రబ.107.7 కోట్లుగా ఉంది. ఇది మొత్తం ఆదాయంలో 6% వాటాను కలిగి ఉంది.

గత ఏడాది ఇదే కాలంలో ఈ వ్యయం రూ.81.7 కోట్లుగా ఉంది. ఈ పెట్టుబడులు ప్రధానంగా సంక్లిష్టమైన ఉత్పత్తులను అభివృద్ధి చేయడం, విస్తరించడంపై దృష్టి సారించింది. గ్లాండ్ ఫార్మా షేర్లు పలు కాల వ్యవధులలో బలమైన రాబడులను అందించాయి. గత వారంలో 8.43 శాతం రాబడి అందించగా.. ఒక నెలలో 8.60 శాతం రాబడి అందించింది. ఈ స్టాక్ దీర్ఘకాలంలో గణనీయంగా మెరుగైన పనితీరును కనబరిచింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి 93.87 శాతం, గత ఒక సంవత్సరంలో 78.48 శాతం పెరిగింది. ఈ స్టాక్ ఐదేళ్ల పనితీరు 8.26% క్షీణతతో ప్రతికూలంగానే ఉంది. ఇటీవలి ర్యాలీ మునుపటి నష్టాల నుంచి కోలుకోవడానికి సహాయపడింది.
ఈ స్టాక్ గత మూడేళ్ల రాబడి 106.18%గా ఉంది. బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్, ఈ ఫార్మా స్టాక్‌పై తన 'బై' రేటింగ్‌ను ఇచ్చింది. ఈ స్టాక్ టార్గెట్ ప్రైస్ రూ.3,690 గా నిర్ణయించింది. ఇందులో 16 శాతం వరకు వృద్ధి చెందే అవకాశం ఉందని పేర్కొంది. అయితే ఈ మధ్య కాలంలో ఫార్మా కంపెనీలు ఫలితాలు బాగా వస్తుంది. దీంతో ఈ సెక్టర్ లో సానుకూల వాతావరణం కనిపిస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications