Deepak Builders IPO: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లోకి వరుసగా రెండు ఐపీవోలు జాబితా అయ్యాయి. ఒక ఐపీవో ఇన్వెస్టర్లకు భారీ లాభాలను అందించగా, మరో ఐపీవో మాత్రం పూర్తిగా నిరాశకు గురిచేసింది. దీంతో ఇష్యూ సమయంలో బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు నష్టాలను మూటగట్టుకున్నారు. ఇది గ్రేమార్కెట్లో కొనసాగిన రూ.32 ప్రీమియం ధరకు పూర్తి భిన్నంగా ఉంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది దీపక్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ లిమిటెడ్ కంపెనీ ఐపీవో గురించే. మెయిన్ కేటగిరీలో వచ్చిన కంపెనీ షేర్లు నేడు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఏకకాలంలో జాబితా అయ్యాయి. ఈ క్రమంలో ఎన్ఎస్ఈలో స్టాక్ ఇష్యూ ధర కంటే 1.48 శాతం డిస్కౌంటెడ్ రేటు రూ.200 వద్ద ఒక్కో షేరు లిస్ట్ కాగా.. బీఎస్ఈలో 2 శాతం డిస్కౌంటెడ్ ధర రూ.198.5 వద్ద అడుగుపెట్టాయి. బ్రోకరేజీల అభిప్రాయాన్ని పరిశీలిస్తే.. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఆశించిన లాభాలను కొద్దిగా తగ్గించే అవకాశం ఉందని, కాబట్టి పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్‌కి చెందిన శివాని న్యాతి ఐపీవో లిస్టింగ్ పై కామెంట్ చేశారు.

వాస్తవానికి కంపెనీ ఐపీవో ప్రారంభమైన గంటలోనే రిటైల్ కేటగిరీ 100 శాతం సబ్‌స్క్రిప్షన్ పొంది రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. పెట్టుబడిదారుల నుంచి మార్కెట్లో విశేష స్పందన వచ్చినప్పటికీ లిస్టింగ్ సమయంలో ఆ ప్రభావం కనిపించలేదు. అలాగే లిస్టింగ్ తర్వాత ఇంట్రాడేలో కంపెనీ షేర్లు దాదాపు 16.4 శాతం మేర పతనాన్ని చూశాయి. దీంతో ఎన్ఎస్ఈలో షేర్ల ధర రూ.167 స్థాయికి పడిపోయాయి. కంపెనీ తాజా ఐపీవో నుంచి రైజ్ చేసిన మెుత్తాన్ని రుణ చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలకు, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించాలని నిర్ణయించింది.
కంపెనీ ఐపీవో వివరాలను పరిశీలిస్తే.. కంపెనీ తాజా ఐపీవో నుంచి మెుత్తంగా రూ.260.04 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది. ఇందులో తాజా ఈక్విటీ ఇష్యూ కింద రూ.217.21 కోట్లను సమీకరించటానికి దాదాపు 1.07 కోట్ల ఫ్రెష్ షేర్లను విక్రయానికి ఉంచింది. అలాగే మిగిలిన మెుత్తం ఆఫర్ ఫర్ సేల్ కింద ఉంటుందని వెల్లడైంది. మెయిన్ కేటగిరీలో వస్తున్న కంపెనీ ఐపీవో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో అక్టోబర్ 28న లిస్టింగ్ కానున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో కంపెనీ తన ప్రైస్ బ్యాండ్ ధరను ఒక్కో షేరుకు రూ.192-203గా నిర్ణయించింది. ఈ క్రమంలో కంపెనీ లాట్ పరిమాణాన్ని 73 షేర్లుగా ఉంటంతో ఒక లాట్ కొనుగోలుకు రూ.14,819గా ఉంది.
2017లో స్థాపించబడిన కంపెనీ ఉత్తర భారతదేశంలో ఇంజనీరింగ్ అండ్ నిర్మాణ సేవలను విస్తరిస్తోంది. కంపెనీ ఆదాయాలు సైతం మెరుగ్గానే ఉన్నాయి. కంపెనీ మెజారిగా ప్రభుత్వ ప్రాజెక్టులను నిర్వహిస్తోందని వెల్లడైంది. దీనికి తోడు పారిశ్రామిక భవనాలు, ఆసుపత్రులు, స్టేడియంలు, నివాస సముదాయాలు, ఇతర నిర్మాణ కార్యకలాపాల్లో ప్రత్యేకత కలిగి ఉంది. ఆర్కిటెక్చరల్, స్ట్రక్చరల్, సివిల్, MEP, ఫైర్‌ఫైటింగ్ సిస్టమ్స్, పబ్లిక్ హెల్త్ సర్వీసెస్, ఐటీ సిస్టమ్స్, ఆపరేషన్ థియేటర్‌లు, మెడికల్ గ్యాస్ పైప్‌లైన్‌లు, ల్యాండ్‌స్కేపింగ్ వంటి టర్న్‌కీ ప్రాజెక్ట్‌లను కంపెనీ పూర్తి చేసింది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications