IPO News: గ్రేమార్కెట్లో దుమ్మురేపుతున్న ఐపీవో.. ఎగబడికొన్న ఐపీవోపై మీరూ బెట్ వేశారా..?
Danish Power IPO: దేశీయంగా కొనసాగుతున్న ఐపీవోల మహా లిస్టింగ్ సంగ్రామంలో ఇన్వెస్టర్లు భారీ లాభాల కోసం వేట కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో దలాల్ స్ట్రీట్ సైతం అనేక ఐపీవోలను చూస్తోంది. దీంతో మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నప్పటికీ ఐపీవోలు మాత్రం తమ లాభాల పవర్ కొనసాగిస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రస్తుతం మనం మాట్లాడకోబోతున్న డానిష్ పవర్ కంపెనీ ఐపీవో ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందనను చూస్తోంది. ఐపీవో తెరుచుకున్న మెుదటి మూడు రోజుల సమయంలో భారీగా దరఖాస్తులు రావటంతో 126.65 రెట్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. ప్రస్తుతం బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు కంపెనీ లిస్టింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. లిస్టింగ్ ముందు గ్రే మార్కెట్లో భారీ ప్రీమియం రేటు పలుకుతోంది. డానిష్ పవర్ ఐపీవో అక్టోబర్ 22 నుంచి 25 వరకు రిటైల్ పెట్టుబడిదారులు బెట్టింగ్ వేసేందుకు అందుబాటులో ఉంది. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ధరను రూ.360-380గా నిర్ణయించింది. లాట్ పరిమాణాన్ని 300 షేర్లుగా నిర్ణయించటంతో కొనుగోలుదారులు రూ.1.14 లక్షలు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చింది.

ఎస్ఎమ్ఈ కేటగిరీలో వస్తున్న ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.197.90 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐపీవో కోసం కంపెనీ 52.08 లక్షల తాజా షేర్లను జారీ చేసింది. ఇప్పటికే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ రూ.55.63 కోట్లు సమీకరించింది. కంపెనీ ప్రమోటర్లు దినేష్ తల్వార్, శివమ్ తల్వార్, పునీత్ సంధు తల్వార్ మెుత్తం వాటా తాజా ఐపీవో తర్వాత 73.55 శాతానికి తగ్గనుంది.
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం రిటైల్ ఇన్వెస్టర్ల కేటగిరీ 79.88 రెట్లు, అర్హత కలిగిన సంస్థాగత ఇన్వెస్టర్ల విభాగం 104.72 రెట్లు , నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీలో 275.92 రెట్ల భారీ సబ్‌స్క్రిప్షన్ చూశాయి. ప్రస్తుతం గ్రేమార్కెట్లో కంపెనీ షేర్లుకు ఒక్కోదానిపై రూ.260 ప్రీమియంతో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. లిస్టింగ్ తేదీ వరకు ఇదే రేటు కొనసాగితే షేర్లు మార్కెట్లో రూ.640 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే పెట్టుబడిదారులు ఒక్కో షేరుపై దాదాపు 68 శాతం రాబడిని మెుదటిరోజే పొందే అవకాశం ఉంటుంది. కంపెనీ షేర్లు ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో వచ్చేవారం అక్టోబర్ 29న జాబితా అవ్వొచ్చని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications