Avenue Supermarts Shares: సోమవారం మార్కెట్లు తెరుచుకోగానే రాధాకిషన్ దమానీ యాజమాన్యంలో అవెన్యూ సూపర్ మార్ట్స్ స్టాక్ భారీ నష్టాన్ని చవిచూసింది. వాస్తవానికి ఈ కంపెనీ డీమార్ట్ పేరుతో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రిటైల్ స్టోర్ల చైన్ నిర్వహిస్తోంది. ఇంట్రాడేలో నేడు డీమార్ట్ స్టాక్ 9 శాతం మేర క్షీణతను చూడటంతో ప్రమోటర్లు నిమిషాల్లోనే ఏకంగా రూ.20,800 కోట్ల మేర సంపదను కోల్పోయారు.
ప్రస్తుతం దమానీ, ఇతర ఇన్వెస్టర్లకు కంపెనీలో 74.65 వాటాలు ఉన్నాయి. కంపెనీ గడచిన వారంలో తన రెండవ త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఫలితాలు మార్కెట్లోని ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేయటంతో నేడు బీఎస్ఈలో స్టాక్ ధర 2019 తర్వాత ఒక్కరోజులో అత్యధిక పతనాన్ని నమోదు చేయటంతో రూ.4143.60 స్థాయికి చేరుకున్నాయి. దేశంలో ఆన్ లైన్ కిరాణా ఆర్డర్లతో పాటు క్విక్ కామర్స్ వ్యాపారం పుంజుకుంటున్న వేళ డీమార్ట్ స్టోర్లు గట్టి పోటీని చూస్తున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రానున్న ఆర్థిక సంవత్సరాల్లో డీమార్ట్ ఆదాయాల అంచనాలను వారు తగ్గవచ్చని అంచనాలు బయటకు వచ్చిన వేళ నేడు దమానీ కంపెనీ షేర్లు పెద్ద పతనాన్ని చూస్తున్నాయి.

బ్రోకరేజీల మాట ఇదే..
- ముందుగా విదేశీ బ్రోకింగ్ సంస్థ జేపీ మోర్గాన్ అవెన్యూ సూపర్ మార్ట్స్ స్టాక్ రేటింగ్ మార్చింది. ఓవర్ వెయిట్ నుంచి తటస్థానికి రేటింగ్ తగ్గించిన వేళ తాజాగా టార్గెట్ ధరను రూ.5400 నుంచి రూ.4700కి తగ్గింది. ఆశించిన స్థాయిలో ఇటీవల ప్రకటించిన రెండవ త్రైమాసిక ఫలితాలు లేవని బ్రోకరేజ్ వెల్లడించింది. కంపెనీ వ్యాపారం ప్రస్తుతం మెట్రో దుకాణాల నుంచి పోటీని ఎదుర్కొంటున్నందున 2025-26 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.
- ఇక మరో బ్రోకరేజ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ సైతం డీమార్ట్ స్టాక్ రేటింగ్ తగ్గించింది. ఈ క్రమంలో ఒక్కో షేరు టార్గెట్ ధరను రూ.3702కి తగ్గిస్తున్నట్లు పేర్కొంది.
- అమెరికాకు చెందిన మరో సంస్థ గోల్డ్‌మాన్‌సాక్ డీమార్ట్ షేర్ల టార్గెట్ ధరను రూ.4000గా ప్రకటిస్తూ షేర్లకు SELL రేటింగ్ ఇచ్చింది.
- పండుగ సీజన్‌లో విక్రయాల పోకడలను నిశితంగా పరిశీలిస్తామని దేశీయ బ్రోకరేజ్ ప్రభుదాస్ లిల్లాధర్ వెల్లడించింది. ఇదే క్రమంలో గతంలో ఇచ్చిన టార్గెట్ ధర రూ.5,168ను ప్రస్తుతం రూ.4,748కి తగ్గిస్తూ 'హోల్డ్' రేటింగ్ షేర్లకు ఇచ్చింది.
- ఇదే క్రమంలో మరో బ్రోకరేజ్ బెర్న్‌స్టెయిన్ మాత్రం డీమార్ట్ షేర్ల పనితీరుపై బుల్లిష్ వ్యూహాన్ని ప్రకటిస్తూ ఒక్కో షేరుకు టార్గెట్ ధరను రూ.5800గా ఉంచుతున్నట్లు పేర్కొంది.
- చివరిగా డీమార్ట్ షేర్లకు బ్రోకరేజ్ హౌస్ CLSA టార్గెట్ ధర రూ.5360గా ప్రకచిస్తూ 'అవుట్ పెర్ఫార్మ్' రేటింగ్ అందిస్తూ కంపెనీపై తన సానుకూలతను ప్రకటించింది. మెుత్తానికి కంపెనీ షేర్లపై బ్రోకరేజ్ బెర్న్‌స్టెయిన్, సీఎల్ఎస్ఏ మినహా అన్ని బ్రోకరేజీలు నెగటివ్ వ్యూ కలిగి ఉన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications