Multibagger Stock: బుధవారం 8 శాతానికి పైగా పెరిగిన క్యూపిడ్ స్టాక్.. రూ.లక్షను రూ.1.2 కోట్లు చేసింది ఇదే..!
బుధవారం నాటి ట్రేడింగ్‌లో క్యూపిడ్ లిమిటెడ్ షేర్లు 8.05 శాతం పెరిగి రూ. 310.65 వద్ద ఆల్-టైమ్ గరిష్ట స్థాయిని తాకాయి. చివరగా ఈ స్టాక్ 7.17 శాతం లాభంతో రూ. 308.65 వద్ద ట్రేడ్ అవుతూ కనిపించింది. ఈ స్టాక్ గత ఆరు నెలల్లో 255.42 శాతం ర్యాలీ అయింది. ప్రస్తుతం క్యూపిడ్ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ రెండింటిలోనూ దీర్ఘకాలిక 'అదనపు నిఘా చర్యల' (ASM) విధానం పరిధిలో ఉన్నాయి. షేర్ ధరలలో ఉండే అధిక అస్థిరత గురించి పెట్టుబడిదారులను అప్రమత్తం చేయడానికి ఎక్స్ఛేంజీలు స్టాక్‌లను స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక ASM విధానాల పరిధిలో ఉంచుతాయి. సోమవారం మార్కెట్ సమయం ముగిసిన తర్వాత కంపెనీ సమర్పించిన ఎక్స్ఛేంజ్ నివేదిక ప్రకారం, క్యూపిడ్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆదిత్య కుమార్ హల్వాసియా ఇటీవల ఓపెన్ మార్కెట్ లావాదేవీ ద్వారా 5,90,304 షేర్లను కొనుగోలు చేసి కంపెనీలో తన వాటాను మరింత పెంచుకున్నారు.
ఈ కొనుగోలు క్యూపిడ్ మొత్తం ఈక్విటీలో 0.04 శాతానికి సమానం. ఈ లావాదేవీ తర్వాత కంపెనీలో హల్వాసియా వ్యక్తిగత వాటా 34.71 శాతానికి పెరగగా, ప్రమోటర్, ప్రమోటర్ గ్రూప్ మొత్తం వాటా 47.66 శాతానికి చేరింది. FY27 జూన్ త్రైమాసికానికి సంబంధించి క్యూపిడ్ బలమైన ఆర్థిక పనితీరును నమోదు చేసింది. దీని నికర లాభం ఏడాది ప్రాతిపదికన (YoY) 194 శాతం పెరిగి రూ. 44.15 కోట్లకు చేరింది. FY26 మొదటి త్రైమాసికంలో (Q1) ఇది రూ. 15.01 కోట్లుగా ఉండేది. మొత్తం ఆదాయం ఏడాది ప్రాతిపదికన 142 శాతం పెరిగి, FY27 మొదటి త్రైమాసికంలో రూ. 156.98 కోట్లకు చేరింది. ఎబిట్డా ఏడాది ప్రాతిపదికన 265 శాతం పెరిగి రూ. 16.47 కోట్ల నుండి రూ. 60.06 కోట్లకు చేరింది.

కంపెనీ ఎబిట్టా మార్జిన్ FY26 మొదటి త్రైమాసికంలోని 28 శాతం నుంచి FY27 మొదటి త్రైమాసికంలో 39 శాతానికి మెరుగుపడింది. క్యూపిడ్ సంస్థ పురుషుల, స్త్రీల కండోమ్‌లు, నీటి ఆధారిత పర్సనల్ లూబ్రికెంట్లు, ఇన్-విట్రో డయాగ్నస్టిక్ (IVD) కిట్‌ల తయారీ చేస్తోంది. డియోడరెంట్లు, పెర్ఫ్యూమ్‌లు, బాదం హెయిర్ ఆయిల్, బాడీ ఆయిల్స్, పెట్రోలియం జెల్లీ, ఇతర వేగంగా అమ్ముడయ్యే వినియోగదారుల వస్తువుల (FMCG) తయారీలో క్యూపిడ్ భారతదేశంలోనే అగ్రగామిగా ఉంది. ఈ స్టాక్ గత కొద్ది సంవత్సరాలుగా భారీ రాబడి ఇస్తూ మల్టీబ్యాగర్ గా నిలిచింది.
ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే క్యూపిడ్ షేర్ ధర 166.43 శాతం పెరిగింది. ఇది 2026లో స్టాక్ బలమైన జోరును సూచిస్తోంది. ఏడాది కాలంలో దీని పనితీరు మరింత ఆకట్టుకునేలా ఉంది. ఈ స్టాక్ 605.24 శాతం వృద్ధిని నమోదు చేసింది. అంతేకాకుండా ఈ స్టాక్ పెట్టుబడిదారుల డబ్బును భారీగా పెంచింది. మూడేళ్లలో 6,623.56 శాతం, ఐదేళ్లలో అసాధారణమైన 11,956.03 శాతం వృద్ధితో పెట్టుబడి విలువను నాలుగింతలకు పైగా పెంచింది. నాలుగేళ్ల క్రితం ఈ స్టాక్‌లో పెట్టిన రూ.1 లక్షల పెట్టుబడి పెడితే దాని విలువ ఇప్పుడు రూ.1.2 కోట్లకు చేరి ఉండేది. అలాగే మూడేళ్ల క్రితం పెట్టిన అంతే మొత్తంలోని పెట్టుబడి విలువ ఇప్పుడు సుమారు రూ.67 లక్షలుగా ఉండేది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
