కరోనా రెమెడీస్ ఐపీఓ త్వరలో మార్కెట్లోకి అడుగుపెట్టనుండడంతో పెట్టుబడిదారుల దృష్టి ఈ కంపెనీపై పడింది. ఈ సంవత్సరం షేర్ మార్కెట్‌లో IPOల జోరు కొనసాగుతుండగా, పలు కంపెనీలు తమ ఇష్యూలను ప్రారంభించి మంచి ఫలితాలను సాధించాయి. ఈ క్రమంలో ఫార్మాస్యూటికల్ రంగానికి చెందిన అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న కరోనా రెమెడీస్ కూడా తన సత్తాను పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది. బుక్-బిల్డ్ రూపంలో రాబోయే ఈ IPO డిసెంబర్ 8న ప్రారంభమై, డిసెంబర్ 10 వరకు సబ్‌స్క్రిప్షన్‌కి అందుబాటులో ఉంటుంది. ముగిసిన తర్వాత డిసెంబర్ 11న షేర్ కేటాయింపు పూర్తవుతుంది. డిసెంబర్ 15న బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లలో లిస్టింగ్ జరుగుతుంది.
ఈ IPO మొత్త పరిమాణం రూ. 655.37 కోట్లు. ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలో ఉండగా, కంపెనీ మొత్తం 6,171,101 షేర్లను విక్రయానికి పెట్టనుంది. ధరల శ్రేణి రూ. 1,008 నుంచి రూ. 1,062 వరకు నిర్ణయించారు. IPOలో పాల్గొనాలనుకునే పెట్టుబడిదారులు కనీసం ఒక లాట్ అంటే 14 షేర్లు కొనుగోలు చేయాలి. ఎగువ ధరల శ్రేణి ప్రకారం కనీస పెట్టుబడి రూ. 14,868 అవుతుంది. పెట్టుబడిదారులు గరిష్టంగా 13 లాట్‌లు అంటే 183 షేర్ల వరకు బిడ్ చేయవచ్చు, దీని విలువ రూ. 193,284. సబ్‌స్క్రిప్షన్‌లో ప్రతిస్పందన ఎలా ఉంటుందనేది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడుతుంది.

కరోనా రెమెడీస్ వ్యాపారాన్ని పరిశీలిస్తే.. ఇది భారతదేశంలో వేగంగా ఎదుగుతున్న ఫార్మా కంపెనీలలో ఒకటిగా ఉంది. మహిళల ఆరోగ్యం, హృద్రోగాలు, మధుమేహం, చర్మవ్యాధులు వంటి విభాగాలకు సంబంధించిన ఔషధాలను, ఆరోగ్య ఉత్పత్తులను ఈ సంస్థ తయారు చేస్తోంది. ప్రస్తుతం సంస్థకు 67 బ్రాండ్‌లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా పటిష్టమైన మార్కెట్ నెట్‌వర్క్ ఏర్పరుచుకుంది. CRISIL నివేదిక ప్రకారం 2024 డిసెంబర్ 31 నాటికి దేశంలోని టాప్ 30 ఫార్మా కంపెనీల్లో రెండవ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా కరోనా గుర్తింపు పొందింది. ఇది కంపెనీ భవిష్యత్‌కు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతోంది.
ఈ Corona Remedies IPO కి ప్రైవేట్ ఈక్విటీ సంస్థ ChrysCapital మద్దతు ఉండటం ఒక ప్రధాన బలంగా చెప్పవచ్చు. పెట్టుబడిదారులు దీన్ని లాభదాయక అవకాశంగా చూస్తున్నారు. ఎందుకంటే కంపెనీ రెవెన్యూ, మార్కెట్ షేర్ రెండింటిలోనూ బలమైన వృద్ధిని నమోదు చేస్తోంది. భారతీయ ఫార్మా రంగం మొత్తం పెరుగుదల దశలో ఉండగా.. నమ్మకమైన కంపెనీలకు డిమాండ్ మరింత పెరుగుతోంది. అంతేకాకుండా, IPO ద్వారా మార్కెట్‌లో బలమైన లిస్టింగ్ సాధిస్తే, షేర్ ధరలు ప్రారంభ దశలోనే ఆకర్షణీయ రాబడి ఇవ్వగలవన్న భావన ఉంది.
అయితే, ఏ పెట్టుబడిలోనైనా రిస్క్ ఫ్యాక్టర్లు ఉంటాయి. కాబట్టి పెట్టుబడిదారులు మార్కెట్ ఒడిదొడుకులు, నియంత్రణ మార్పులు, ఉత్పత్తి పోటీ వంటి అంశాలు దృష్టిలో పెట్టుకోవాలి. పెట్టుబడిదారులు కంపెనీ ఫైనాన్షియల్ రిపోర్టులు, వృద్ధి అంచనాలను పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఏదేమైనా కరోనా రెమెడీస్ IPO పెట్టుబడిదారులకు ఒక పెద్ద అవకాశంలా కనిపిస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీ, గట్టి బ్రాండ్ పోర్ట్‌ఫోలియో, బలమైన మార్కెట్ ఉనికి, ప్రముఖ ఇన్వెస్టర్ మద్దతు వంటి అంశాలు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. డిసెంబర్ 8న ప్రారంభమయ్యే ఈ IPO మార్కెట్‌లో ఏ స్థాయిలో స్పందన అందుకుంటుందో వేచి చూడాలి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications