ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఐపీఓగా వచ్చే అవకాశం ఉంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం బ్యాంకులను నియమించుకుంది. ఐపీఓ ద్వారా 800 మిలియన్ డాలర్ల వరకు నిధులు సమీకరించే అవకాశం ఉందని సమాచారం. ఈ బొగ్గు ఉత్పత్తి సంస్థ షేర్ల విక్రయంపై సలహా ఇవ్వడానికి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఎస్‌బిఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐడిబిఐ క్యాపిటల్ మార్కెట్స్ & సెక్యూరిటీస్ లిమిటెడ్‌లను నియమించినట్లు తెలుస్తోంది.
సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ డిసెంబరు నెలలోనే డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. ప్రతిపాదిత ఆఫరింగ్‌లో మాతృ సంస్థ కోల్ ఇండియా షేర్లను విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2030 కల్లా మొత్తం తన 8 అనుబంధ కంపెనీలను స్టాక్ మార్కెట్లో నమోదుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వ్యూహంలో భాగంగా ఇప్పటికే ఈ ఏడాదిలోనే రెండు సబ్సిడరీలను ఐపీఓ ద్వారా మార్కెట్లోకి తీసుకొచ్చింది. భారత్ కోకింక్ కోల్ లిమిటెడ్ (BCCL) ఐపీఓ జనవరిలో వచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 9-13 మధ్య సబ్‌స్క్రిప్షన్ పూర్తి చేసుకొని జనవరి 19న ఎక్స్చేంజీల్లో లిస్టయింది.
మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL) కూడా ఐపీఓ కోసం డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను (DRHP) సెబీకి దాఖలు చేసింది. దీని కింద సుమారు 66.18 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు దాఖలు చేసిన పత్రాల్లో తెలిపింది. తాజాగా కోల్ ఇండియా తన మరో సబ్సిడరీ సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఐపీఓ తీసుకొస్తోంది. సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్, కోల్ ఇండియా అతిపెద్ద అనుబంధ సంస్థలలో ఒకటిదా ఉంది. ఈ కంపెనీ ఇది మధ్య భారతదేశం అంతటా 60 బొగ్గు గనులను నిర్వహిస్తోంది, వాటిలో 35 ఛత్తీస్‌గఢ్ లో, మిగిలిన 25 మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. కాగా ప్రతిపాదిత ఐపీఓల్లో భాగంగా కోల్ ఇండియా కూడా తమ అనుబంధ సంస్థల్లోని వాటాను కొంత మేర విక్రయించే అవకాశం వార్తలు వస్తున్నాయి.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
Share This Article
English summary
SECL IPO: కోల్ ఇండియా నుంచి మరో ఐపీఓ.. త్వరలో DRHP ఫైల్ చేసే అవకాశం..! | Coal India is likely to launch an IPO for its subsidiary, South Eastern Coalfields Limited
ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఐపీఓగా వచ్చే అవకాశం ఉంది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) కోసం బ్యాంకులను నియమించుకుంది. ఐపీఓ ద్వారా 800 మిలియన్ డాలర్ల వరకు నిధులు సమీకరించే అవకాశం ఉందని సమాచారం. ఈ బొగ్గు ఉత్పత్తి సంస్థ షేర్ల విక్రయంపై సలహా ఇవ్వడానికి ఐసిఐసిఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఎస్‌బిఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఐడిబిఐ క్యాపిటల్ మార్కెట్స్ & సెక్యూరిటీస్ లిమిటెడ్‌లను నియమించినట్లు తెలుస్తోంది.సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ డిసెంబరు నెలలోనే డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని సమాచారం. ప్రతిపాదిత ఆఫరింగ్‌లో మాతృ సంస్థ కోల్ ఇండియా షేర్లను విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. 2030 కల్లా మొత్తం తన 8 అనుబంధ కంపెనీలను స్టాక్ మార్కెట్లో నమోదుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వ్యూహంలో భాగంగా ఇప్పటికే ఈ ఏడాదిలోనే రెండు సబ్సిడరీలను ఐపీఓ ద్వారా మార్కెట్లోకి తీసుకొచ్చింది. భారత్ కోకింక్ కోల్ లిమిటెడ్ (BCCL) ఐపీఓ జనవరిలో వచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 9-13 మధ్య సబ్‌స్క్రిప్షన్ పూర్తి చేసుకొని జనవరి 19న ఎక్స్చేంజీల్లో లిస్టయింది. మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL) కూడా ఐపీఓ కోసం డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను (DRHP) సెబీకి దాఖలు చేసింది. దీని కింద సుమారు 66.18 కోట్ల షేర్లను విక్రయించనున్నట్లు దాఖలు చేసిన పత్రాల్లో తెలిపింది. తాజాగా కోల్ ఇండియా తన మరో సబ్సిడరీ సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ ఐపీఓ తీసుకొస్తోంది. సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్, కోల్ ఇండియా అతిపెద్ద అనుబంధ సంస్థలలో ఒకటిదా ఉంది. ఈ కంపెనీ ఇది మధ్య భారతదేశం అంతటా 60 బొగ్గు గనులను నిర్వహిస్తోంది, వాటిలో 35 ఛత్తీస్‌గఢ్ లో, మిగిలిన 25 మధ్యప్రదేశ్‌లో ఉన్నాయి. కాగా ప్రతిపాదిత ఐపీఓల్లో భాగంగా కోల్ ఇండియా కూడా తమ అనుబంధ సంస్థల్లోని వాటాను కొంత మేర విక్రయించే అవకాశం వార్తలు వస్తున్నాయి. డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
Story first published: Saturday, September 26, 2026, 17:25 [IST]
Other articles published on
Sep 26, 2026