భారత పరిశ్రమల దిగ్గజం అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కి పెద్ద ఊరట లభించింది. దేశ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆయనతో పాటుగా అదానీ గ్రూప్‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది. గత ఏడాది అమెరికా షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారం రేపిన సంగతి విదితమే. అదానీ గ్రూప్ షేర్ల ధరలను కృత్రిమంగా పెంచారని..ఇన్‌సైడర్ ట్రేడింగ్, మార్కెట్ అవకతవకలు, పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘన జరిగాయని ఆరోపణలు గుప్పించింది. ఈ ఆరోపణల వలన అప్పట్లో అదానీ షేర్లు కుప్పకూలాయి. కంపెనీ లక్షల కోట్ల రూపాయలు విలువను కోల్పోయింది.
అయితే విస్తృత స్థాయి దర్యాప్తు అనంతరం సెబీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఈ ఆరోపణలకు ఎటువంటి ఆధారాలు లభించలేదు. అదానీ గ్రూప్ తమ కంపెనీల నిధులను ఇతర సంస్థల ద్వారా మళ్లించి పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలకూ ఎలాంటి సాక్ష్యం దొరకలేదని స్పష్టం చేసింది. అలాగే అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, గౌతమ్ అదానీ, ఆయన సోదరుడు రాజేశ్ అదానీ, గ్రూప్ సీఎఫ్‌ఓ జుగీషిందర్ సింగ్ తదితరులకు ఎటువంటి తప్పూ చేయలేదని తేల్చింది. దీంతో మార్కెట్లో అదానీ షేర్లు ఒక్కసారిగా ఎగసి పడ్డాయి.

ఈ పరిణామంపై గౌతమ్ అదానీ మాట్లాడుతూ .. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదికలో ఉన్న ఆరోపణలు నిజం కావు, అవి ఉద్దేశపూర్వకంగా పెట్టుబడిదారులలో భయం, అనుమానం కలిగించేలా రాసినవి. అలాంటి తప్పుడు కథనాలను నమ్మి దేశ ఆర్థిక ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రచారం చేసినవారు, పెట్టుబడిదారుల నమ్మకాన్ని కదిలించినవారు ఇప్పుడు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.
Adani గ్రూపుకు క్లీన్ చిట్ వచ్చిన తర్వాత శుక్రవారం మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. అదానీ గ్రూప్‌కు చెందిన తొమ్మిది కంపెనీల్లో అదానీ టోటల్ గ్యాస్ 10 శాతం వరకు పెరిగి టాప్ గైనర్‌గా నిలిచింది. ప్రధాన కంపెనీ Adani ఎంటర్‌ప్రైజెస్ 4.3 శాతం పెరిగింది. అలాగే మోర్గాన్ స్టాన్లీ అదానీ పవర్‌పై రేటింగ్ ఇచ్చిన తర్వాత ఆ కంపెనీ షేర్లు 7.4 శాతం ఎగిసి మార్కెట్లో అత్యధికంగా లాభపడిన వాటిలో ఒకటిగా నిలిచాయి. ఇక అదానీ పోర్ట్స్ 2 శాతం పెరిగింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ దాదాపు 4 శాతం పెరిగాయి. మొత్తంగా, అన్ని కంపెనీలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని తిరిగి పొందుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపించాయి.
2023లో హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలతో అదానీ గ్రూప్ పెద్ద దెబ్బ తిన్నది. పన్ను స్వర్గధామాలను ఉపయోగిస్తున్నారని, సంబంధిత పార్టీ లావాదేవీలను దాచిపెడుతున్నారని ఆరోపించారు. ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే, అదానీ గ్రూప్ మార్కెట్ విలువ దాదాపు 150 బిలియన్ల డాలర్ల వరకు పడిపోయింది. అయితే ఇప్పుడు ఆ షేర్లు మళ్లీ పుంజుకోవడం పెట్టుబడిదారులకు ఊరటనిచ్చింది.
సెబీ ఇప్పటివరకు అదానీ గ్రూప్‌పై ఉన్న 24 కేసుల్లో 2కి మాత్రమే క్లిన్‌చిట్ ఇచ్చింది. ఇంకా 22 కేసులపై విచారణ కొనసాగుతూనే ఉంది. అదానీ గ్రూప్‌కు సంబంధించి ఉన్న అన్ని ఆరోపణలు, కేసులు పూర్తిగా ముగిసిపోయినట్టుకాదు. అయితే హిండెన్‌బర్గ్ పెట్టిన కీలక ఆరోపణల్లో రెండు ముఖ్యమైన వాటిలో సెబీ స్పష్టంగా ఎటువంటి తప్పు జరగలేదు అని చెప్పడం ఒక పాజిటివ్ టర్నింగ్ పాయింట్ అని అర్థం చేసుకోవచ్చు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications