IPO News: మార్కెట్లోకి రాబోతున్న మరో ఐపీవో.. ఆ పరిశ్రమలో ఇదే రెండో కంపెనీ లిస్టింగ్.. పూర్తి వివరాలు
CEIL HR Services IPO: భారతీయ ఈక్విటీ మార్కెట్లు కరెక్షన్ మోడ్ లో ప్రస్తుతం బేరిష్ మెుమెంటం కలిగి ఉన్నాయి. ఈ క్రమంలో మార్కెట్లలోకి వస్తున్న ఐపీవోలు మాత్రం సీసెంట్ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. దీంతో చాలా మంది ఐపీవో మార్కెట్లలో పార్టిసిపేట్ చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో కొత్తగా మార్కెట్లోకి వస్తున్న ఐపీవోలను ట్రాక్ చేస్తూ తమకు నచ్చిన వాటిలో పెట్టుబడులు పెడుతున్నారు. చాలా మంది లిస్టింగ్ లాభాల కోసం ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది సిఐఈఎల్ హెచ్ఆర్ సర్వీసెస్ కంపెనీ ఐపీవో గురించే. వాస్తవానికి ఇదొక వ్యూమన్ రిసోర్సెస్ కంపెనీ. ఈ ఇండస్ట్రీ నుంచి వస్తున్న రెండవ ఐపీవో కావటం దీని ప్రత్యేకత. దీనికి ముందు తొలుత హెచ్‌ఆర్ సొల్యూషన్ సంస్థ టీమ్‌లీజ్ సర్వీసెస్ మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కంపెనీ తన తాజా ఐపీవో ద్వారా మార్కెట్ల నుంచి రూ.450 కోట్ల వరకు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. టీమ్ లీజ్ కంపెనీ కేవలం రిక్రూట్మెంట్ సేవలను మాత్రమే అందిస్తుండగా.. CIEL మాత్రం ఎండ్-టు-ఎండ్ హెచ్ఆర్ సొల్యూషన్‌లను అందిస్తుంది.

అందుబాటులో ఉన్న ఐపీవో ఫైలింగ్స్ సమాచారం ప్రకారం కంపెనీ మెుత్తం రూ.450 కోట్లను సమీకరించాలని చూస్తుండగా.. ఇందులో దాదాపు రూ.350 కోట్లకు ఫ్రెష్ ఇష్యూ ఉంటుందని తెలుస్తోంది. మిగిలిన భాగం ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐపీవోకి ముందు కంపెనీ తొలిసారిగా తన వార్షిక ఆదాయం రూ.1000 కోట్ల మార్కును దాటడం గమనార్హం. అలాగే దాదాపు నెల కిందట కంపెనీ ముంబైకి చెందిన థామస్ ఎసెస్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని కొనుగోలు చేసింది. 2025 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా 3 సంస్థలను కొనుగోలు చేయాలని చూస్తున్నట్లు వెల్లడైంది.
పాండియరాజన్ కరుప్పసామి, హేమలత రాజన్, ఆదిత్య నారాయణ్ మిశ్రా, సంతోష్ కుమార్ నాయర్, దొరైస్వామి రాజీవ్ కృష్ణన్ కంపెనీ ప్రమోటర్లుగా ఉన్నారు. వాస్తవానికి 2015లో స్థాపించబడిన సిఐఈఎల్ కంపెనీ చెన్నై కేంద్రంగా వ్యాపారాన్ని కొనసాగిస్తోంది. కేవలం 9 ఏళ్ల కాలంలోనే కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్లలోకి తన ఐపీవోను ఫ్లోట్ చేయాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం కంపెనీకి దేశ వ్యాప్తంగా 43 నగరాల్లో 92 కార్యాలయాలు ఉన్నాయి. జూన్ 30, 2024 నాటికి వివిధ రంగాల్లోని 3,958 కంపెనీలకు సేవలను అందించింది. కంపెనీ ఆదాయంలో 52 శాతం ప్రస్తుతం టాప్-20 మంది కస్టమర్ల నుంచి పొందుతోంది.
కంపెనీ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.1.12 కోట్లు.. 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.4.14 కోట్ల రుణ చెల్లింపులను కలిగి ఉంది. తన అనుబంధ సంస్థల్లో మిగిలిన వాటాను కొనుగోలు చేయడానికి కంపెనీ 25-27 ఆర్థిక సంవత్సరంలో మరో రూ.22 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఇక్రా పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ.10 కోట్లుగా ఉండటం గమనార్హం.


Click it and Unblock the Notifications