Narayana Murthy: రెండు కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన నారాయణ మూర్తి క్యాటమరన్ వెంచర్స్..
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చెందిన క్యాటమరన్ వెంచర్స్ తాజాగా మరో రెండు కంపెనీల్లో పెట్టుబడి పెట్టింది. ఇందులో టీడీ పవర్ సిస్టమ్స్, వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్ కంపెనీలు ఉన్నాయి. టీడీ పవర్ సిస్టమ్స్ లో 1.46 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకు గానూ రూ.262 కోట్ల పెట్టుబడి పెట్టింది. వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్ లో 1.02 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇందులో రూ.28 కోట్లు పెట్టుబడి పెట్టింది. టీడీ పవర్ సిస్టమ్స్ 1999లో స్థాపించారు. ఇది బెంగళూరుకు చెందిన ఏసీ జనరేటర్లు, ఎలక్ట్రిక్ మోటార్ల తయారీ కంపెనీ. కంపెనీలో తయారు చేసిన యంత్రాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టీమ్, గ్యాస్, హైడ్రో, విండ్, డీజిల్ పవర్ ప్లాంట్లలో వాడుతున్నారు.
రూ.17,969 కోట్ల మార్కెట్ క్యాప్‌తో ఈ కంపెనీ 100కు పైగా దేశాలకు ఎగుమతి యంత్రాలను చేస్తుంది. ఈ కంపెనీ యునైటెడ్ స్టేట్స్, యూరప్, టర్కీ, జపాన్‌లలో అనుబంధ సంస్థలను నడుపుతోంది. పెద్ద టర్బైన్ జనరేటర్ల కోసం జపాన్‌కు చెందిన తోషిబా గ్రూప్‌తో దీనికి దీర్ఘకాలిక తయారీ ఒప్పందం కూడా ఉంది. ఈ కంపెనీ ప్రెసిషన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజనీరింగ్ వర్క్ చేస్తుంది. ఈ కంపెనీకి చాలా తక్కువ రుణాలు ఉన్నాయి. రూ.కోట్ల వరకు రుణాలు ఉన్నాయి. రూ.1000 కోట్ల రిజర్వ్స్ ఉన్నాయి.

ఈ కంపెనీలు ఐదేళ్లలో అమ్మకాలు మూడింతలకు పైగా పెరిగాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు దాదాపు 45 శాతం పెరిగాయి. నికర లాభం రూ. 239 కోట్లకు పెరిగింది. మార్జిన్లు కూడా డబుల్ డిజిట్ చేరుకున్నాయి. ప్రస్తుతం మార్జిన్లు 18 శాతానికి పెరిగాయి. ఈక్విటీపై రాబడి 25 శాతానికి దగ్గరలో ఉంది. కొత్త విద్యుత్ ప్రాజెక్టులు, ఉక్కు పరిశ్రమ, విస్తృత ఫ్యాక్టరీ నిర్మాణ కారణంగా పెద్ద జనరేటర్లకు బలమైన డిమాండ్ వచ్చింది. గత సంవత్సరంలో ఈ స్టాక్ విలువ రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది. 2021 జూలైలో టీడీ పవర్ షేరు ధర దాదాపు రూ. 40 ఉండగా.. అది 2026 జూలై 10 నాటికి అది రూ. 1,150కి చేరింది. అంటే 5 సంవత్సరాలలో ఇది 2,775% పెరిగింది.
ప్రస్తుతం పీఈ రేషియో 75 గా ఉంది. ఇది ప్రస్తుత పరిశ్రమ సగటు 38x కంటే ఎక్కువగా ఉంది. ప్రమోటర్ల వాటా 2023 దాదాపు 58 శాతం ఉండగా.. 2026 జూన్ నాటికి 27 శాతానికి పడిపోయింది. ఈ కంపెనీలో ప్రస్తుతం విదేశీ పెట్టుబడిదారులు 26 శాతం హోల్డ్ చేస్తున్నారు. దేశీయ సంస్థలు సుమారు 24 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇక వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్ విషయానికొస్తే.. ఈ కంపెనీని 2010లో స్థాపించారు. ఈ కంపెనీ కార్లు, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్ల ఇంజిన్, గేర్‌బాక్స్ భాగాలను నిర్మించడానికి ఉపయోగించే ప్రత్యేక, మిశ్రమ ఉక్కు కడ్డీలను తయారు చేస్తుంది.
ఈ కంపెనీ ప్రస్తుతం రూ. 2,672 కోట్ల మార్కెట్ క్యాప్‌తో కొనసాగుతోంది. ఈ కంపెనీ జపాన్‌కు చెందిన టయోటా గ్రూప్ ఉక్కు విభాగమైన ఐచీ స్టీల్‌తో కలిసి పనిచేస్తుంది. టయోటా, మారుతి సుజుకి, హ్యుందాయ్, హీరో మోటోకార్ప్ వంటి సంస్థలు ఈ కంపెనీకి క్లయింట్లుగా ఉన్నాయి. ఇది థాయ్‌లాండ్, టర్కీ, జర్మనీ, ఇటలీ, జపాన్‌లోని కొనుగోలుదారులకు కూడా ఎగుమతి చేస్తుంది.


Click it and Unblock the Notifications