Carraro India IPO: నేడు దేశీయ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఐపీవోలు ఒకటి ఇన్వెస్టర్లకు సంతోషం అందించగా, రెండవది ఇన్వెస్టర్లను నిండా ముంచింది. అవును మార్కెట్ల పతనంలో బొక్కబోర్లా పడ్డ ఐపీవోలో బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు ప్రస్తుతం ఉసూరుమంటున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కరారో ఇండియా కంపెనీ ఐపీవో గురించే. మెయిన్ కేటగిరీలో వచ్చిన ఐపీవో షేర్లు ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర కంటే 7.52 శాతం తక్కువగా రూ.651 వద్ద మార్కెట్లో జాబితా అయ్యాయి. ఇదే క్రమంలో బీఎస్ఈలో కంపెనీ షేర్లు నేడు 6.25 శాతం తగ్గుదలతో రూ.660 వద్ద అరంగేట్రం చేశాయి. అయితే లిస్టింగ్ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు కంపెనీ షేర్లు ఒక్కోటి ఎన్ఎస్ఈలో రూ.645 వద్ద తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. దీంతో కంపెనీ ఐపీవోపై బెట్టింగ్ వేసిన పెట్టుబడిదారులు బోరున ఏడుస్తున్నారు.

మెయిన్ కేటగిరీలో వచ్చిన కరారో ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.1250 కోట్లను సమీకరించే లక్ష్యంతో వచ్చింది. పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో వచ్చిన ఐపీవో ఇందుకోసం ఇన్వెస్టర్లకు 1.78 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచిన సంగతి తెలిసిందే. ఐపీవో ఈ క్రమంలో రిటైల్ ఇన్వెస్టర్లకు డిసెంబర్ 20 నుంచి డిసెంబర్ 24 వరకు అందుబాటులో ఉంచబడింది. ఈ క్రమంలో కంపెనీ తన ఐపీవో ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.668- రూ.704గా నిర్ణయించింది. అలాగే లాట్ పరిమాణాన్ని 21 షేర్లుగా ఉంచటంతో రిటైల్ ఇన్వెస్టర్లు ఇందులో పాల్గొనటం కోసం కనీసం రూ.14,784 వెచ్చించాల్సి వచ్చింది. రిటైల్ ఇన్వెస్టర్ల కేటగిరీ 71%, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 60%, క్వాలిఫైడ్ ఇన్వెస్టర్ల విభాగం 2.2 రెట్లు సబ్‌స్క్రిప్షన్ నమోదు చేసింది.
కంపెనీ ఆర్థిక పరిస్థితి?
గత కొన్నేళ్లుగా కరారో ఇండియా పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరంలో కార్యకలాపాల ద్వారా కంపెనీ ఆదాయం 4.44 శాతం పెరిగి రూ.1,770.45 కోట్లకు చేరుకుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆదాయం రూ.1,695.12 కోట్లుగా ఉంది. కంపెనీ నికర లాభం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.48.46 కోట్ల నుండి 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.62.56 కోట్లకు పెరిగింది.
కంపెనీ వ్యాపారం..
1997లో స్థాపించబడిన కరారో ఇండియా వాస్తవానికి కరారో ఎస్బీఏకి అనుబంధ సంస్థ. కరారో గ్రూప్‌లోని ఇతర సంస్థల నుండి లైసెన్స్ పొందిన ఐపీ హక్కులను ఉపయోగించి కంపెనీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారీదారుగా ఉన్న కంపెనీ కస్టమర్‌ల కోసం సంక్లిష్ట ఇంజనీరింగ్ ఉత్పత్తులు, పరిష్కారాల్లో ప్రత్యేకత కలిగి ఉంది. వ్యవసాయ ట్రాక్టర్‌లు, నిర్మాణ వాహనాల కోసం యాక్సిల్స్, ట్రాన్స్‌మిషన్ సిస్టమ్‌లపై దృష్టి సారిస్తోంది. ప్రస్తుతం కంపెనీ పూణేలో రెండు తయారీ ప్లాంట్లను నిర్వహిస్తోంది. ఈ ప్లాంట్లు కాస్టింగ్, మ్యాచింగ్, అసెంబ్లీ, ప్రోటోటైపింగ్, టెస్టింగ్, పెయింటింగ్, హీట్ ట్రీట్‌మెంట్ కోసం అధునాతన సాంకేతికతను కలిగి ఉన్నాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications