Capital Infra Trust IPO: ఈవారంలో కొత్తగా వస్తున్న ఐపీవోల జాబితా పెద్దగానే ఉంది. దీంతో స్టార్ట్ అవుతున్న ఐపీవోల్లో పెట్టుబడులు పెట్టడానికి రిటైల్ ఇన్వెస్టర్లు తమ డబ్బును సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో కొత్తవారంలో వస్తున్న ఐపీవోలపై కూడా చాలా మంది దృష్టి కొనసాగిస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది క్యాపిటల్ ట్రస్ట్ ఐపీవో గురించే. మెయిన్ బోర్డ్ కేటగిరీలో వస్తున్న ఐపీవో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.1578 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో కంపెనీ తాజా ఈక్విటీల జారీ ద్వారా మార్కెట్ల నుంచి రూ.1077 కోట్లను సమీకరిస్తుండగా.. మిగిలిన రూ.501 కోట్లను సమీకరించటానికి 5.01 కోట్ల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ కింద విక్రయించాలని నిర్ణయించింది. ఎన్ఎస్ఈ, బీఎస్ఈలో ఏకకాలంలో లిస్టింగ్ కోసం వస్తున్న కంపెనీ షేర్లు ఇన్వెస్టర్ల సబ్ స్క్రిప్షన్ కోసం జనవరి 7 నుంచి 9 వరకు అందుబాటులో ఉండనుంది. ప్రాథమికంగా అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఐపీవో జనవరి 14న లిస్టింగ్ కోసం వస్తుందని తెలుస్తోంది.

కంపెనీ ఐపీవో కోసం షేర్ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.99-100గా నిర్ణయించింది. ఇదే క్రమంలో లాట్ పరిమాణాన్ని కంపెనీ 150 షేర్లుగా నిర్ణయించటంతో పెట్టుబడిదారులు కనీసం రూ.15,000 పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లిమిటెడ్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లో ఐపీవో ప్రారంభానికి ముందే పెట్టుబడిదారుల నుంచి షేర్ల కొనుగోలుకు మంచి స్పందన కనిపిస్తోంది. కంపెనీ ప్రధానంగా తాజా ఐపీవో నుంచి సమీకరించిన మెుత్తాన్ని రుణ చెల్లింపుల కోసం వినియోగించాలని చూస్తోంది.
కంపెనీ వ్యాపారం..
సెప్టెంబర్ 2023లో స్థాపించబడిన క్యాపిటల్ ఇన్‌ఫ్రా ట్రస్ట్ అనేది గవార్ కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ ద్వారా స్పాన్సర్ చేయబడిన ఒక ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్. ఇన్‌విట్ కార్యకలాపాల్లో పాల్గొనడానికి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌గా పెట్టుబడులు పెట్టడానికి స్థాపించబడింది. సెబీ ఇన్‌విట్ నిబంధనల ప్రకారం అనుమతించబడింది. NHAI, MoRTH, MMRDA, CPWDతో సహా వివిధ ప్రభుత్వ సంస్థల కోసం దేశంలోని 19 రాష్ట్రాల్లో రోడ్డు, హైవే ప్రాజెక్టులను నిర్మించడంలో స్పాన్సరింగ్ కంపెనీ ప్రత్యేకత కలిగి ఉంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications