స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు ఫిబ్రవరి 1 అంటే ఒక పండగ లాంటిది. కానీ, గత కొన్ని ఏళ్లుగా ఆ పండగ ఉత్సాహం మార్కెట్ లో కనిపించడం లేదు. బడ్జెట్ (Budget 2026) దగ్గరపడుతున్న వేళ ఇన్వెస్టర్లంతా "ఈసారైనా మార్కెట్ పరుగులు పెడుతుందా?" అని ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే గడిచిన పదేళ్ల గణాంకాలు చూస్తే ఒక చేదు నిజం మనకు అర్థమవుతుంది. బడ్జెట్ రోజున నిఫ్టీ ఇచ్చే సగటు రిటర్న్స్ కేవలం 0.19 శాతం మాత్రమే!

బడ్జెట్ రోజున మార్కెట్ ఎందుకు సైలెంట్ గా ఉంటోంది?
ఒకప్పుడు బడ్జెట్ అంటే సంచలన ప్రక్రియ. కానీ, ఇప్పుడు సీన్ మారింది. ఎందుకంటే ప్రభుత్వం తీసుకునే చాలా కీలక నిర్ణయాలు, పన్ను మార్పులు ఇప్పుడు కేవలం బడ్జెట్ రోజే కాకుండా ఏడాది పొడవునా ప్రకటిస్తున్నారు. ఉదాహరణకు, GST మార్పులు ఎప్పుడూ GST కౌన్సిల్ సమావేశాల్లోనే జరుగుతాయి. దీనివల్ల బడ్జెట్ రోజున కొత్తగా వచ్చే 'సర్ ప్రైజ్' ఎలిమెంట్ తగ్గిపోయింది. అందుకే మార్కెట్ స్పందన కూడా చాలా పరిమితంగా ఉంటోందని నిపుణులు చెబుతున్నారు.
జనవరి నెలలో ఇన్వెస్టర్ల ఆశలపై నీళ్లు
సాధారణంగా బడ్జెట్ కు ముందు మార్కెట్ పెరుగుతుందని చాలామంది ఆశపడతారు. కానీ, ఈసారి నిఫ్టీ దాదాపు 4 శాతం పతనమై ఇన్వెస్టర్లను నిరాశపరిచింది. ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతలు, డాలర్ తో పోలిస్తే రూపాయి బలహీనపడటం వంటి కారణాలు మార్కెట్ ను కిందకు లాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్(Budget 2026) లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప, పెద్దగా రాలీ ఉండే అవకాశం లేదని విశ్లేషకుల అభిప్రాయం.
బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి?
నిఫ్టీతో పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. గత 15 ఏళ్ల డేటా ప్రకారం, బడ్జెట్ రోజున బ్యాంక్ నిఫ్టీ సగటున 0.42 శాతం రిటర్న్స్ ఇచ్చింది. అయితే గత మూడు బడ్జెట్లలో (2023, 2024, 2025) నెగటివ్ రిటర్న్స్ రావడం గమనార్హం.
పోస్ట్ బడ్జెట్ రాలీ సాధ్యమేనా?
బడ్జెట్ రోజున మార్కెట్ పెరగకపోయినా బడ్జెట్ తర్వాత అనిశ్చితి తొలగిపోవడంతో మార్కెట్ కోలుకునే అవకాశం ఉంటుంది.
- వాలటిలిటీ తగ్గడం: బడ్జెట్ ప్రసంగం ముగియగానే అస్పష్టత పోతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లు మళ్ళీ కొనుగోళ్లు మొదలుపెట్టే ఛాన్స్ ఉంది.
- క్యాపెక్స్ పై ఫోకస్: ప్రభుత్వం మౌలిక సదుపాయాల (Infrastructure) మీద భారీగా ఖర్చు చేస్తామని ప్రకటిస్తే ఆయా రంగాల షేర్లలో వెలుగు రావచ్చు.
- ఫిస్కల్ డిసిప్లిన్: ప్రభుత్వం ద్రవ్య లోటును కంట్రోల్ లో ఉంచుతుందని భరోసా ఇస్తే విదేశీ ఇన్వెస్టర్లు (FPIs) మళ్ళీ భారత్ వైపు చూడొచ్చు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గుడ్డిగా ఇన్వెస్ట్ చేయడం కంటే.. బడ్జెట్ తర్వాత క్లారిటీ వచ్చాక అడుగు వేయడం ఉత్తమమని మార్కెట్ నిపుణుడు మౌలిక్ పటేల్ సూచిస్తున్నారు. ఎర్నింగ్స్ సపోర్ట్ లేకపోవడం మార్కెట్ కు ఇప్పుడు పెద్ద మైనస్ పాయింట్ గా మారింది.


Click it and Unblock the Notifications