Stock Ideas: క్రేజీ స్టాక్.. 84 శాతం పక్కా పెరుగుద్దన్న బ్రోకరేజ్, క్యూ3 ఫలితాలు విడుదల
Zomato Q3 Results: దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం కార్పొరేట్ కంపెనీలు విడుదల చేస్తున్న డిసెంబర్ త్రైమాసిక ఫలితాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉన్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది జొమాటో కంపెనీ డిసెంబర్ త్రైమాసిక ఫలితాల గురించే. కంపెనీ ఫలితాలను ప్రకటించటంతో మంగళవారం భారీగా క్షీణతను చూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు స్టాక్ 1.9 శాతం పతనంలో ఇంట్రాడేలో రూ.210.45 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. గడచిన ఐదు ట్రేడింగ్ సెషన్లలో కంపెనీ షేర్లు దాదాపు 16 శాతానికి పైగా పతనాన్ని నమోదు చేశాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా 8 శాతం వరకు క్షీణతను చూశాయి.

ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ స్టార్టప్ కంపెనీ మూడవ త్రైమాసికంలో నికర లాభాల్లో 57% క్షీణతను నమోదు చేసింది. కంపెనీ లాభాలు రూ.59 కోట్లుగా నమోదయ్యాయి. గడచిన ఏడాది ఇదే త్రైమాసికంలో నికర లాభం రూ.138 కోట్లుగా నిలిచింది. ఈ ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.5,405 కోట్లుగా ఉండగా.. ఏడాది కిందట ఇదే కాలంలో రూ.3,288 కోట్ల ఆదాయం కంటే 64 శాతం పెరుగుదలను చూసింది. అలాగే రెండవ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.176 కోట్లుగా నిలిచింది.
లాభాలు ఎందుకు తగ్గాయ్..?
జొమాటో క్విక్ కామర్స్ వ్యాపారం అయిన బ్లింకిట్ నష్టాలు పెరిగాయి. ఈ పరిణామం వల్ల పెరిగిన పెట్టుబడి ఖర్చుల కారణంగా జొమాటో కంపెనీ మూడవ త్రైమాసికంలో నికర లాభం తగ్గుదలను చూసింది. ఈ పేలవమైన పనితీరు ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేసింది. క్విక్ కామర్స్ రంగంలో బ్లింకిట్.. జెప్టో, ఇన్టామార్ట్, బిగ్ బాస్కెట్ వంటి పెద్ద ఆగటాళ్లతో పాటు కొత్తగా ఈ వ్యాపారంలోకి వస్తున్న అనేక సంస్థలతో పోటీ పడాల్సి వస్తోంది. దీనికారణంగా కంపెనీ ఎక్కువగా క్యాష్ బర్నింగ్ చూస్తున్నట్లు తెలుస్తోంది.
బ్రోకరేజీల టార్గెట్ ధరలివే..
- ముందుగా బ్యాంక్ ఆఫ్ అమెరికా మాత్రం ప్రస్తుతం కంపెనీ షేర్ ధర రానున్న కాలంలో 84 శాతం పెరుగుతుందని పేర్కొంది. కొనుగోలు రేటింగ్ అందిస్తూ స్టాక్ టార్గెట్ ధరను షేరుకు రూ.375గా పేర్కొంది.
- ఇదే క్రమంలో మరో విదేశీ సంస్థ నోమురా కూడా జొమాటో కంపెనీ షేర్లకు బై రేటింగ్ కొనసాగించింది. అయితే టార్గెట్ ధరను రూ.320 నుంచి రూ.290కి తగ్గించింది.
- అలాగే యూబీఎస్ జొమాటో స్టాక్ కొనుగోలుకు అనుకూలమైనదిగా పేర్కొంటూ టార్గెట్ ధర రూ.320గా ప్రకటించింది. అలాగే కంపెనీ షేర్లకు బై రేటింగ్ అందించింది.
- అయితే మ్యాక్విర్ మాత్రం వీటికి పూర్తి భిన్నంగా తన రేటింగ్ అందించింది. జొమాటో కంపెనీ షేర్లకు రూ.130 టార్గెట్ ధరగా ప్రకటిస్తూ అండర్ పెర్ఫార్మ్ రేటింగ్ ఇవ్వటం గమనార్హం.


Click it and Unblock the Notifications