IT Stocks: హెచ్‎సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, టీసీఎస్ స్టాక్స్ కు బై రేటింగ్ ఇచ్చిన బ్రోకరేజ్ సంస్థ..!

బ్రోకరేజ్ సంస్థ హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్ రెండో త్రైమాసిక ఆదాయాల సీజన్ (FY27 Q2 ఫలితాలు) ప్రారంభానికి ముందు పలు ఐటీ కంపెనీలకు బై రేటింగ్ ఇచ్చింది. 34 శాతం వరకు అప్‌సైడ్‌తో బై రేటింగ్‌ను సిఫార్సు చేసింది. భారతీయ IT స్టాక్‌లలో మిశ్రమమైన కానీ ఆకర్షణీయమైన సెటప్‌ను సూచిస్తాయని.. టీసీఎస్ టార్గెట్ ప్రైస్ ను రూ.2,470గా నిర్ణయించింది. 20 శాతం అప్‌సైడ్‌ను సూచించింది. అయితే HCL టెక్నాలజీస్ టార్గెట్ ప్రైస్ ను రూ.1,370 గా నిర్ణయించి 11 శాతం అప్‌సైడ్‌ ఉంటుందని పేర్కొంది. విప్రో 17 శాతం పెరిగి రూ.185, టెక్ మహీంద్రా టార్గెట్ ప్రైస్ ను రూ.1,660కు పెంచింది. ఈ స్టాక్ కు 9 శాతం అప్‌సైడ్‌ ఉండే అవకాశం ఉందని పేర్కొంది.

మిడ్-క్యాప్ కంపెనీల్లో పెర్సిస్టెంట్ సిస్టమ్స్ రూ.6,070 టార్గెట్‌ ప్రైస్ నిర్ణయించి 15% అప్‌సైడ్‌ ఉంటుందని అంచనా వేసింది. అయితే Mphasis టార్గెట్ ప్రైస్ రూ. 2,840 తో పాటు 32 శాతం అప్ సైడ్ ఉన్నట్లు పేర్కొంది. ఎంపిక చేసిన ఇంజినీరింగ్, చిన్న ఐటీ కంపెనీలలో కూడా బ్రోకరేజ్ గణనీయమైన పెరుగుదలను చూస్తుంది. L&T టెక్నాలజీ సర్వీసెస్ (LTTS) రూ.3,570 టార్గెట్‌ ప్రైస్ గా నిర్ణయించింది. Tata Elxsi రూ.3,900 వరకు పెరిగే అవకాశం ఉంటుందని.. జెన్ టెక్నాలజీస్ రూ.565, బిర్లాసాఫ్ట్ రూ.365 వరకు పెరిగే అవకాశం ఉందని హెచ్ డీఎఫ్ సీ సెక్యూరిటీస్ పేర్కొంది.

Multibagger Stock

డాలర్ ఆదాయ వృద్ధి 0.5% క్షీణత నుంచి 1.8% పెరుగుదల క్వార్టర్ ఆన్ క్వార్టర్ (QoQ) వరకు ఉంటుందని అంచనా హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ వేసింది. పెద్ద ఐటి కంపెనీలలో హెచ్‌సిఎల్‌టెక్, టెక్ మహీంద్రా అత్యుత్తమ పనితీరును కనబరుస్తాయని భావిస్తోంది. హెచ్‌సిఎల్‌టెక్ స్థిరమైన కరెన్సీ (సిసి)లో దాదాపు 2% QoQ వృద్ధిని నివేదిస్తుంది, దానితో పాటు ఆపరేటింగ్ మార్జిన్‌లలో 50 బిపిఎస్ మెరుగుదల కూడా ఉంది. టెక్ మహీంద్రా CC పరంగా 0.9% QoQ వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేసింది. టీసీఎస్ 0.5, ఇన్ఫోసిస్ 1.3% QoQ వృద్ధిని నివేదించవచ్చని అంచనా వేసింది. ఇది కాలానుగుణంగా బలమైన త్రైమాసికంలో సాధారణంగా ఊహించిన దాని కంటే బలహీనంగా పరిగణించవచ్చని తెలిపింది.

విప్రో 0.4% QoQ క్షీణతను చూసే అవకాశం ఉందని తెలిపింది. మధ్య తరహా IT కంపెనీలలో, స్థిరమైన కరెన్సీ పరంగా 0.6% నుండచి 6.3% QoQ వరకు వృద్ధి బలంగా ఉంటుందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేసింది. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ 6.3% వృద్ధితో ముందుంటుందని అంచనా వేసింది. సైయెంట్ DLM? దాదాపు 5.5% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. LTIMindtree (LTM) 5.3% వృద్ధి చెందుతుందన్నారు.Mphasis దాని బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ (BFSI) వ్యాపారంలో నిరంతర వృద్ధి మద్దతుతో దాదాపు 3.5% వృద్ధి చెందుతుందని అంచనా వేసింది.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+