Adani Green Energy: ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా రెన్యూవబుల్ ఎనర్జీకి భాగరీగా డిమాండ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే భారతదేశంలో కూడా ఈ బూమ్ కొనసాగుతోంది. వాస్తవానికి దేశంలో పీక్ పవర్ యుటిలిటీ 220 గిగావాట్లుగా ఉండగా.. ప్రస్తుతం ఇన్ స్టాల్ చేసిన మెుత్తం కెపాసిటీ జనరేషన్ దాదాపు 450 గిగావాట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. దీనికి కారణం గడచిన కొన్నేళ్లుగా దేశంలో రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు పెరగటమే.
ప్రధానంగా విండ్, సోలార్ ఎనర్జీ రంగాల్లో ప్రధానంగా అనేక కంపెనీలు ఎక్కువగా కొత్త ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయి. దీనికి ప్రధానంగా కారణాలను గమనిస్తే.. బొగ్గు వినియోగంతో నడిచే థర్మల్ పవర్ ప్లాంట్ల వల్ల అధికంగా పొల్యూషన్ జరగటంతో ప్రభుత్వాలు రెన్యూవబుల్ ఎనర్జీ రంగానికి మంచి బూస్ట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇది దేశంలోని బఢా వ్యాపారవేత్తగా కొనసాగుతున్న గౌతమ్ అదానీకి కలిసొచ్చే అంశంగా మారుతోంది.

ఇక వివరాల్లోకి వెళితే.. అదానీ గ్రూప్ కంపెనీ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ షేర్లు రానున్న రోజుల్లో ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించవచ్చని తెలుస్తోంది. ఆకర్షణీయమైన వాల్యుయేషన్, బలమైన వృద్ధి దృక్పథం కారణంగా గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ ఎమ్కే గ్లోబల్ స్టాక్‌పై 'BUY' రేటింగ్ కొనసాగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో బ్రోకరేజ్ సంస్థ కంపెనీ షేర్లకు టార్గెట్ ధరను రూ.1,500 వద్ద ఫిక్స్ చేసింది. వాస్తవానికి ఇది గురువారం ముగింపు కంటే దాదాపు 72 శాతం అధికం కావటం గమనార్హం. శుక్రవారం హోలీ సందర్భంగా స్టాక్ మార్కెట్లు సెలవులో ఉండటం కారణంగా తిరిగి సోమవారం మార్కెట్లు తెరచుకోనున్నాయి.
అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పూర్తిగా యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన అదానీ సోలార్ ఎనర్జీ AP VIII ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో తన 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్లాంట్ ప్రారంభంతో కంపెనీ మెుత్తం పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యం సుమారు 12.59 గిగావాట్లకు చేరుకున్నట్లు వెల్లడైంది. అలాగే కంపెనీ ఇటీవల UPPCL నుండి 40 సంవత్సరాల పాటు 1.25 GW PSP నిల్వ సామర్థ్యం కోసం టెండర్‌ను గెలుచుకుంది. ఈ పరిణామాలు కంపెనీకి దీర్ఘకాలంలో పెద్ద ఆటగాడిగా నిలవడానికి దోహదపడతాయని బ్రోకరేజ్ అభిప్రాయపడుతోంది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications