Multibagger Stock: ఐదేళ్లలో 296 శాతం రాబడి ఇచ్చిన ఏఐ మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవిగా ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. అయితే మంచి రాబడి ఇచ్చే స్టాక్స్ కూడా ఉంటాయి. వాటిని గుర్తించి పెట్టుబడి పెడితే మల్యీబ్యాగర్ రిటర్న్స్ వస్తాయి. మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్ ల్లో బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఒకటి. ఈ కంపెనీ షేర్లు మంగళవారం 4 శాతం ర్యాలీ తర్వాత లాభాలతో ముగిశాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కు ప్రాధాన్యతనిచ్చే ఈ కంపెనీ, తమ షేర్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మెయిన్ బోర్డులో ట్రేడింగ్‌కు అనుమతి వచ్చిందని ప్రకటించిన తర్వాత, ఈ షేరులో ఇటీవలి బుల్లిష్ ట్రెండ్ మొదలైంది.
ఆగస్టు 18 బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ షేరు ధర BSEలో 4.35% లాభంతో ఒక్కో షేరుకు రూ. 22.81 వద్ద ముగిసింది. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 2,105.55 కోట్లుగా ఉంది. ఈ స్టాక్ ఇంట్రాడేలో గరిష్టంగా ఒక్కో షేరుకు రూ. 23.49, కనిష్టంగా రూ. 21.90 వద్దకు చేరింది. బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సింబల్ కింద NSE మెయిన్‌బోర్డులో బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ షేర్ల డైరెక్ట్ లిస్టింగ్ కోసం ఈ సంస్థ ఆమోదం పొందింది. "ఈ డ్యూయల్ లిస్టింగ్, ఒక కీలకమైన మలుపు అని, బ్లూ క్లౌడ్ క్యాపిటల్-మార్కెట్ పునాదిని బలోపేతం చేస్తుంది" అని ఆ సంస్థ తన పత్రికా ప్రకటనలో పేర్కొంది.

ఈ పరిణామం పెట్టుబడిదారులకు స్టాక్‌లోకి సులభంగా ప్రవేశం కల్పించే అవకాశం ఉన్నప్పటికీ, ప్రజా భద్రత, ఆరోగ్య సంరక్షణ, 5G డిజిటల్ మౌలిక సదుపాయాలలో సార్వభౌమ AI ప్లాట్‌ఫారమ్‌లను విస్తరించే దిశగా ఈ సంస్థ ముందుకు సాగుతోంది. ఈ కంపెనీ 2016లో మా BSE లిస్టింగ్ నుంచి రూ. 1,000 కోట్లకు పైగా ఆదాయం సాధించామని బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ లిమిటెడ్ చైర్మన్ జానకి యార్లగడ్డ చెప్పారు. వైవిధ్యభరితమైన AI-కేంద్రీకృత గ్రూప్‌గా ఎదిగినట్లు పేర్కొన్నారు. రెండు ఎక్స్ఛేంజ్‌లలో ఉండటం తమ వాటాదారులకు ఎక్కువ ఎంపిక, లిక్విడిటీని ఇస్తుందని తెలిపారు.
నవంబర్ 6, 2025న BSEలో ఈ షేర్ ధర రూ. 38 వద్ద తన 52 వారాల గరిష్ట స్థాయిని తాకింది. అలాగే, జనవరి 27, 2025న రూ. 16.51 వద్ద తన 52 వారాల కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఈ స్టాక్ 'రిటర్న్ ఆన్ ఈక్విటీ' (ROE) 51.45%గా ఉంది. గత మూడు నెలల్లో దీని షేర్ ధర 30 శాతం పెరిగింది..రెండేళ్ల కాలంలో ఈ స్టాక్ విలువ సుమారు 79.8% పెరగ్గా.. ఐదేళ్లలో దాదాపు 296% మేర భారీ వృద్ధిని నమోదు చేసింది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications