Sensex-Nifty Fall: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త వారాన్ని భారీ నష్టాలతో ప్రారంభించటం గమనార్హం. వాస్తవానికి శనివారం దిల్లీ ఫలితాల్లో బీజేపీకి పెద్ద విజయం కైవసం అయ్యింది. దీంతో దాదాపు 27 ఏళ్ల తర్వాత దేశరాజధాని దిల్లీలో బీజేపీ విజయం కొత్త చరిత్రను లిఖించింది. కానీ ఆ జోష్ సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ఎక్కడా కనిపించలేదు. ఎన్నికల విజయం మార్కెట్లలో బుల్ జోరును తీసుకురాలేకపోయింది.
ఉదయం 10.36 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీల పనితీరును పరిశీలిస్తే.. ముందుగా సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 190 పాయింట్ల మేర నష్టంతో ముందుకు సాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 405 పాయింట్లను కోల్పోయింది. ఇక చివరిగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 735 పాయింట్ల పతనాన్ని చూసింది. ఇదే సమయంలో రూపాయి మారకపు విలువ డాలర్ తో పోల్చుకుంటే రికార్డు కనిష్ఠాలకు దిగజారింది.

వాస్తవానికి శనివారం వచ్చిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీ యుద్ధాన్ని గెలిచింది. పైగా దశాబ్ధాల రికార్డులను బద్దలుకొట్టి మోదీ సర్కార్ దేశరాజధానిలో పాగా వేసి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటుకు సిద్ధమైంది. అయితే బీజేపీకి దేశంలో పెరుగుతున్న ఆధరణ మార్కెట్లో పెట్టుబడిదారుల మూడ్ మార్చలేకపోయింది. వాస్తవానికి ఈ విజయం భారతీయ ఈక్విటీ మార్కెట్లలో పెద్ద జోష్ నింపుతుందని అందరూ భావించారు. కానీ పెట్టుబడిదారులు మాత్రం దీనికి వ్యతిరేకంగా వ్యవహరించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ట్రంప్ టారిఫ్స్..
రాయిటర్స్ తాజా నివేదిక ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ త్వరలోనే మరిన్ని టారిఫ్స్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో భాగంగా అమెరికా దిగుమతి చేసుకునే అన్ని అల్యూమినియం, స్టీల్ ఉత్పత్తులపై ఏకంగా 25 శాతం సుంకం విధించనున్నట్లు పేర్కొంది. ఆదివారం ట్రంప్ చేసిన కామెంట్స్ ప్రకారం ఇది ప్రపంచంలోని అన్ని దేశాలకు వర్తిస్తాయని చెప్పినప్పటికీ వాటిని ఎప్పటి నుంచి అమలు చేస్తారనే విషయాన్ని మాత్రం వెలల్డించలేదు. ఈ క్రమంలోనే అమెరికాకు ప్రధాని మోదీ ఫిబ్రవరి 12న పర్యటించనుండటం ఆసక్తిని రేపుతోంది.
ఇదే క్రమంలో మోతీలాల్ ఓస్వాల్ వ్యాఖ్యలను పరిశీలిస్తే.. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వ స్థిరత్వం, సజావుగా పనితీరుపై ఉన్న ఆందోళనలను తొలగిస్తున్నందున, దిల్లీ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు స్టాక్ మార్కెట్‌కు క్రమంగా సానుకూలంగా మారాలని పేర్కొంది. దిల్లీ ప్రజల తీర్పును మార్కెట్ సానుకూలంగా తీసుకుంటుందని బ్రోకరేజ్ విశ్వసిస్తోంది. ఇది విధానపరమైన నిర్ణయాల వేగానికి మరింత ఊపునిస్తుందని, కేంద్రంలో బీజేపీ సర్కార్ స్థిరత్వంపై ఉన్న ఆందోళనలను తొలగిస్తుందని పేర్కొంది. ఈ క్రమంలో పెట్టుబడిదారులు స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్ కి బదులుగా లార్జ్ క్యాప్ స్టాక్స్ కొనుగోలు చేయాలని సూచించింది.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications