మార్కెట్లో విశ్వరూపం చూపిస్తున్న బిట్ కాయిన్ .. 80 వేల డాలర్లు దాటి లక్ష డాలర్ల వైపు ర్యాలీ..

ప్రపంచ ఆర్థిక వేదికపై బలహీనపడుతున్న అమెరికన్ డాలర్, అమెరికా ప్రభుత్వ అనుకూల విధానాలపై అంచనాలతో క్రిప్టోకరెన్సీల డిమాండ్ ఒక్కసారిగా తీవ్రస్థాయికి చేరింది. ఈ సానుకూల పవనాల నేపథ్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కరెన్సీ అయిన బిట్‌కాయిన్ (Bitcoin) తన రికార్డు ర్యాలీని కొనసాగిస్తూ.. మంగళవారం నాడు మే మధ్యకాలం తర్వాత తొలిసారిగా 80 వేల డాలర్ల మైలురాయిని అధిగమించింది. ఆసియా ట్రేడింగ్ వేళల్లో బిట్‌కాయిన్ ఏకంగా 81,237.94 డాలర్ల గరిష్ట స్థాయిని తాకి.. చివరికి $80,323.24 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

గత వారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో రంగానికి స్పష్టమైన.. సులభతరమైన నిబంధనలను రూపొందించే చట్టాన్ని ఆమోదించాలని కాంగ్రెస్‌ను కోరినప్పటి నుండి బిట్‌కాయిన్ విలువ సుమారు 16 శాతం పెరిగింది. ఈ తాజా పెంపుతో ఆగస్టు నెలలోనే బిట్‌కాయిన్ లాభాలు దాదాపు 28 శాతానికి చేరాయి. ఇది నవంబర్ 2024 తర్వాత నమోదు కాబోతున్న అతిపెద్ద నెలవారీ రికార్డు పెరుగుదల కావడం విశేషం.

Bitcoin price Bitcoin price today Bitcoin 80 000 Bitcoin rally BTC price Bitcoin August gains crypto market rally cryptocurrency news weaker dollar Bitcoin three-month high BTC surge digital assets Bitcoin latest news Bitcoin price prediction 80000

ఈ సంచలన ర్యాలీకి యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ తీసుకున్న కీలక నిర్ణయాలు ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. బాండ్ మార్కెట్‌లో ఒత్తిడిని తగ్గించడానికి, దీర్ఘకాలిక రాబడుల పెరుగుదలను అదుపు చేయడానికి, మరిన్ని దీర్ఘకాలిక యూఎస్ ప్రభుత్వ బాండ్లను తిరిగి కొనుగోలు (Buyback) చేయనున్నట్లు ట్రెజరీ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల అమెరికన్ డాలర్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగి, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బిట్‌కాయిన్, బంగారం వంటి ప్రత్యామ్నాయ సురక్షిత ఆస్తుల వైపు మళ్లించేలా చేసింది. ఫలితంగా బంగారం కూడా మూడు నెలల గరిష్ఠ స్థాయికి ఎగబాకింది.

Also Read

ఈ పరిణామాలపై హ్యాష్‌కీ గ్రూప్‌కు చెందిన సీనియర్ పరిశోధకుడు టిమ్ సన్ స్పందిస్తూ... కనీసం మధ్యంతర ఎన్నికల వరకైనా దీర్ఘకాలిక రాబడుల పెరుగుదలను అమెరికా ప్రభుత్వం సహించదని, ఈ సందేశం బిట్‌కాయిన్, బంగారానికి అనుకూలమైన స్థూల ఆర్థిక వాతావరణాన్ని సృష్టించిందని పేర్కొన్నారు. స్టాండర్డ్ చార్టర్డ్ డిజిటల్ ఆస్తుల విభాగాధిపతి జెఫ్ కెండ్రిక్ మాట్లాడుతూ.. ప్రభుత్వాల విధానపరమైన జోక్యాల నుండి రక్షణ పొందేందుకు సృష్టించబడిన బిట్‌కాయిన్‌కు ట్రెజరీ నిర్ణయం పూర్తి అనుకూలమైనదని అన్నారు.

మార్కెట్‌లో మళ్లీ "డిబేస్‌మెంట్ ట్రేడ్" (కరెన్సీ విలువ పతనం నుండి రక్షణ పొందే వాణిజ్యం) పునరుజ్జీవనం పొందిందని.. పెట్టుబడిదారులు డిజిటల్, భౌతిక ఆస్తుల వైపు పరుగులు తీస్తున్నారని ఐజీ మార్కెట్ విశ్లేషకుడు టోనీ సైకమోర్ తెలిపారు. బిట్‌కాయిన్ ప్రస్తుత $80,000 స్థాయిని నిలకడగా కొనసాగిస్తే.. రాబోయే రోజుల్లో అతి సులువుగా $95,000 నుండి $100,000 మార్కును చేరుకోవడానికి మార్గం సుగమమవుతుందని అంతర్జాతీయ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+