ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టోకరెన్సీ అయిన Bitcoin తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. మూడు సంవత్సరాల్లో ఇదే అత్యంత భారీ నెలవారీ పతనంగా చెప్పవచ్చు. జూన్ 2022 తర్వాత మొదటిసారి బిట్‌కాయిన్ ధర ఒకే నెలలో 21 శాతం కంటే ఎక్కువగా క్షీణించింది.
ఈ మధ్య కాలంలో 800 బిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకుంది బిట కాయిన్. ఈ పతనానికి ప్రధానంగా మూడు కీలక అంశాలు బాధ్యత వహిస్తున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు.భారీ లాభాల బుకింగ్, US ఫెడరల్ రిజర్వ్ రేటు కోతలపై అనిశ్చితి, పెట్టుబడిదారులలో పెరిగిన ప్రమాద విముఖత కారణాలుగా చెబుతున్నారు.

బిట్‌కాయిన్ ధర అక్టోబర్ ప్రారంభం వరకు బలమైన ర్యాలీని నమోదు చేసింది. ధరలు గరిష్ట స్థాయిలను చేరడంతో, ముఖ్యంగా దీర్ఘకాలం బిట్‌కాయిన్‌ను నిల్వ చేసిన ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేసుకోవడం ప్రారంభించారు. ఒకవైపు లాభాల బుకింగ్ తీవ్రంగా పెరగడం, మరొవైపు మార్కెట్‌లో లిక్విడిటీ కొంత తగ్గడం కలిసి బిట్‌కాయిన్‌ను దిగజార్చే దిశలో నెట్టాయి. విశ్లేషకుల అంచనాల ప్రకారం.. మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి అత్యధికంగా పెరిగిన సమయం ఇదే.
మొదటి అంశం ఏంటంటే.. కార్మిక మార్కెట్ బలహీనత పెట్టుబడిదారులలో రిస్క్ విముఖతను పెంచింది. అమెరికా ఉద్యోగాల గణాంకాలు గందరగోళంగా ఉండటం, ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని సూచించడం వల్ల క్రిప్టో వంటి ప్రమాదకర ఆస్తుల నుంచి నిధులు బయటకు వెళ్లడం మొదలైంది. కొనుగోలు-అమ్మకాలలో లివరేజ్ కూడా ఈ పతనాన్ని మరింత వేగవంతం చేసింది.
ప్రస్తుతం కాయిన్‌బేస్ వంటి ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లు ట్రేడర్లకు 10:1 వరకూ లివరేజ్‌ను ఇస్తున్నాయి. అంటే చిన్న తగ్గుదల కూడా భారీ నష్టాలుగా మారి ట్రేడర్ల పొజిషన్‌లను బలవంతపు లిక్విడేషన్‌కు గురిచేస్తుంది. డెవెరే గ్రూప్ CEO నైజల్ గ్రీన్ చెప్పినట్లుగా, లివరేజ్ ఎక్కువగా ఉన్న మార్కెట్‌లో ఏ చిన్న ప్రతికూల సంకేతం కూడా భారీ అమ్మకాలకు దారితీస్తుంది.
ఇక రెండో ముఖ్య కారణం ఏంటంటే US ఫెడరల్ రిజర్వ్ రేటు కోతలపై అనిశ్చితి. సాధారణంగా బిట్‌కాయిన్ తక్కువ వడ్డీ రేట్ల కాలంలో బలంగా ప్రదర్శన ఇస్తుంది. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ బలహీనపడుతుంది. పెట్టుబడిదారులు అధిక రాబడులు ఇచ్చే ప్రత్యామ్నాయ ఆస్తులను వెతుకుతారు, అందులో బిట్‌కాయిన్ చాలా ముఖ్యమైనది.
అయితే డిసెంబర్‌లో రేట్లు తగ్గుతాయా అనే విషయంపై ఫెడ్ నుండి స్పష్టమైన సంకేతాలు లేకపోవడం మార్కెట్‌ను అయోమయంలోకి నెట్టింది. కొంత మంది అధికారులు రేట్లు తగ్గాల్సిన అవసరం లేదని చెప్పగా, మరికొందరు ద్రవ్యోల్బణం తగ్గుతున్నందున రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయని సూచించారు. ఈ మిశ్రమ సంకేతాలు పెట్టుబడిదారుల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపించాయి.
అలాగే మూడో ముఖ్య అంశం - రిస్క్ అసెట్స్‌పై పెట్టుబడిదారుల్లో పెరిగిన జాగ్రత్త. ప్రపంచవ్యాప్తంగా టెక్ స్టాక్స్ క్షీణతను ఎదుర్కొంటున్నాయి. దీనికి తోడు ట్రంప్ వాణిజ్య విధానాలపై అనిశ్చితి, భవిష్యత్తులో వృద్ధిని అడ్డుకునే స్థూల ఆర్థిక భయాలు పెరిగాయి. ఇలాంటి సందర్భాల్లో పెట్టుబడిదారులు ప్రమాదకర ఆస్తుల నుంచి.. ముఖ్యంగా క్రిప్టో నుండి నిధులను వెనక్కి తీసుకోవడం సహజం. ఇది బిట్‌కాయిన్ ధరపై అదనపు ఒత్తిడిని పెంచింది.
కృత్రిమ మేధస్సు (AI), టెక్ రంగాల్లో సంభవించవచ్చని భావిస్తున్న బుడగ (bubble) పెట్టుబడిదారుల్లో భయాలను పెంచింది. టెక్ స్టాక్‌లలో కనిపిస్తున్న నిరంతర ఒడిదుడుకులు క్రిప్టో మార్కెట్‌పై నేరుగా ప్రభావం చూపాయి, ఎందుకంటే బిట్‌కాయిన్, టెక్ స్టాక్‌లు తరచుగా ఒకే దిశలో కదలడం సాధారణం. టెక్ రంగం తుమ్మితే, బిట్‌కాయిన్‌కు జలుబు రావడం సహజమని విశ్లేషకుడు నిక్ పుక్రిన్ వ్యాఖ్యానించారు.
అయితే ఈ పరిస్థితుల్లో కూడా దీర్ఘకాలిక దృక్కోణంలో బిట్‌కాయిన్‌పై పెద్దగా ప్రతికూల ప్రభావం లేదని నిపుణులు చెబుతున్నారు. జెబ్‌పే COO రాజ్ కర్కర ప్రకారం, దీర్ఘ ర్యాలీ తర్వాత వచ్చే ఇటువంటి సరిదిద్దుబాట్లు (corrections) చాలా సహజం. మార్కెట్ స్వల్పకాలికంగా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా, బిట్‌కాయిన్ యొక్క దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్‌లో ఎటువంటి పెద్ద మార్పులు కనిపించడం లేదని తెలిపారు.
క్రిప్టో అనలిస్టుల ప్రకారం.. ప్రస్తుతం బిట్‌కాయిన్ పరిధి 85 వేల డాలర్ల వద్ద బలమైన మద్దతును కలిగి ఉంది. మరోవైపు 90 వేల డాలర్ల వద్ద కీలక ప్రతిఘటన (resistance) ఉంది. పాలీమార్కెట్‌ల ప్రకారం డిసెంబర్ ఫెడ్ రేటు కోత అవకాశాలు 81 శాతానికి పెరగడం బుల్లిష్ సెంటిమెంట్‌కు బలం చేకూరుస్తోంది. ఇటీవల అమెరికా ఉద్యోగాల డేటా మిశ్రమంగానే ఉన్నప్పటికీ, కొత్తగా 1.19 లక్షల ఉద్యోగాలు చేర్చడం ఫెడ్‌ను మరింత అనుకూల ద్రవ్య విధానాలకు దారితీయించవచ్చు.
క్లుప్తంగా చెప్పాలంటే ఇటీవల జరిగిన 800 బిలియన్ డాలర్ల విలువ నష్టం బిట్‌కాయిన్‌కు పెద్ద షాక్ అయినప్పటికీ.. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు దీనిని సహజ సరిదిద్దుబాటుగా చూస్తున్నారు. మార్కెట్ త్వరలోనే స్థిరపడే అవకాశాలు ఉన్నాయని, రాబోయే ఫెడ్ నిర్ణయాలు బిట్‌కాయిన్ దిశను నిర్ణయిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications