Sensex-Nifty: కోటి ఆశలతో కొత్త ఏడాదిని ప్రారంభించిన భారతీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు మంచి కాలం మెుదలైంది. గడచిన నెలలో భారీ ఒడిదొడుకులతో కరెక్షన్ ఫేజ్ కొనసాగించిన మార్కెట్ సూచీలు నేడు బుల్స్ జోరుతో దౌడుతీస్తున్నాయి. ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు పెట్టుబడిదారుల సంపదను పెంచుతున్నాయి.
నేడు వాస్తవానికి ఆసియా మార్కెట్లు తమ ప్రయాణాన్ని పతనంలో కొనసాగిస్తున్నప్పటికీ దీనికి వ్యతిరేకంగా భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ ర్యాలీతో ముందుకు సాగుతున్నాయి. ప్రధానంగా నేడు ఇంట్రాడేలో ఫైనాన్షియల్, ఆటో, ఐటీ రంగాలకు చెందిన కంపెనీల షేర్లలో కొనసాగిన కొనుగోళ్లు మార్కెట్ల పరుగుకు ఆజ్యం పోశాయి. రానున్న వారంలో కంపెనీలు తమ క్యూ3 కార్పొరేట్ ఫలితాలను ప్రకటించనున్న వేళ సానుకూల ఫలితాలను ఆశిస్తున్న క్రమంలో ఇన్వెస్టర్లు తమ కొనుగోళ్లను కొనసాగిస్తున్నట్లు వెల్లడైంది. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1280 పాయింట్లు పెరగగా, నిఫ్టీ సూచీ 370 పాయింట్లకు పైగా లాభపడింది.

నేడు స్టాక్ మార్కెట్లో బుల్స్ విజృంభించటంతో ఇన్వెస్టర్ల పెట్టుబడి విలువ బీఎస్ఈలో దాదాపు రూ.2.92 కోట్ల మేర పెరుగుదలను చూసింది.స్టాక్ మార్కెట్లు పెరుగుదలకు ప్రధాన కారణాలు ఇవే..
-దేశీయంగా జీఎస్టీ వసూళ్లలో ఆరోగ్యకరమైన పెరుగుదల ఈక్విటీ ఇన్వెస్టర్లను సానుకూలంగా నడిపిస్తోంది. ఇవి ఏడాది ప్రాతిపదికన 7.3 శాతం పెరిగి రూ.1.77 లక్షల కోట్లుగా నమోదు కావటమేనని నిపుణులు చెబుతున్నారు. ఇవి పెట్టుబడిదారుల సెంటిమెంట్లను బలపరిచాయని అన్నారు.
- టెక్నికల్స్ పరిశీలిస్తే బెంచ్ మార్క్ సూచీ నిఫ్టీ తాజాగా 200 మూవింగ్ ఏవరేజ్ దాటండం కూడా ఇన్వెస్టర్లను ర్యాలీలో పాల్గొనేలా చేసిందని వెల్లడైంది.
- త్వరలోనే కంపెనీలు తమ మూడవ త్రైమాసికానికి సంబంధించిన రిపోర్ట్స్ విడుదల చేయనున్న వేళ స్టాక్ మార్కెట్లు సానుకూలంగా ప్రభావితం అవుతున్నాయని పెట్టుబడిదారులు చెబుతున్నారు. ఆభరణాలు, ఏవియేషన్ హాస్పిటాలిటీ వంటి లగ్జరీ వినియోగ రంగాలు బలమైన రాబడులను అందజేస్తాయని ఆశిస్తున్నట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ పేర్కొన్నారు.
- ప్రముఖ రేటింగ్ సంస్థలు సిటీ గ్రూప్, సీఎల్ఎస్ఏ ఐటీ పరిశ్రమపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ఈ సారి ఐటీ సంస్థలోని కంపెనీలు ఆదాయాలు మంచిగా వృద్ధి చెందుతాయని, డాలర్ రూపాయి మారకపు విలువ పతనం అనుకూలంగా మారుతుందని వారు భావిస్తున్నారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications