IPO News: తర్వలో మార్కెట్లోకి రూ.2150 కోట్ల ఐపీవో.. ఆటో ఐపీవోపై ఇన్వెస్టర్స్ క్రేజీ..
Belrise Industries IPO: దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస ఐపీవోల రాకకు మరోసారి రంగం సిద్ధం అవుతోంది. గత రెండు వారాలుగా పెద్దగా ఐపీవోలు మార్కెట్లోకి రాలేదు. అయితే చాలా కంపెనీలు ఇప్పటికే తమ ఐపీవోలు ఫ్లోట్ చేసే ప్రక్రియను ప్రారంభిస్తూ ముసాయిదా పత్రాలను మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ వద్ద దాఖలు చేస్తున్నాయి. అయితే మార్కెట్ల పతనం వేళ చాలా మంది పెట్టుబడిదారులు లిస్టింగ్ లాభాల కోసం ఐపీవోలపై బెట్టింగ్ వేసేందుకు అవకాశాలను పరిశీలిస్తున్నారు.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది పూణే కేంద్రంగా పనిచేస్తున్న ఆటోమోటివ్స్ తయారీ సంస్థ బెల్రిస్ ఇండస్ట్రీస్ ఐపీవో ప్రణాళికల గురించే. ఇప్పటికే కంపెనీ తన రూ.2150 కోట్ల ఐపీవోను ఫ్లోట్ చేసేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభించి సెబీ వద్ద పత్రాలను సమర్పించింది. అయితే కంపెనీ తీసుకొస్తున్న ఐపీవో పూర్తిగా తాజా ఈక్విటీని కలిగి ఉంటుందని, ఎలాంటి ఆఫర్ ఫర్ సేల్ ఇందులో ఉండబోదని కంపెనీ వెల్లడించింది. అయితే ఐపీవో ప్రారంభించటానికి ముందే ప్రీఐపీవో ప్లేస్మెంట్ ద్వారా దాదాపు రూ.430 కోట్లను సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

కంపెనీ తాజా ఐపీవో ద్వారా సమీకరిస్తున్న మెుత్తంలో రూ.1618.08 కోట్లను రుణాల చెల్లింపుల కోసం వినియోగించాలనే లక్ష్యంతో వస్తోంది. ఈ చర్య కంపెనీ డెట్ ఈక్విటీ రేషియోను మెరుగుపరుస్తుందని తెలుస్తోంది. అలాగే మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించాలని కంపెనీ నిర్ణయించింది. సెప్టెంబరు 30, 2024 నాటికి కంపెనీ మొత్తం రుణాలు ఏకీకృత ప్రాతిపదికన రూ.2,588.3 కోట్లుగా ఉంది. ఇందులో ఫండ్ ఆధారిత రుణాలు, రుణాలపై పెరిగిన వడ్డీలు కలిపి ఉన్నాయి.
కంపెనీ వ్యాపారం..
గతంలో బద్వే ఇంజినీరింగ్ లిమిటెడ్ పేరుతో పిలవబడిన కంపెనీ ప్రస్తుతం బెల్రిస్ ఇండస్ట్రీస్ గా కొనసాగుతోంది. ఇక కంపెనీ వ్యాపారాన్ని పరిశీలిస్తే.. ప్రధానంగా ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు, నాలుగు చక్రాల వాహనాలు, వాణిజ్య వాహనాలు, అగ్రి-వాహనాల కోసం అనేక భద్రతా క్లిష్టమైన వ్యవస్థలు, ఇతర ఇంజనీరింగ్ పరిష్కారాలను అందిస్తుంది. ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో మెటల్ ఛాసిస్ సిస్టమ్‌లు, పాలిమర్ భాగాలు, సస్పెన్షన్ సిస్టమ్‌లు, బాడీ-ఇన్-వైట్ కాంపోనెంట్‌లు, ఎగ్జాస్ట్ సిస్టమ్‌లు ఉన్నాయి.
1996లో స్థాపించబడిన కంపెనీ ఆటోమెుబైల్ స్పేర్స్ తయారీ రంగంలో భారత్ ఫోర్జ్, యునో మిండా, మదర్సన్ సుమి వైరింగ్ ఇండియా, JBM ఆటో, ఎండ్యూరెన్స్ టెక్నాలజీస్, మిండా కార్పొరేషన్ వంటి కంపెనీలతో వ్యాపారంలో పోటీ పడుతోంది. మెుత్తం మార్కెట్ వ్యాపారంలో కంపెనీ 24 శాతం వాటాను హోల్డ్ చేస్తుండగా.. యూవీలర్ మెటల్ భాగాల తయారీలో మాత్రం టాప్-3 ఆటగాళ్లలో ఒకటిగా కొనసాగుతోంది. కంపెనీ ఉత్పత్తులు బజాజ్ ఆటో, హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా, హీరో మోటోకార్ప్, జాగ్వార్ ల్యాండ్ రోవర్, రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్స్ వంటి ప్రముఖ కంపెనీలకు సరఫరాను కలిగి ఉంది. అలాగే మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర లాభం రూ.310.9 కోట్లుగా ఉంది. ఇదే క్రమంలో కంపెనీ ఆదాయం ఏకంగా రూ. 7,484.2 కోట్లుగా నివేదించబడింది.


Click it and Unblock the Notifications