Stock Crash: నేలకూలిన దిగ్గజ బ్యాంక్ స్టాక్.. 15 శాతం క్రాష్, బ్రోకరేజీల టార్గెట్ ఇదే..
Indusind Bank: దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం రెండవ త్రైమాసిక ఫలితాలను ట్రాక్ చేస్తున్నాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ త్రైమాసికంలో చాలా కంపెనీల ఆర్థిక ఫలితాలు పెట్టుబడిదారులను నిరాశకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశీయ అగ్ర ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం షేర్లు నేడు దిగజారాయి.
ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటిగా ఉన్న ఇండస్ఇండ్ బ్యాంక్ లిమిటెడ్ షేర్లు నేడు ఇంట్రాడేలో దాదాపు 18% వరకు క్షీణతను చూశాయి. గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత బ్యాంక్ తన త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఇండస్‌ఇండ్ బ్యాంక్ సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకీకృత నికర లాభంలో క్షీణతను నమోదు చేసింది. లాభాలు సంవత్సరానికి ఏడాదికి 39.5% క్షీణించి రూ.1,331 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బ్యాంక్ నికర లాభం రూ.2,181గా ఉంది. రెండవ త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 5% పెరిగి రూ.5,347 కోట్లకు చేరుకుంది. నేడు ఇంట్రాడేలో ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్లు 15 శాతం తగ్గి రూ.1,088.05 వద్ద ట్రేడవుతున్నాయి. దీని తర్వాత నష్టాలు మరింతగా పెరిగి 18 శాతం తగ్గుదలతో ఇన్వెస్టర్లకు భారీ నష్టాలను కలిగించాయి.

లాభదాయకతకు కీలక సూచిక అయిన బ్యాంక్ నికర వడ్డీ మార్జిన్ గత ఏడాది కాలంలో 4.29% నుంచి 4.08%కి పడిపోయింది. అలాగే ఇండస్‌ఇండ్ బ్యాంక్ జూన్ త్రైమాసికంలో ఆస్తుల నాణ్యత క్షీణతను చూసింది. జూన్‌లో స్థూల ఎన్‌పీఎ 2.02% నుంచి 2.11% వద్ద ఉండగా, జూన్‌లో నికర ఎన్‌పిఎ 0.64% వద్ద ఉంది. అలాగే జూన్‌లో స్థూల నిరర్థక ఆస్తులు రూ.7,126.8 కోట్ల నుంచి రూ.7,638.5 కోట్లకు పెరిగాయి. ఇదే క్రమంలో నికర నిరర్థక ఆస్తులు రూ.2,282కి పెరిగాయి. లాభం క్షీణించినప్పటికీ ఇండస్‌ఇండ్ బ్యాంక్ రుణ వృద్ధిలో 13% వార్షిక వృద్ధిని రూ.3.57 లక్షల కోట్లకు నమోదు చేసింది. డిపాజిట్లు కూడా బలమైన వృద్ధిని సాధించి 15% పెరిగి రూ.4.12 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
బ్రోకరేజీల మాట ఏంటి..?
నోమురా బ్యాంక్ స్టాక్‌పై దాని "తటస్థ" వైఖరిని కొనసాగించింది. ఈ క్రమంలో టార్గెట్ ధరను మునుపటి రూ.1,580 స్థాయి నుంచి రూ.1,220కి తగ్గించింది. బలహీనమైన ఆర్థిక ఫలితాలపై బ్రోకరేజ్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే సమయంలో మరో బ్రోకరేజ్ Macquarie స్టాక్‌పై దాని "అత్యుత్తమ పనితీరు" రేటింగ్‌ను అందిస్తూ టార్గెట్ ధరను రూ.1,690గా నిర్ణయించింది. బ్యాంక్ ఆస్తి నాణ్యత తగ్గటంపై బ్రోకరేజ్ రాబడి అంచనాలను FY2025కి 1.8% అని పేర్కొంది.
ఇదే క్రమంలో సిటీ గ్రూప్ కొనుగోలు రేటింగ్ కొనసాగిస్తూ టార్గెట్ ధరను గతంలో అందించిన రూ.2010 స్థాయి నుంచి రూ.1630కి తగ్గించింది. ఈ క్రమంలో 2025-2027 ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంక్ ఆదాయం అంచనాను 18% నుండి 22% తగ్గించింది. ప్రస్తుతం ఇండస్ఇండ్ బ్యాంక్ కరవ్ చేస్తున్న దాదాపు 50 మంది విశ్లేషకుల్లో 41 మంది బ్యాంక్ షేర్లకు BUY రేటింగ్ కలిగి ఉన్నారని వెల్లడైంది.
Note: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.


Click it and Unblock the Notifications