బక్రీద్ సెలవుల్లో కన్ఫ్యూజన్.. మే 28న స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా? క్లారిటీ వచ్చేసింది!
ఈ వారం స్టాక్ మార్కెట్ (stock market) లో ట్రేడింగ్ చేసే ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అందరూ ఒక ముఖ్యమైన విషయంపై ఆరా తీస్తున్నారు. బక్రీద్ (ఈద్-ఉల్-అజ్హా) పండగ వస్తుండటంతో.. ఈ వారం మార్కెట్‌కు సెలవు ఎప్పుడు అనే దానిపై అందరిలోనూ చిన్న కన్ఫ్యూజన్ మొదలైంది. వేర్వేరు రాష్ట్రాల్లో పండగ తేదీల మార్పుల వల్ల ఈ గందరగోళం నెలకొంది. మరి ఈ వారంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లు ఓపెన్ ఉంటాయా లేక క్లోజ్ అవుతాయా అనే దానికి అధికారికంగా క్లారిటీ వచ్చేసింది.
ఎన్ఎస్ఈ, బీఎస్ఈ విడుదల చేసిన అధికారిక హాలిడే క్యాలెండర్ ప్రకారం.. బక్రీద్ సందర్భంగా మే 28, 2026 (గురువారం) నాడు భారత స్టాక్ మార్కెట్ (stock market) కు పూర్తి సెలవు ఉంటుంది. ఆ రోజున ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (SLB) సెగ్మెంట్లలో ఎలాంటి ట్రేడింగ్ జరగదు.

తేదీలు ఎందుకు మారాయి?
నిజానికి మొదట్లో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మే 27న బక్రీద్ సెలవుగా ప్రకటించాయి. కానీ, చంద్రుని దర్శనాన్ని బట్టి మత పెద్దలు పండగ తేదీని మార్చడంతో తెలంగాణ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు తమ అధికారిక ప్రభుత్వ సెలవులను మే 28కి మారుస్తూ జీవోలు ఇచ్చాయి.
రాష్ట్రాల్లో ఇలాంటి మార్పులు జరిగినప్పటికీ.. దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ బోర్డులు మాత్రం తాము ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌కే కట్టుబడి ఉన్నాయి. దీని ప్రకారం, మే 27న స్టాక్ మార్కెట్ (stock market) ఎప్పటిలాగే నార్మల్‌గా పనిచేస్తుంది. కానీ మరుసటి రోజు, అంటే మే 28న మాత్రం మార్కెట్లు పూర్తిగా బంద్ అవుతాయి.
ట్రేడర్లు ఏం చేయాలి?
ఈ సెలవు వల్ల ట్రేడర్లకు ఈ వారం కేవలం నాలుగు రోజులు మాత్రమే ట్రేడింగ్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O), కరెన్సీ డెరివేటివ్స్‌లో పని చేసేవారు తమ పొజిషన్లను, సెటిల్‌మెంట్లను ఈ సెలవును దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది. సెలవుల వల్ల డెలివరీల మార్జిన్లలో తేడాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందే అలర్ట్‌గా ఉండాలి.
అయితే, కమోడిటీ మార్కెట్ (MCX) మాత్రం కొంచెం డిఫరెంట్‌గా పనిచేయబోతోంది. మే 28న ఉదయం సెషన్‌లో ఎంసీఎక్స్ మూతపడినప్పటికీ.. సాయంత్రం జరిగే కమోడిటీ ట్రేడింగ్ సెషన్ మాత్రం ఎప్పటిలాగే ఓపెన్ అవుతుందని నివేదికలు చెబుతున్నాయి.
ఇన్వెస్టర్లపై దీని ప్రభావం ఎంత?
సాధారణంగా ఇలాంటి తక్కువ రోజులు ట్రేడింగ్ జరిగే వారాల్లో మార్కెట్లో ఒడిదుడుకులు (Volatility) ఎక్కువగా ఉంటాయి. పండగకు ముందు, ఆ తర్వాత ట్రేడర్లు తమ పొజిషన్లను మార్చుకోవడం వల్ల మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే.. స్టాక్ మార్కెట్ (stock market) మూతపడిన రోజున మ్యూచువల్ ఫండ్ ఎన్ఏవీ (NAV)ల లెక్కింపు, ఎస్‌ఐపీ (SIP) ప్రాసెసింగ్ టైమ్‌లైన్స్, , బ్యాంకింగ్ లావాదేవీలలో కూడా స్వల్ప ఆలస్యం జరిగే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications