Mukesh Ambaniకి బ్యాడ్ న్యూస్.. ఏకంగా రూ.91,140 కోట్లు కోల్పోయిన బిలియనీర్, ఏమైందంటే..

Reliance Industries: ముఖేష్ అంబానీ భారతదేశంలోని అత్యంత ధనిక వ్యాపారవేత్తతో పాటు ఆసియాలోనే సంపన్నుడు. 2024లో డిసెంబర్ మాసం ఈ దిగ్గజ వ్యాపారవేత్తకు అస్సలు కలిసిరాలేదు. టెలికాం నుంచి ఆయిల్ వరకు అనేక వ్యాపారాలను కలిగి ఉన్న అంబానీ ప్రస్తుతం భారీ నష్టాన్ని చూస్తున్నారు.

ఇండస్ట్రియలిస్ట్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ స్టాక్ మార్కెట్‌లో తన పతన ధోరణిని కొనసాగిస్తోంది. గడచిన వారంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో రూ.91,140.53 కోట్లు కరిగిపోయింది. అంబానీకి చెందిన రిలయన్స్, టాటాలకు చెందిన టీసీఎస్ ఈక్వీటీ మార్కెట్లలో కొనసాగుతున్న బేర్స్ పంజా కారణంగా వాటి మార్కెట్ వాల్యుయేషన్‌లో భారీ కోతను అనుభవించాయి. ప్రస్తుత పతనం తర్వాత రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.16,32,004.17 కోట్లకు క్షీణించింది. దేశంలోని ఈక్విటీ మార్కెట్లలో టాప్-10 కంపెనీలు తమ మార్కెట్ విలువను సంయుక్తంగా రూ.4.95 లక్షల కోట్ల మేర కోల్పోయాయి.

Badnews to Mukesh Ambani as Reliance Industries lost 91140 crores market Cap in last week

జూన్ 2022 నుంచి భారతదేశ ఈక్విటీ మార్కెట్ దాని అత్యంత వారాంతపు క్షీణతను నమోదు చేశాయి. వాస్తవానికి అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు ఇటీవల తన వడ్డీ రేట్లను తగ్గించినట్లు ప్రకటించటంతో పాటు రానున్న కాలంలో వడ్డీ రేట్ల తగ్గింపు నెమ్మదిస్తుందనే సంకేతాలను ఇచ్చింది. దీంతో దేశీయ మార్కెట్లతో పాటు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ల సెంటిమెంట్లు గణనీయంగా క్షీణతకు దారితీశాయి. 2025లో గతంలో ఊహించిన నాలుగు రేటుకు బదులుగా కేవలం రెండు రేట్ల కోతలకు మాత్రమే ఉంటాయని ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ పేర్కొనటంతో మార్కెట్లలో ఇన్వెస్టర్ల విశ్వాసం భారీగా దెబ్బతింది.

అంబానీ కొత్త కొనుగోళ్లు..
దేశంలోని అత్యంత సంపన్న వ్యక్తి ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ హెల్త్‌కేర్ కంపెనీలో తన తాజా కొనుగోలు గురించి కీలక ప్రకటన చేసింది. దేశంలోని అతిపెద్దదైన ముంబై IIAలో మెజారిటీ 74 శాతం వాటాను రూ.1,628 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదే క్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికా హెల్త్ కేర్ రంగంలో పెట్టుబడులు పెట్టింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ డిజిటల్ హెల్త్ లిమిటెడ్, US ఆధారిత హెల్త్ అలయన్స్ గ్రూప్ ఇంక్‌లో 45% వాటాను కొనుగోలుకు ఒప్పందం కూదుర్చుకున్నట్లు వెల్లడైంది.

Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+